• తప్పించుకునేందుకు నానా తంటాలుపడ్డ వైనం

  • దర్యాప్తు అధికారులనే ఆశ్యర్యపర్చిన ప్లాస్టిక్ సర్జరీకీ సిద్ధపడ్డ తీరు

లండన్, మార్చి 21 (న్యూస్‌టైమ్): మొత్తానికి ఎన్నికల ముందు కేంద్రం గట్టి సాహసమే చేసింది. భారత్‌కు చెందిన ఆర్ధిక నేరగాడు నీరవ్ మోదీ వ్యవహారంలో ఇన్నాళ్లూ చూసీచూడనట్లు వచ్చిందన్న అపవాదును తుడిచేందుకు అన్నట్లు నరేంద్రమోదీ సర్కారు బ్రిటన్ పోలీసుల చేత అరెస్టుకు సాహసించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ని వేలకోట్లకు మోసగించి లండన్‌ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని ఎట్టకేలకు బ్రిటన్‌ పోలీసులు అరెస్టు చేశారు. లండన్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లిన నీరవ్‌ మోదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంవత్సరానికి నీరవ్‌ పోలీసులకు చిక్కాడు.

అయితే, ఈ సంవత్సర కాలంలో కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడట. ఒకానొక దశలో ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నాడట. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి చాలా రోజుల ముందు 2018 జనవరిలోనే నీరవ్‌, మరో ప్రధాన నిందితుడు మెహుల్‌ ఛోక్సీ విదేశాలకు పారిపోయారు. వీరి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించడంతో నీరవ్‌, ఛోక్సీలపై అరెస్టు వారెంట్‌ కూడా జారీ అయ్యింది. అయితే, నీరవ్‌ లండన్‌లోని వెస్ట్‌ఎండ్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఇటీవల టెలిగ్రాఫ్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో నీరవ్‌ ఆచూకీపై స్పష్టత వచ్చింది.

మరోవైపు, గతేడాది జనవరి నుంచి నీరవ్‌ లండన్‌లోనే ఉన్నాడన్నది కూడా నిర్ధారణ అయింది. కేసు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడట మోదీ. అతి చిన్న పసిఫిక్‌ ద్వీపమైన వనౌటు దేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం, యూకేలో ఆశ్రయం పొందేందుకు పెద్ద పెద్ద న్యాయ సంస్థలను కలవడం, సింగపూర్‌లో శాశ్వత నివాసం కోరడం లాంటివి చేశాడట. ఒక దశలో తన రూపాన్ని మార్చుకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నీరవ్‌ ఆచూకీ బయటకు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే లండన్‌లోని మెట్రో బ్యాంక్‌ శాఖలో ఖాతా తెరవడానికి వెళ్లిన నీరవ్‌ మోదీని అక్కడి సిబ్బంది ఒకరు గుర్తుపట్టి పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. త్వరలోనే ఆయనను భారత్‌కు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలావుండగా, నీరవ్‌కు సంబంధించిన కొన్ని వస్తువులను వేలం వేయడానికి పీఎంఎల్‌ఏ నుంచి ఈడీకి అనుమతి లభించింది. దీంతో నీరవ్‌కు చెందిన 173 అత్యంత ఖరీదైన పెయింటింగ్స్‌, 11 కార్లను వేలం వేయనున్నారు. దీంతో పాటు నీరవ్‌ భార్య అమీ మోదీపై పీఎంఎల్‌ఏ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. లండన్‌లోని హోల్‌బర్న్‌ మెట్రో స్టేషన్లో నీరవ్‌ మోదీ తిరుగుతుండగా పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడిని గురువారం సంబంధిత కోర్టులో హాజరుపరచగా వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 29కి వాయిదా వేసింది.

అలాగే అతడు బెయిల్‌ కోసం అతడు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మార్చి 29 వరకు అతడికి కస్టడీ విధించింది. లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌ వీధిలో నీరవ్‌మోదీని టెలిగ్రాఫ్‌ పాత్రికేయుడు గుర్తించి పలు ప్రశ్నలు సంధించాడు. అన్నింటికి నీరవ్‌ ‘నోకామెంట్‌’ అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం పాత్రికేయుడి నుంచి తప్పించుకునేందుకు నీరవ్‌ ప్రయత్నించాడు. తొలుత ఓ క్యాబ్‌ ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ క్యాబ్‌ డ్రైవర్‌ నిరాకరించాడు. అనంతరం మరో క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అయితే, ఇంతకుముందు లండన్‌ కోర్టు అతడికి అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేసింది. కాగా, ఇదే తరహా నేరంలో తప్పించుకు తిరుగుతున్న విజయ్‌మాల్యాను పట్టుకోలేకపోయినా, కనీసం ఎన్నికల ముందు పరువు నిలబెట్టుకునేందుకు అన్నట్లు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నీరవ్ మోదీనైనా బ్రిటన్ సహాయంతో పట్టుకోగలిగింది. మోదీని భారత్ రప్పించాక విచారణలో వెలుగులోకి వచ్చే విషయాలను బట్టి అతనిపై తదుపరి చర్యలు ఉంటాయన్నది వాణిజ్య వర్గాల కథనం.

4 COMMENTS

  1. I simply want to tell you that I am just beginner to weblog and really enjoyed this web site. Most likely I’m want to bookmark your website . You definitely have fabulous stories. Thanks a lot for revealing your blog.

  2. I have a MacBook computer and I want my pictures that are on my computer to be on my Motorola Razr 2 v9. I have a memory card and a memory card adapter. When I put the card in the adapter, the computer recognizes it. And the pictures that I have on my phone can transfer to the computer with no problem. But the pictures on my computer won’t transfer to my phone. All that shows up is a big red “x” on a black screen. Am I doing something wrong? The phone company is AT&T..

  3. I am very new to web design as I have no prior experience as well as recognize little HTML. I just wish to know what the best software is to buy to create blog sites. I have downloaded and install CS5 Layout Premium with Dreamweaver as well as Photoshop, yet I recognize this is a little sophisticated for me and also costly!!!. Does anyone have suggestions of software program or means to construct blogs as well as internet sites conveniently and economical?. MANY THANKS!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here