• ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం

 • గాజువాక నియోజక వర్గంలో బలమైన నేత

 • పిలిచిన వెంటనే పలికే గుణం

 • ఈసారి ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకే

విశాఖపట్నం, మార్చి 22 (న్యూస్‌టైమ్): మనసున్న మారాజు.. పిలవగానే పలికే నేత.. ఎవరు కష్టాల్లో ఉన్నా వెంటనే స్పందించే గుణం కల వ్యక్తి అతడే తిప్పల నాగిరెడ్డి… పదవి ఉన్నా, లేకపోయినా ఒకటే తీరు.. ఒకటే మనస్తత్వం.. ప్రస్తుతం గాజువాక నియోజక వర్గ ప్రజలు ఇతని నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్‌ కాంగ్రెస్‌ గాజువాక నియోజక వర్గ సమన్వయ కర్తగా ఉన్న తిప్పల నాగిరెడ్డి ఆది నుంచి పార్టీ కోసం అహార్నిశలూ పనిచేసిన వ్యక్తిగా పార్టీలో గుర్తింపు పొందారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయడానికి సన్నద్దం అవుతున్నారు. స్దానిక ప్రజానీకం కూడా తిప్పల పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నారు.

ఎన్నికల్లో నల్లేరు మీద బండి నడకలా నాగిరెడ్డి గెలుపు ఖాయమని పరిశీలకులు పేర్కోంటున్నారు. నిరంతరం ప్రజాసమస్యలు, వాటి పరిష్కారం కోసం తపించే తిప్పల నాగిరెడ్డి గడచిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి తన సత్తా చూపించారు. 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా పోటీ చేయడానికి సిద్ద పడగా కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా ఈయనను పక్కన బెట్టారు.

దీంతో ఆగ్రహించిన తిప్పల తన కున్న ప్రజాబలాన్ని పార్టీ పెద్దలకు చూపించాలనే ఉద్దేశ్యంతో పారిశ్రామిక ప్రాంతంలో నాగిరెడ్డి ప్యానెల్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దులకు వ్యతిరేకంగా రెబల్స్‌ను రంగంలోకి దించి తన సత్తాను చాటారు. 55వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్దిగా గెలిచి తనకున్న ప్రజాబలాన్ని చాటి చెప్పారు. అంతేకాకుండా తన కోడలిని కూడా 62వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్దిగా గెలిపించుకుని కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌ను విసిరారు.

ఇదే ఊపులో కాంగ్రెస్‌ పార్టీకి దూరం అయ్యి , 2009 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్దానానికి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చరిష్మాను, స్దానికంగా కాపు సామాజిక వర్గానికి ఎదుర్కోని, ఓడినా రెండో స్దానంలో నిలిచి శభాష్‌ అనిపించుకున్నారు తిప్పల నాగిరెడ్డి. తరువాత వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో తిరిగి అసెంబ్లీ స్దానానికి పోటీ చేశారు. టీడీపీ, బిజెపీ, మద్దతుగా అప్పుడు నిలిచిన పవన్‌ కళాఁణ్‌ చరిష్మాను ఎదుర్కోని తక్కువ ఓట్లతో పరాజయం చెందినా తనకున్న పట్టును నిరూపించుకుని ప్రత్యర్దులకు ముచ్చెమటలు పట్టించారు.

సుమారు రెండున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మమైకమైన తిప్పల నాగిరెడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు ప్రజాసహాకారంతో నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే పార్టీ డిమాండ్‌కు తోడుగా పోరాటాలు చేయడంతో పాటు విభజన హామీల్లో భాగంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం అలుపెరుగని పోరాటం పార్టీ శ్రేణులతో కలిపి చేస్తూనే ఉన్నారు.

ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసే నేత మరోకరు నియోజక వర్గంలో తారసపడరన్నది వాస్తవం. ఇటువంటి వ్యక్తికి పదవి ఉంటే నియోజక వర్గానికి ఎంతో మేలు జరుగుతుందనే భావన స్దానికుల్లో బలంగా నాటుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నాగిరెడ్డి గెలుపు ఖాయంగా కనబడుతుంది పరిశీలకులు పేర్కోంటున్నారు. నియోజక వర్గ ప్రజలు కూడా ఇదే మాట అనడం గమనార్హం.

2 COMMENTS

 1. Hey,
  lately I have finished preparing my ultimate tutorial:

  +++ [Beginner’s Guide] How To Make A Website From Scratch +++

  I would really apprecaite your feedback, so I can improve my craft.

  Link: https://janzac.com/how-to-make-a-website/

  If you know someone who may benefit from reading it, I would be really grateful for sharing a link.

  Much love from Poland!
  Cheers

 2. I just want to tell you that I am just new to blogging and site-building and truly liked your blog site. Almost certainly I’m planning to bookmark your blog . You really have impressive articles and reviews. Kudos for sharing with us your webpage.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here