తెలుగుదేశం పార్టీ… భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు. 13వ లోక్‌సభ (1999-2004)లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచినది.

నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలొ సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమితెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్ధులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 500 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది.

తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా ”మదరాసీ”లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, ఒక్క రూపాయి మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భ్రుతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే చెల్లింది. 1988లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది. 1988, 1994ల మధ్యకాలంలో, ఎన్‌.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్‌-టైం విలేఖరి, రాజకీయ చరిత్ర విద్యార్ధి అయిన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడు.

దేశంలోని కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కి ప్రత్యామ్నాయంగా నేషనల్‌ ఫ్రంట్‌ కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్‌ని ప్రధానిని చేశారు నేషనల్‌ ఫ్రంట్‌కు చైర్మెన్‌గా వ్యవహరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు రెండవసారి ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి ఆర్ధిక మంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.

అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్‌.టి.రామారావుకు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్టీ రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం(4 సంవత్సరాలు రామారావుని ప్రజలు ఎన్నుకున్నది + 5 సంవత్సరాలు చంద్రబాబుని ప్రజలు ఎన్నుకున్నది) చరిత్ర సృష్టించాడు. 1996లో రామారావు మరణానికి పిదప ఆయన భార్య లక్ష్మీపార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్ధులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మళ్లీ చీల్చినది.

అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్దులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికలలొ అత్యధిక స్తానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది. చంద్రబాబునాయుడు హైదరాబాదును, రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.

3 COMMENTS

  1. I am really impressed with your writing skills
    and also with the layout on your weblog. Is this a paid theme or did you customize it yourself?
    Either way keep up the nice quality writing, it is rare to see a great blog
    like this one today.

  2. [url=https://colchicineiv.com/]colchicine online[/url] [url=https://tadacipl.com/]generic tadacip[/url] [url=https://acyclovirz.com/]acyclovir 800[/url] [url=https://cephalexin250.com/]cephalexin 500mg[/url] [url=https://motilium1.com/]motilium[/url] [url=https://cialis0.com/]low price cialis[/url] [url=https://clomid100.com/]clomid[/url] [url=https://celebrex400.com/]buy celebrex[/url] [url=https://cipromd.com/]cipro buy[/url] [url=https://amoxicillin100.com/]amoxicillin[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here