హైదరాబాద్, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. రూ.40 లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారణ జరగ్గా మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50 లక్షల చెక్కును మోహన్‌బాబు దర్శకుడికి అందించారు. అయితే, ఆ చెక్‌ నగదుగా మారకపోవడంతో వైవీఎస్‌ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.40.లక్షలు చెల్లించేందుకు సమ్మతి తెలపడంతో న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఈ సొమ్మును చెల్లించేందుకు మోహన్‌బాబు 30 రోజుల గడువు కోరారు.

ఇంకోవైపు, దర్శకుడు చౌదరి తనపై కావాలనే చెక్‌ బౌన్స్‌ కేసు వేశారని మోహన్‌బాబు ప్రత్యారోపణకు దిగారు. ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు అధికారికంగా మీడియాకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

‘‘2009లో ‘సలీమ్‌’ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు కావాల్సిన మొత్తం పారితోషికాన్ని దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్‌ ఇచ్చాం. ‘సలీమ్‌’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో చౌదరితో చేయాల్సిన మరో సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని చౌదరికి చెప్పాం. చెక్‌ను బ్యాంక్‌లో వేయొద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంక్‌లో వేసి బౌన్స్‌ చేశారు. నాపై చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని సెషన్స్‌ కోర్టులో ఛాలెంజ్‌ చేస్తున్నాం. కొన్ని వార్తా ఛానల్స్‌లో మాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మొద్దు’’ అని పేర్కొన్నారు.

18 COMMENTS

 1. I’ve been exploring for a little bit for any high-quality articles or blog posts
  in this sort of area . Exploring in Yahoo I ultimately stumbled upon this web site.
  Reading this information So i’m satisfied to
  express that I have an incredibly good uncanny feeling I found
  out just what I needed. I most indubitably will make
  certain to do not overlook this web site and provides it a look regularly.

 2. Hey I know this is off topic but I was wondering if you knew of any
  widgets I could add to my blog that automatically tweet my newest twitter updates.
  I’ve been looking for a plug-in like this for quite some
  time and was hoping maybe you would have some experience
  with something like this. Please let me know if you run into anything.
  I truly enjoy reading your blog and I look forward to
  your new updates.

 3. Thank you, I have recently been searching for information approximately this topic for ages and yours is the greatest I’ve found out till now.

  But, what in regards to the conclusion? Are you certain about the supply?

 4. Oh my goodness! Awesome article dude! Thanks, However I am encountering problems with your RSS.

  I don’t know why I am unable to subscribe to it. Is there anyone else getting similar
  RSS problems? Anyone who knows the answer will you kindly respond?
  Thanks!!

 5. I simply want to say I am newbie to blogging and site-building and seriously savored this blog. Probably I’m want to bookmark your website . You actually come with incredible posts. With thanks for sharing with us your web page.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here