• అలంకార ప్రాయంగా మారిన కుళాయి కనెక్షన్లు

  • పత్తికొండలో అడుగంటిపోయిన భూగర్భజలాలు

కర్నూలు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): భూగర్భజలాలు అడుగంటిపోయాయి. రక్షిత మంచినీటి పథకాలు అటకెక్కాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండల ప్రజలకు నెలరోజుల నుంచి నీళ్లు రావడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చే నీటి కోసం ప్రజలు కుస్తీ పడుతున్నారు. ఎన్నో సార్లు అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నా, తాగునీటి కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు. 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బండగట్టు వాటర్ స్కీం ఎన్నడూ గుక్కెడు మంచినీళ్లు అందించిన దాఖలాలు లేవు.

పత్తికొండ గ్రామంలో దాదాపు 30 వేలమంది నివాసముంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో 6 ఓవర్ హెడ్ ట్యాంకులున్నాయి. దీని కింద 2 వేల పబ్లిక్ కుళాయికనెక్షన్లు, 532 వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు, 30 చేతిపంపులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ అలంకార ప్రాయంగానే ఉన్నాయి. నీటి ఎద్దడిని తట్టుకోలేక ఆగ్రహించిన మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఫర్నీచర్‌ను బయటపడేసి నిరసన తెలిపారు. తమ దినసరి కూలీ డబ్బులో సగం నీటి ఖర్చులకే సరిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఎండలు ఓ వైపు నీటి కొరతలు ఇంకోవైపు ఊర్లోనే ఉన్నా, ఎడారి బతుకులే. చుక్కనీటి కోసం ఎడారిలో ఒయాసిస్సులా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అందుకు ప్రత్యక్షసాక్ష్యమే పత్తికొండ గ్రామం. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. రక్షిత మంచినీటి పథకాలు అటకెక్కాయి.కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండల ప్రజలకు నెలరోజుల నుంచి నీళ్లు రావడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చే నీటి కోసం ప్రజలు కుస్తీలు పట్టాల్సిందే.ఎన్నో సార్లు అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నా,తాగునీటి కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు.రూ.2కోట్లు వ్యయంతో చేపట్టిన బండగట్టు వాటర్ స్కీం ఎన్నడూ గుక్కెడు మంచినీళ్లు అందించిన దాఖలాలు లేవు.

మరోవైపు, వేసవి కాలం వచ్చిందో లేదో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఒకవైపు భానుడు ప్రతాపం చూపెడుతుంటే నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లా పత్తికొండ మండల ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. వేళాపాళా లేకుండా వస్తున్న నీటి కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ పనులకు సైతం వెళ్లలేకపోతున్నారు. పత్తికొండ పట్టణంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ 20 వార్డుల్లో సుమారుగా 30 వేల మంది నివాసముంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో 6 ఓవర్‌ హెడ్ ట్యాంకుల వరకు నిర్మించగా అవి అలంకార ప్రాయంగా మారాయి. నీటి ఎద్దడిని తట్టుకోలేక మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించినా అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదు. పంచాయతీ నీళ్లు సరిగా రాకపోవడంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు.

అయితే నీటి కొనుగోలుకే సగం కూలి డబ్బు ఖర్చైపోతోందని దినసరి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బండగట్టు వాటర్ స్కీం ఎందుకూ కొరగాకుండా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సరైన ప్రణాళికతో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, బిరబిర పరుగులిడాల్సిన కృష్ణానది నీరులేక వెలవెలబోతోంది. గత దశాబ్దాన్నర కాలంలో ఏ నాడు కూడాఈ పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈ ఏడాది తక్కువ స్థాయిలో వర్షాపాతం నమోదు కావడంతో గతేడాది జూలై నుంచి నవంబరు వరకు 58 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలాశయానికి చేరాయి.

ఈ అరకొర నీటిని నిల్వ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తాగు నీటి అవసరాల పేరుతో తెలంగాణకు, కోస్తా ప్రాంతాలకు తరలించారు. రాయల సీమకు మాత్రం చుక్క నీటిని వదలలేదు. దీనిపై అప్పట్లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రైతు సంఘాలు, ఇతర పార్టీలు ఆందోళనలు చేసినా ఈ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు అప్పట్లో పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ రోజుకు కూడా కృష్ణా డెల్టాలో తాగునీటి ఇబ్బందులు రాయలసీమ కంటే తక్కువగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారనే ప్రేమతోనో లేక రాయలసీమ వాసులు తమ పార్టీని ఆదరించలేదనే కోపంతోనో ఇప్పటికీ కూడా డెడ్‌స్టోరేజ్‌కి చేరిన శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి కోసమని దిగువకు నీటిని తీసుకెళ్తున్నారు.

గత దశాబ్దాన్నర కాలంలో ఇంత దిగువ వరకు నీటిని వాడుకోలేదని అధికార గణాంకాలే చెబుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్థి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు సామర్థ్యం. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి నీటి చేరికలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సాధారణంగా మే చివరికి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకునేది. అయితే తక్కువ వర్షపాతంతో మార్చి మొదటి వారానికే డెడ్ స్టోరేజీకి చేరుకుంది. అయినా, నీటిని తాగు నీటి పేరుతో నాగర్జున సాగర్‌కు తీసుకుపోతున్నారు.

ఇలా తీసుకెళ్లడంతో ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయి నల్లమల అడవుల్లోని వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. ఇదే అభిప్రాయంతో కొందరు పర్యావరణవేత్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.