సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి

హైదరాబాద్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): మహాత్మా జ్యోతిరావు ఫూలే 193వ జయంతి సందర్భంగా అంబర్ పేట చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారధి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫూలే సమాజాభివృద్ధికి చేసిన సేవలు మరువలేవన్నారు.

మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావు ఫూలే కృషి అజరామరం అన్నారు. సంఘ సంస్కర్తగా, మహిళా సాధికారత, అంటరానితనం నిర్ములనపై పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు అందరికి చిరస్మరణీయులు అన్నారు. అటువంటి మహనీయున్ని నేటి యువత వారి బంగారు భవిష్యత్తుకును దిశా నిర్దేశం చేసుకోవాలని అయన ఆశాభావం వ్యక్తం చేసారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ అనిత రాజేంద్ర ఫూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బి.సి కార్పొరేషన్ ఎం.డి అలోక్ కుమార్, బి. సి. రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ మల్లయ్య భట్టు, హైదరాబాద్, రంగారెడ్డి బిసి వెల్ఫేర్ అధికారులు విమల దేవి, మంజుల, బిసి బాలుర కాలేజీ విద్యార్థులు, బాలికల హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here