బాబరు… అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను బాబర్ నామంతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ ‘మధ్య ఆసియా’ కు చెందిన వాడు. దక్షిణాసియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను తండ్రివైపున తైమూర్ లంగ్ తల్లి వైపున చెంఘీజ్ ఖాన్ ల వంశాలకు చెందినవాడు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు. 16వ శతాబ్దము తొలినాళ్లలో మంగోల్, తురుష్క, పర్షియన్ మరియు ఆఫ్హానీ యోధులతో కూడిన మొఘల్ సైన్యాలు, తైమూర్ వంశ యువరాజైన, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తాయి.

బాబర్, మధ్య ఆసియా మొత్తాన్ని జయించిన మహాయోధుడు తైమూర్ లాంగ్ యొక్క ముని మనమడు. తైమూర్ 1398లో భారత్ పై డండయాత్రకు విఫలయత్నం చేసి సమర్‌ ఖండ్ కు వెనుదిరిగాడు. తైమూర్ స్వయంగా తాను మరో మంగోల్ యోధుడు చెంగీజ్ ఖాన్ వారసున్నని ప్రకటించుకొన్నాడు. ఉజ్బెక్ లచే సమర్‌ఖండ్ నుండి తరిమివేయబడిన బాబర్ మొదటగా 1504లో కాబూల్ లో తన పాలనను స్థాపించాడు. ఆ తరువాత ఇబ్రహీం లోఢీ పాలిస్తున్న ఢిల్లీ సల్తనతులో అంత:కలహాలను ఆసరాగా తీసుకొని దౌలత్ ఖాన్ లోఢీ (పంజాబ్ గవర్నరు) మరియు ఆలం ఖాన్ (ఇబ్రహీం లోఢీ మామ)ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు. అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షుతులైన 12వేల సైన్యముతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోఢీ యొక్క సమైక్యతలోపించిన లక్ష బలము కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, సుల్తాన్ లోడీని నిర్ణయాత్మకముగా ఓడించాడు.

తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు మరియు ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్. ఆ యుద్ధములో సుల్తాన్ లోఢీ మరణించాడు. ఒక సంవత్సరము తర్వాత (1527) కణ్వా యుద్ధములో చిత్తోర్ రాజు రాణా సింగ్ నేతృత్వములోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకముగా ఓడించాడు. బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము. ఇందులో బాబర్ ఆఫ్ఘన్, బెంగాల్ నవాబు సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్టపరచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు. తన ఐదేళ్ళ చిన్న పాలనాకాలములో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కానీ అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి.

బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యముగా భవిష్యత్తులో భారత ఉపఖండముపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారము చెయ్యగల వారసులను మిగిల్చిపోయాడు. బాబర్ ఫిబ్రవరి 14, 1483 న జన్మించాడు. ఇతడి జన్మస్థలం ఉజ్బెకిస్తాన్ లో ఫెర్గనా లోయ లోని ‘అందిజాన్’ పట్టణం. ఇతని తండ్రి “ఉమర్ సేహ్ మిర్జా” ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు ‘ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్’. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క (‘టర్కిక్ తెగ’) ప్రజలుగా మార్పు చెందారు.

పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇతడి మాతృభాష చగ్తాయి భాష, టర్కిక్ భాష, పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు. ఇతను తన స్వీయచరిత్ర(ఆత్మకథ)ను ‘బాబర్ నామా’ పేరిట పర్షియన్ భాషలో రచించాడు. భోపాల్ లోని ప్రభుత్వ గ్రంధాలయములో దొరికిన పత్రాల ప్రకారం బాబరు హుమాయూన్ కు ఈ క్రింది వీలునామా వ్రాసాడు. నా ప్రియ కుమారునికి, ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి… నీ మనస్సు లో మతవిద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు, ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తాయి. ప్రజల ప్రార్ధనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు.

దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారంచేయటానికి , ఇతర మతాలను అన్యాయముతో, కౄరంగా అణచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమా, ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు, సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే, నీ ప్రజల గుణగణాలను చూడు.

10 COMMENTS

 1. Hello there! I know this is kinda off topic but I was wondering
  if you knew where I could get a captcha plugin for my comment
  form? I’m using the same blog platform as yours and I’m having
  difficulty finding one? Thanks a lot!

 2. Hello there, just became aware of your blog through Google, and
  found that it is really informative. I am gonna watch out for brussels.
  I’ll appreciate if you continue this in future. Many people will be benefited from your writing.
  Cheers!

 3. Hi i am kavin, its my first occasion to commenting anyplace, when i read this piece
  of writing i thought i could also make comment due to this sensible paragraph.

 4. hello there and thank you for your info – I’ve definitely picked up something new from right here.
  I did however expertise a few technical issues using this site,
  as I experienced to reload the web site many times previous to I could get it
  to load properly. I had been wondering if your hosting is OK?
  Not that I am complaining, but slow loading instances times will very frequently affect your placement in google and could damage your high-quality score if advertising and marketing with Adwords.
  Well I am adding this RSS to my email and can look out for
  a lot more of your respective exciting content. Make sure you update this again very soon.

Leave a Reply to minecraft pc download Cancel reply

Please enter your comment!
Please enter your name here