హైదరాబాద్, ఏప్రిల్ 19 (న్యూస్‌టైమ్‌): రానురాను తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ప్రజలు పది గంటల తరువాత బయటకు రావాలంటే ఆలోచిస్తున్నారు. ఇంకా మే నెల రాకముందే ఎండలు పెరిగిపోయాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్‌ పిల్లలు స్కూల్‌కి వెళ్లి రావడానికి చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్య ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో రహదారులన్నీ కర్ఫ్యూను తలపించేలా నిర్మానుష్యంగా మారాయి.

మధ్యాహ్నం వేళల్లో ఎండతీవ్రత అధికంగా ఉండడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు వేడి గాలుల ప్రభావం మొదలు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళల్లో కొంతమేర చల్ల గాలులు వీస్తుండడంతో ఉపశమనం కలుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జిల్లాలో 50.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈసారి ఏప్రిల్‌ మూడో వారంలోనే 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక ఏప్రిల్‌ చివరివారం, మేలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా చిత్తూరు రికార్డుల్లోకి ఎక్కింది. సోమవారం మరో 0.3 డిగ్రీలు పెరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తూర్పు బంగాళా ఖాతంలో ఎన్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు, ‘ఎండలు మండుతున్నాయి.. నగర ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి.. వేసవిలో తాగునీటి కష్టాలను పట్టించుకోని దుస్థితిలో ప్రభుత్వం, అధికారులు ఉన్నారు. దీనిపై ప్రజల పక్షాన చూస్తూ ఉరుకోం.. ప్రజలకు నీరు ఇచ్చే దాకా.. ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు.

24/7 సమగ్ర నీటి సరఫరా అని ఆకాశమే హద్దుగా ప్రచారాలు చేశారని, అయినా ఇప్పటి వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టని పరిస్థితులు కనపడుతున్నాయని విమర్శించారు. రూ.460 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రారంభించిన సమగ్ర తాగునీటి పథక నిర్మాణ పనులు నత్తనడక సాగుతుంటే, మే 31లోపు సమగ్ర తాగునీటి ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారుల గణాంకాల ప్రకారమే నిత్యం ప్రతి మనిషికి 14 లీటర్ల నీరు కావాలని, నగర జనాభా ప్రకారం 140 ఎంఎల్‌డీల నీరు కావాల్సి ఉంటే, కేవలం 80 నుంచి 90 ఎంఎల్‌డీల నీరు మాత్రమే అందజేస్తున్నారని ధ్వజమెత్తారు.

వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుగానే సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌తో సిద్ధంగా ఉండి, జనవరిలో చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేశారని అప్పిరెడ్డి మండిపడ్డారు. రూ.5కోట్లతో ప్రతి సంవత్సరం సమ్మర్‌యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తారని, ప్రస్తుతం రూ.2కోట్లు మాత్రమే కేటాయించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుంటూరు నగరానికి ఉండవల్లి నుంచి నులకపేట మీదుగా తక్కెళ్ళపాడు వరకు ప్రత్యేకంగా పైపు లైను నిర్మించే పనులు నత్తే నయం అన్న చదంగా నడుస్తున్నాయన్నారు. భూగర్భ జలాలు వేల అడుగుల్లోతుకు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నీటి ట్యాంకర్‌ల ద్వారా సరఫరా చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. నీటి ఎద్దడిని పరిష్కరించకపోతే ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ప్రణాళికలు లేకుండా అధికారులు వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ప్రజ లు గొంతెండుతోంది మహాప్రభో అన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని మండిపడ్డారు. కేవలం ధనార్జన కోసమే కాకుండా, కొద్ది మేరకు ప్రజాభివృద్ధికి కావాల్సిన పనులు కూడా చేయాలని సూచించారు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజవర్గానికి నిధులు కూడా కేటాయించలేని నీఛ సంస్కృతికి చంద్రబాబు సర్కార్‌ నాంది పలికిందని మండిపడ్డారు.

ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి పక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సైతం నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం పోరుబాట పట్టేందుకు వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు ఉడతా కృష్ణ, తుమ్మేటి శారదా శ్రీనివాస్, పూనూరి నాగేశ్వరరావు, ఆబీద్‌బాషా, అగ్గిపెట్టల రాజు, బత్తుల దేవానంద్, పార్టీ నేతలు చదలవాడ రవీంద్రనాథ్, పానుగంటి చైతన్య, షేక్‌ రబ్బాని, షేక్‌ గౌస్, నరాలశెట్టి అర్జున్, విఠల్, వినోద్, సంతోష్, రామ్, లక్ష్మీనారాయణ, మస్తాన్‌వలి పాల్గొన్నారు. మరోవైపు, పొరుగు రాష్ట్రం కర్ణాటక పరిధిలోని బసిల బళ్లారిగా పేరుగాంచిన నగరంలో ఎండలు మండుతూ నిప్పులు కురిపిస్తున్నాయి.

వారం రోజులుగా 41 నుంచి 42 డిగ్రీలతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పిల్లలే కాదు పెద్దలు సైతం ఎండలకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా శిశువులు శరీరంలోని నీటి కొరత(డీహైడ్రేషన్‌)తో అస్వస్థతకు గురై జ్వరాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో నిత్యం విమ్స్‌ పీడియాట్రిక్‌ వార్డు కిటకిటలాడుతోంది. ఇప్పటి వరకు సుమారు 70 మంది శిశువులు డీహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేసవిలో అన్ని విభాగాల కంటే పీడియాట్రిక్‌ విభాగంలోనే చేరే శిశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిశువుల్లో డీహైడ్రేషన్‌ నివారణకు అధికంగా మంచినీటిని తాగాలని, శిశువులు ఉండే గదులు చల్లగా ఉండేటట్లు చూడాలని, శరీరంలో నీటి సాంద్రత తగ్గకుండా చూసుకోవాలని పీడియాట్రిక్‌ వైద్యులు సూచిస్తున్నారు.

9 COMMENTS

 1. I just could not leave your site prior to suggesting that I actually enjoyed the standard information an individual provide on your guests?
  Is gonna be again regularly to check up on new posts

 2. Woah! I’m really enjoying the template/theme of this blog.
  It’s simple, yet effective. A lot of times it’s very hard to get that “perfect balance” between usability and visual appeal.
  I must say you’ve done a great job with this.

  Additionally, the blog loads extremely quick for me
  on Safari. Superb Blog!

 3. Greate article. Keep posting such kind of info on your site.
  Im really impressed by your blog.
  Hey there, You have done an excellent job. I’ll certainly digg it and
  for my part suggest to my friends. I am confident they will be benefited from this website.

 4. I think that what you said was very logical. However, think about this, suppose you typed a catchier title?
  I ain’t saying your information isn’t good, however what if you added
  a post title that makes people want more? I mean తెలుగు రాష్ట్రాల్లో
  పెరుగుతున్న ఎండలు | News Time is
  a little boring. You could glance at Yahoo’s home page and watch how they create post
  titles to grab viewers to open the links. You might add a video or a pic or two to grab readers excited about
  what you’ve written. In my opinion, it would make your website a little livelier.

Leave a Reply to gamefly Cancel reply

Please enter your comment!
Please enter your name here