సుందరదాసు బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించినాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండము (రామాయణంలోని ఒక భాగం) ఎమ్మెస్ రామారావు సుందరకాండగా సుప్రసిద్ధం. తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ గార్లు సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు గారు పాటలు పాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో మరియు గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావుకి 1942లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని) మరియు ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు) ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు.

జడ్జిలలో ఒకరైన అడివి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించినారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసులో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు.

కొన్ని పాటలు రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చారు: నల్లపిల్ల, తాజ్‌మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైనవి. నీరాజనం చిత్రంలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా పాటలో ఎమ్మెస్ గొంతు వినిపించింది. 1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేనఇండియన్ ఏర్ ఫోర్స్‌లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు.

1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ రాయడానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు, తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ సుందరకాండ గేయరచన చేశారు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరసంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.

6 COMMENTS

 1. Today, I went to the beach front with my children. I found a sea shell and gave it
  to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell
  to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear.
  She never wants to go back! LoL I know this is completely off topic but
  I had to tell someone!

 2. I loved as much as you will receive carried out right here.
  The sketch is tasteful, your authored material stylish.
  nonetheless, you command get got an edginess over that you
  wish be delivering the following. unwell unquestionably come more formerly again since exactly the same nearly very
  often inside case you shield this hike.

 3. Hi there! Quick question that’s totally off topic. Do you know how to make your site mobile friendly?
  My web site looks weird when viewing from my iphone.
  I’m trying to find a theme or plugin that might be able to resolve this problem.
  If you have any suggestions, please share. Appreciate it!

 4. Hey there! Someone in my Facebook group shared this website with us so I came to check it out.
  I’m definitely loving the information. I’m book-marking and will be tweeting this to my followers!
  Outstanding blog and brilliant design.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here