విశాఖపట్నం, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): భారత శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) నిర్వహిస్తున్న టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎస్‌టీఎంఐఎస్‌) పథకంలో ప్రోగ్రాం అడ్డయిజరీ కమిటీ (పీఏసీ) సభ్యునిగా ఏయూ ఇనుస్ట్రుమెంటేషన్‌ విభాగం సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్ డి.వి రామకోటి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలం పాటు ఆచార్య డి.వి రామకోటిరెడ్డి ఈ పదవిలో కొనసాగుతారు.

టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎస్‌టీఎంఐఎస్‌) పథకంలో భాగంగా మేన్‌పవర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అవుట్‌పుట్‌ తదితర అంశాలపై ప్రాజెక్టులను నిర్వహిస్తారు. వీటిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ నిర్వహిస్తుంది.