హైదరాబాద్, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా సీఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల వెల్లడి, అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.

వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ వెరిఫికేషన్ చేయాలి. రీ కౌంటింగ్ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్, జెఇఇ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‘‘ఇంటర్మీడియట్ తో పాటు ఎమ్సెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంటర్మీయట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు.

‘‘ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యామనే బాధతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధపడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వృత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

16 COMMENTS

 1. It is perfect time to make some plans for the
  long run and it’s time to be happy. I have learn this
  publish and if I may I wish to recommend you few interesting issues or suggestions.
  Perhaps you could write next articles regarding this article.
  I desire to read even more things approximately it!

 2. For most recent information you have to visit internet and on web I found this site as a most excellent web site for latest updates.

 3. Hello I am so grateful I found your blog page, I really found you by mistake, while I
  was researching on Aol for something else,
  Nonetheless I am here now and would just like to say thanks for
  a remarkable post and a all round exciting blog (I also love the theme/design),
  I don’t have time to browse it all at the minute but
  I have book-marked it and also added in your RSS feeds, so
  when I have time I will be back to read more, Please do keep up
  the fantastic work.

 4. Magnificent items from you, man. I have take note
  your stuff prior to and you’re simply extremely wonderful.
  I actually like what you have got right here, really like what
  you’re saying and the best way by which you assert it.
  You’re making it entertaining and you continue to take care of to stay it smart.

  I cant wait to learn much more from you.
  That is really a great website.

 5. With havin so much written content do you ever run into
  any issues of plagorism or copyright violation? My blog has a lot
  of completely unique content I’ve either
  authored myself or outsourced but it appears a lot of it is popping it up all over the internet without my agreement.

  Do you know any solutions to help protect against content from being stolen? I’d definitely
  appreciate it.

 6. Hello There. I found your blog using msn. This is a very well written article.

  I’ll be sure to bookmark it and come back to read
  more of your useful information. Thanks for the post.
  I’ll definitely return.

 7. Good day! I know this is kinda off topic but I
  was wondering if you knew where I could locate a captcha
  plugin for my comment form? I’m using the same blog platform as yours and I’m having
  difficulty finding one? Thanks a lot!

 8. This is the perfect site for anyone who hopes to understand this topic.

  You understand so much its almost tough to argue with you (not that I personally would want to…HaHa).
  You certainly put a new spin on a topic that’s been discussed for
  decades. Wonderful stuff, just excellent!

 9. Today, I went to the beach front with my children. I found
  a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear
  and screamed. There was a hermit crab inside and
  it pinched her ear. She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone!

 10. I just want to say I am just all new to blogs and certainly savored your website. Probably I’m likely to bookmark your website . You absolutely come with incredible posts. With thanks for sharing your web page.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here