న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానంలోని పవర్‌ యూనిట్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లనున్న విమానంలో ముందస్తు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఏసీ యూనిట్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విమానం పవర్‌ యూనిట్‌లో మంటలు రేగాయి. ఢిల్లీ విమానాశ్రయంలోని అగ్నిమాపక వాహనాలు వచ్చి ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానంలో రేగిన మంటలను ఆర్పారు. ఇది చిన్న అగ్నిప్రమాదమని ఎయిర్‌ ఇండియా అధికారులు వివరణ ఇచ్చారు.