కోల్‌కతా, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): బాఘిని సినిమా తన బయోపిక్ అంటూ వస్తోన్న వార్తలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ పై ఈసీ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో మమతాబెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నా బయోపిక్ అంటూ వస్తోన్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమే. నాకు ఏ బయోపిక్‌తో సంబంధం లేదు.

కొందరు కొన్ని కథలు సిద్దం చేసుకుని, వారికి నచ్చిన విధంగా సినిమా తీస్తే అది నా బయోపిక్ ఎలా అవుతుంది. బయోపిక్ తీయడానికి నేనేమి నరేంద్రమోదీని కాదు. ఇలాంటి అసత్య వార్తలను సృష్టిస్తూ పరువునష్టం దావా వేసేలా నన్ను ప్రేరేపించకండి అని ట్వీట్ చేశారు మమతాబెనర్జీ. బాఘిని సినిమా బయోపిక్ కాదని, మమతాబెనర్జీని ఆదర్శంగా తీసుకుని రాసుకున్న కథ అని ఇప్పటికే దర్శకుడు వెల్లడించిన విషయం తెలిసిందే.