హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): ప్రిన్స్ మహేశ్‌బాబు, జగపతిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మరోసారి మహేశ్, జగ్గూభాయ్ కలిసి తెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించనున్నారట. అనిల్-మహేశ్ ప్రాజెక్టులో జగ్గూభాయ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. శ్రీమంతుడు చిత్రంలో మహేశ్‌కు తండ్రిగా నటించాడు జగపతిబాబు. దిల్‌రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ సినిమా విడుదల తర్వాత ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.