తిరుపతి, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11-05-2019 (శనివారం) ధ్వజారోహణంతో ఆరంభమయ్యే ఉత్సవాలలో భాగంగా పెద్దశేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.

12-05-2019 (ఆదివారం) చిన్నశేష వాహనం, హంస వాహనం, 13-05-2019 (సోమవారం) సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, 14-05-2019 (మంగళవారం), కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 15-05-2019 (బుధవారం) మోహినీ అవతారం, గరుడ వాహనం, 16-05-2019 (గురువారం) హనుమంత వాహనం, గజ వాహనం, 17-05-2019 (శుక్రవారం) సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 18-05-201 (శనివారం) రథోత్సవం, అశ్వవాహనం సేవలు ఉంటాయి.

చివరిగా 19-05-2019 (ఆదివారం) చక్రస్నానం నిర్వహణతో ధ్వజావరోహణం జరిపిస్తారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ క్రతువుకు ముందు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 8వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.

ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

8 COMMENTS

 1. Everything is very open with a precise clarification of the
  issues. It was really informative. Your website is extremely helpful.

  Thank you for sharing!

 2. Very nice post. I simply stumbled upon your blog and wished to say that I have truly loved surfing around your blog posts.
  After all I’ll be subscribing on your feed and I am hoping you write again soon!

 3. Hello I am so grateful I found your webpage, I really
  found you by error, while I was searching on Yahoo for something else, Anyways I am here now and would just
  like to say cheers for a remarkable post and a all round exciting blog (I also love the theme/design), I don’t
  have time to go through it all at the moment but I have bookmarked it and also added your RSS
  feeds, so when I have time I will be back to read much more, Please do
  keep up the superb b.

 4. Someone essentially help to make severely articles I’d state.
  That is the very first time I frequented your
  website page and thus far? I surprised with the research you made to make this particular submit amazing.
  Great task!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here