తిరుపతి, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి అపరేషన్‌ థియేటర్లకు అవసరమైన శస్త్రచికిత్స పరికరాలను సరఫరా చేసేందుకు ఏప్రిల్‌ 26వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల నుండి మే 24వ తేదీ 3.00 గంటల వరకు ఈ – టెండర్లను టీటీడీ ఆహ్వానిస్తుంది.

ఆశక్తి గల శస్త్రచికిత్స పరికరాల తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఈ ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌ ద్వారా తమ ఆసక్తిని వ్యక్తీకరించవచ్చు. ఇతర వివరాలకు తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి కార్యాలయం పని వేళల్లో నేరుగా లేదా 0877-2264025 ఫోన్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.