తిరుపతి, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జేఈవో కార్యాలయంలో ఏప్రిల్‌ 26వ తేదీన ‘భక్తులతో భవదీయుడు’ కార్యక్రమం జరగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జేఈవో బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్‌ ద్వారా నేరుగా జేఈవోకు సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. అయితే, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల మూడో శుక్రవారం బదులు నాలుగో శుక్రవారం జరుగుతోంది. ఇందుకోసం భక్తులు 0877-2234777 ఫోన్‌లో జేఈవోను సంప్రదించవచ్చు.

కాగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టీటీడీ స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు.