విశాఖపట్నం, మే 3 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షల విభాగాన్ని వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. పరీక్షల విభాగంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది విధులను గమనించారు. సర్టిఫీకేట్ల జారీ, ముద్రణ, తయారీ తదితర విభాగాలను ఆయన పరివీలించారు.

పరీక్షల విభాగంలో అవలంభిస్తున్న నూతన సాంకేతిక విధానాలను గురించి వీసీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది నిత్యం తమ హాజరు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎస్‌.వి సుధాకర్‌ రెడ్డి, కంప్యూటర్‌ సెంటర్‌ సంచాలకులు ఆచార్య కె.వెంకటరావు, వి.మధుసూధన్‌, పరీక్షల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.