హైదరాబాద్, మే 4 (న్యూస్‌టైమ్): అవైంజ‌ర్స్ ఫ్రాంచైజీస్‌లో భాగంగా వ‌చ్చిన చిత్రం అవెంజ‌ర్స్: ఎండ్ గేమ్. ఏప్రిల్ 26న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్లని రాబ‌ట్టి అంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేస్తుంది. ఇక ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని కూడా ఈ హాలీవుడ్ చిత్రం షేక్ చేస్తుందంటే అవెంజర్స్ హ‌వా ఏ రేంజ్‌లో సాగుతుంతో అర్ధం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఇండియాలో ఆరు రోజుల‌కి గాను 261.75 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. తొలి రోజు 53.15 కోట్ల వ‌సూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు 51.35 కోట్లు, మూడో రోజు 54.3 కోట్లు, నాలుగో రోజు 31.5 కోట్లు, ఐదో రోజు 31.65 కోట్లు, ఆరో రోజు 26.15 కోట్ల వ‌సూళ్లని ఈ చిత్రం సాధించింది.

ఏ హిందీ చిత్రం కూడా వారం రోజుల‌కి ఇంత‌గా క‌లెక్ష‌న్స్ సాధించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఆంథోనీ, జో రూసోలు చేసిన మ్యాజిక్‌కి ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. దుష్ట‌శ‌క్తి థానోస్‌ను అంతం చేయాల‌న్న దీక్ష‌తో సూప‌ర్‌హీరోస్ అంతా ఒక్క‌టై ఈ విశ్వాన్ని ర‌క్షిస్తారు. ఆ క‌థాంశంతోనే అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌ను రూపొందించారు. క్రిస్టోఫ‌ర్ మార్క‌స్‌, స్టీఫెన్ మాక్‌ఫీలేలు చిత్రానికి స్క్రిప్ట్ అందించారు.