ముంబయి, మే 6 (న్యూస్‌టైమ్): దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో విడుదలకానున్న కార్పొరేట్ల ఫలితాలు, పలు స్థూల ఆర్థికాంశాలు, ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధిరేటు, తయారీ రంగ గణాంకాలు కూడా స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని పలువురు మార్కెట్ పండితులు అభిప్రాయపడ్డారు. పీఎంఐ డాటా మాత్రం ఈ వారం మొదట్లో విడుదలకానుంది. ఇప్పటి వరకు ప్రకటించిన కార్పొరేట్ సంస్థల ఫలితాలు నిరాశావాదంగా ఉండటంతో మరో కొద్దివారాల పాటు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొననున్నాయని సామ్‌కో ఫైండర్, సీఈవో జిమ్మేత్ మోదీ తెలిపారు. ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్‌లు ఈ వారంలోనే తమ నాలుగో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతోంది.

వీటితోపాటు కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, వేదాంతా కూడా ఈ వారంలోనే ప్రకటించనున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 11,800 పాయింట్ల స్థాయిలోనే కదలాడనుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడులు పెడుతుంటే. దేశీయ పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు మార్కెట్లో ఒక్కసారిగా తిరోగమన బాట పట్టాయి. వీటికి తోడు ఉత్పత్తిని తగ్గించుకునే అవకాశాలు లేవని ఒపెక్ దేశాలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చింది. సాధారణ ఎన్నికలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. గడిచిన వారంలో బీఎస్‌ఈ ట్రేడింగ్ సెన్సెక్స్ 104.07 పాయింట్లు పతనం చెందగా, నిఫ్టీ 42.40 పతనం చెంది. ఈవారంలో దేశీయ కరెన్సీ విలువ 80 ఎగబాకింది.

దేశీయ బ్లూచిప్ సంస్థలకు నిరాశే ఎదురైంది. గడిచిన వారంలో టాప్ -10 సంస్థల్లో ఆరు రూ.64.219.2 కోట్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. ఐటీసీ హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు భారీగా పతనం చెందాయి. కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సెల్టెనీ సర్వీసెస్(టీసీఎస్) మార్కెట్ విలువ రూ.39,700.2 కోట్లు తగ్గడంతో రూ.8,00,186.04 కోట్లకు పరిమితమయ్యాయి. వీటితోపాటు హెచ్‌యూఎల్ రూ. 11,029.20 కోట్లు తగ్గి రూ. 3,66, 441.16 కోట్లు, ఇన్ఫోసిస్ నికర విలువ రూ.5,832.53 కోట్లు తగ్గి రూ.3,16, 201.41 కోట్లకు చూరాయి.

3,558.82 కోట్లు తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.2,59,087.06 కోట్లకు, ఎస్‌బీఐ రూ.2, 811.25 కోట్లు పెరిగి రూ.2,75,904.37 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.1,287.15 కోట్లు తగ్గి రూ.3,72,172.06 కోట్లకు చేరాయి. కానీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.25,492.79 కోట్లు పెరిగి కూలర్‌కు పరిమితమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.9888.45 కోట్లకు కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.7,654.43 కరిగి రూ.3,46,00082 కోట్లకు తగ్గింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులను కుమ్మరించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రస్తుతం వెనక్కి తీసుకుంటున్నారు. ప్రస్తుత నెలలో జరిగిన రెండు సెషన్లలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.1,255 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు.

మే 2-3 వరకు జరిగిన ట్రేడింగ్‌లో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.367.30 కోట్లను, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.888.19 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డాటా వెల్లడించింది. మహారాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా మే 1న స్టాక్ మార్కెట్లు సెలవుపాటించాయి. ఏప్రిల్‌లో రూ.16,093 కోట్లను పెట్టుబడిగా పెట్టిన ఎఫ్‌పీఐలు మార్చి నెలలో ఏకంగా రూ.45,981 కోట్లు, ఫిబ్రవరి నెలలో రూ.11,182 కోట్ల నిధులను చొప్పించారు. ప్రస్తుత నెలలో రెండు ట్రేడింగ్ శ్రేణిపై ముందుగా అంచనావేయడం చాలా తొందరపాటు అవుతుంది.

ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఎఫ్‌పీఐలు వేచి చూసే దోరణి అవలంభించే అవకాశం ఉందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్ల కంటే భారత్ క్యాపిటల్ మార్కెట్ ఆశాజనకంగా ఉందని, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికి మొగ్గుచూపడంట కూడా ఇందుకు దోహదం చేశాయన్నారు. మార్చిలో తక్కువ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని అనడానికి ఏప్రిల్ నెలలో పెట్టుబడులు ఉపసంహరించుకు పోవడం నిదర్శణమని వ్యాఖ్యానించారు.