సూర్యాపేట, మే 10 (న్యూస్‌టైమ్): సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాలో టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. కుర్చీలతో కొట్టుకున్నారు. మూడో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పీక్లా నాయక్‌ తండాకు వెళ్లారు. అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతుండగా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారంటూ ఓ తెరాస కార్యకర్త నిలదీశారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ వర్గీయులు అతడిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలను వారించటంతో గొడవ సద్దుమణిగింది. ప్రసంగం అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోగానే మరోసారి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ ఎంపీటీసీ లకావత్‌ రామారావు ఇంటిపై తెరాస వర్గీయులు దాడికి ప్రయత్నించారు.

దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు.

2 COMMENTS

 1. I was suggested this blog by my cousin. I’m not sure whether
  this post is written by him as no one else know such detailed about my trouble.
  You’re incredible! Thanks!

 2. Definitely consider that that you stated. Your favourite justification seemed
  to be at the web the simplest thing to take into accout of.
  I say to you, I definitely get annoyed even as other people
  consider worries that they plainly do not know about. You managed to hit the
  nail upon the top and also outlined out the whole thing with no need side
  effect , other folks can take a signal. Will likely be again to get more.
  Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here