• ఏకశిలా నగరం… ఒంటిమిట్ట ఆలయం!

కడప, మే 10 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం అద్భుత ప్రాచీన శిల్పకళా తోరణంగా విరాజిల్లుతోంది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండరామ స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దాని విశిష్టతకు, మహిమలకు పేరుగాంచింది. ఇక్కడ ప్రచారంలో ఉన్న కోదండరామ స్వామి ఆలయ మహత్యం గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. ఈ క్షేత్రానికి గల మరోపేరు ఏకశిలానగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టని ఆంధ్రా భద్రాచలం’గా పిలుస్తున్నారు ప్రజానీకం.

కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తుంది. ఈ కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అన్న పేరొచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొన్నారు.

ఓరోజున సీతాదేవికి దప్పిక వేసిండట. అప్పుడు రాములవారు ఆ దప్పికను పోగొట్టటానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళ గంగను పైకి తెప్పించాడట. ఆది తాగి సీతాదేవి తృప్తి చెందినట్లు ఇతిహాసాల్లో ఉంది. కాలక్రమంలో అదే రామతీర్థంగా నేడు ప్రసిద్ధగాంచింది. కోదండరామ స్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపురద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. ఈ మండపం విజయనగర సామ్రాజ్య శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించారు.

ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. రామాయణ, మహాభారతంలోని కథలు, దశావతారాలు, వటపత్రశాయి, వారధికి గుండ్రాళ్లు ఆంజనేయస్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణమూర్ఛ, సీతాదేవికి ఆంజనేయస్వామి అంగుళీకమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం, శ్రీ కృష్ణ కాళీయమర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించడం వంటి శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించినట్లు చరిత్ర. ఇక్కడే ఆంధ్రా వాల్మీకిగా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది.

ఈ దేవాలయం పక్కగా రథశాల – రథం ఉన్నాయి. ఇక, ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్, 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఇతను ఒంటిమిట్ట కోదండరామున్ని పరీక్షించగా రాముని మహిమలను ప్రత్యక్షంగా చూసి స్వామి భక్తుడిగా మారిపోయాడు. కోదండరాముని కైంకర్యానికి ఒక బావిని కూడా తవ్వించాడని చరిత్ర చెబుతుంది. అదే ఇప్పుడు ఇమాంబేగ్ బావిగా పిలువబడుతున్నది. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడటం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపి వేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయడం, ఇమాంబేగ్‌ పిలిస్తే కోదండరాముడు ‘ఓ’ అని పలకడం, తూర్పువైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు మాల ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమైపునకు మరలడం వంటి కథనాలు కోదండ రాములవారి మహిమలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు.

కవి బమ్మెర పోతన, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆ కవి విగ్రహాన్ని ఇప్పటికీ ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. సీతారాములవారి కళ్యాణం నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. నవమినాడు పోతన జయంతి నిర్వహించి కవులను సత్కరిస్తారు. స్వామి వారిని చూసి ముక్తి పొందిన మహనీయులు అయ్యల రాజు తిప్పరాజు, అయ్యల రాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పు గుండూరు వెంకటకవి, వరకవి, జానపదల కథల ప్రకారం ఒంటుడు, మిట్టుడు. ఇక, ఈ పుణ్యక్షేత్రానికి చేరుకునేందుకు అనేక మార్గాలు, రవాణా సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి.

విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఏదైనా ప్రయివేట్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. కడప విమానాశ్రయం కొత్త కాబట్టి విమాన సర్వీసులు ఇంకా అంతగా అందుబాటులో లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంటిమిట్టలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన గానీ లేదా షేర్ ఆటోలో గానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే భాకరపేట్ రైల్వే స్టేషన్ (7 కి.మీ), కడప రైల్వే స్టేషన్ (25 కి.మీ), తిరుపతి రైల్వే స్టేషన్ (106 కి.మీ)లు ఒంటిమిట్టకు చేరువలో ఉన్నాయి. అలాగే, ఒంటిమిట్టకు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది.

కడప నుండి ప్రతి రోజు అరగంటకోసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. కడప 7 రోడ్ల కూడలి వద్ద కానీ లేదా కడప ప్రధాన బస్ స్టాండ్ నుండి కానీ లేదా కడప పాత బస్ స్టాండ్ నుండి కానీ ప్రభుత్వ బస్సులు ఎక్కొచ్చు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

3 COMMENTS

 1. Hello! Quick question that’s totally off topic.
  Do you know how to make your site mobile friendly?

  My website looks weird when viewing from my iphone 4. I’m trying to
  find a template or plugin that might be able to correct this issue.
  If you have any recommendations, please share.
  Many thanks!

 2. [url=http://lender.us.org/]pay day game[/url] [url=http://paydayloansonline.us.com/]payday loans online[/url] [url=http://badcredit.us.org/]bad credit loans[/url] [url=http://moneyfast.us.org/]fast loan[/url]

 3. I just want to tell you that I am all new to blogging and site-building and really liked you’re page. Most likely I’m want to bookmark your blog . You really have outstanding stories. Thank you for revealing your blog site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here