ఒంగోలు, మే 11 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా తరచు అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దర్శి నియోజకవర్గంలో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నరు బుచేపల్లి.

దర్శి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచారు సుబ్బారెడ్డి. ఎమ్మెల్యేగా మంచి పెరుతెచుకొన్నారు. తరువాత తనయుడు శివప్రసాద్‌ రెడ్డిని వైస్సార్సీపి తరుపున దర్శి పోటీ చేయించి గెలిపించారు. వ్యాపార రంగంలో, రాజకీయరంగంలో జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న సుబ్బారెడ్డి మృతి పట్ల స్నేహితులు, అభిమానులు సంతాపం తెలియచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here