• తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్): నగరంలోని మల్కాజ్‌గిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సి.కనకారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. కనకారెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆసుపత్రిలోని ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కనకారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శాసనసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కనకారెడ్డి 2014-18 మధ్య మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. కిమ్స్‌లో ఆయన భౌతికకాయానికి మంత్రులు ఈటల రాజేందర్, వి. శ్రీనివాస్ గౌడ్, సీహెచ్ మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ నివాళులర్పించారు.