అమరావతి, మే 17 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాల్లో 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే స్పందించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయానికి తక్షణమే ఓ నోట్ పంపించాలని తన కార్యాలయ అధికారులకు సూచించారు. దీనిపై అప్రమత్తమైన సీఎస్ కార్యాలయం తెదేపా వినతి పత్రాన్ని పరిశీలించాలని సిఫార్సు చేస్తూ సీఈవోకు నోట్ పంపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఫిర్యాదు తరహాలోనే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుపైనా స్పందించినట్టు అనంతరం సీఎస్ కార్యాలయం వెల్లడించింది.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, కేఎస్ జవహర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ విజ్ఞాపన పత్రాన్ని కూడా సీఈసీకి పంపుతూ రీపోలింగ్‌కు సిఫార్సు చేయాలని సీఎస్‌ను డిమాండ్ చేశారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్‌ కోసం గతంలోనే ఈసీఐని కోరినట్టు మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వైకాపా చేస్తున్న ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందిస్తున్న ఈసీ తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం బుట్టదాఖలు చేస్తోందని ఆరోపించారు. ముందుగానే ఈసీతో మాట్లాడుకుని సీఎస్‌కు వైకాపా ఫిర్యాదు చేస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. దశలవారీగా రీపోలింగ్‌ జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని మంత్రి వ్యాఖ్యానించారు. తమ విజ్ఞప్తిని సైతం సీఈసీకి పంపాలని సీఎస్‌ను కోరినట్టు మంత్రి చెప్పారు.

కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ఉప్పలపాడులో 214, 215 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేటలోని 78, 130, 131, 132 పోలింగ్ కేంద్రాల్లోనూ, చిత్తూరు జిల్లా కోడూరులో 21, 244, సత్యవేడులో 80, 81, కడప జిల్లా జమ్మలమడుగులో 287, 288, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని 160, 161, 162 , చిత్తూరు జిల్లా చంద్రగిరిలో 310, 311, 323 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు.

12 COMMENTS

 1. I am curious to find out what blog system you’re working with?
  I’m experiencing some small security problems with my latest blog
  and I’d like to find something more safe. Do you
  have any suggestions?

 2. Pretty great post. I just stumbled upon your weblog and wished
  to mention that I have really enjoyed surfing around your blog posts.

  In any case I will be subscribing for your rss feed and I’m hoping you write once more
  soon!

 3. Greetings from Los angeles! I’m bored at work so I decided
  to browse your site on my iphone during lunch break. I love the info you present
  here and can’t wait to take a look when I get home.
  I’m shocked at how fast your blog loaded on my mobile ..
  I’m not even using WIFI, just 3G .. Anyhow, excellent site!

 4. I feel that is among the most significant information for me.

  And i’m glad reading your article. However want to statement on few general things, The site style is
  ideal, the articles is really nice : D. Good task, cheers

 5. Awesome site you have here but I was curious about if you knew
  of any forums that cover the same topics
  talked about in this article? I’d really love to be a part of online community where I can get responses from other knowledgeable
  individuals that share the same interest. If you have any suggestions, please let me know.
  Bless you!

 6. Hi! Someone in my Facebook group shared this site with
  us so I came to take a look. I’m definitely loving the information. I’m bookmarking and will be tweeting this to my followers!
  Exceptional blog and terrific design.

 7. After looking into a number of the blog articles
  on your website, I honestly appreciate your technique of
  writing a blog. I saved it to my bookmark website list and will be checking back soon. Please check out
  my website too and tell me how you feel.

 8. Thanks a bunch for sharing this with all folks you really know what you’re talking about!
  Bookmarked. Kindly additionally consult with my website =).
  We will have a hyperlink change arrangement between us

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here