• ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలు

మంచిర్యాల, మే 17 (న్యూస్‌టైమ్): జిల్లాలోని చెన్నూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టును ఢీకొట్టి, ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగిన ఘటనలో 20 మంది గాయపడ్డాడు. అందులో 15 మంది స్వల్పంగా గాయపడగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని తక్షణమే మంచిర్యాల సర్కార్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బస్సు చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రయాణికులు వాపోతున్నారు.