హైదరాబాద్, మే 20 (న్యూస్‌టైమ్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు పుస్తకాలను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌.కె. జోషి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు.

తెలంగాణ రుచులపై శాఖాహార, మాంసాహార వంటల వివరాలు, వాటిని తయారుచేసే విధానం గూర్చి జ్యోతి వలబోజు రాసిన ‘తెలంగాణ రుచులు’ పుస్తకం, పెన్నా శివరామకృష్ణ రాసిన ‘తారీఖుల్లో తెలంగాణ’ పుస్తకం, యువ పరిశోధకుడు అరవింద్ ఆర్య తెలంగాణ రాష్ట్రంలోని పురాతన కట్టడాలపై పరిశోధన చేసి రాసిన ‘మనకు తెలియని తెలంగాణ’ పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం సీఎస్ మాట్లాడుతూ చిన్న వయసులోనే చరిత్రపై పుస్తకం రాసిన అరవింద్ ఆర్యను, 20 ఏళ్లుగా వివిధ రకాల వంటల గురించి రాస్తున్న జ్యోతి వలబోజు, తేదీల ప్రకారం తెలంగాణ చరిత్రను గురించి రాసిన పెన్నా శివరామకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి సీ పార్థసారథి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రచయితలు పాల్గొన్నారు.