ఒక పచ్చసొన… రెండు తెల్ల సొనలు!

వంటల్లో నూనె వాడకం తగ్గాలంటే కాస్ట్ ఐరన్, నాన్‌‍స్టిక్ పాన్లను ఎంచుకోవాలి. నూనె వినియోగం చాలామటుకూ తగ్గుతుంది. అలాగే పదార్థాల తయారీకి ఆలివ్, కనోలా ఆయిల్స్ ఎంచుకోవడం ఎంతో మేలును ఇస్తాయి. ఇక వెన్నను, ఉప్పును వంటల్లో ఎంత తగ్గిస్తే అంత మంచిది. తీపి పదార్థాల తయారీలో చాలాసార్లు వెన్న వేయాల్సి రావచ్చు. దాన్ని ఎక్కువగా వేయడం వల్ల శరీరానికి హాని చేసే శాచురేటెడ్‌ కొవ్వు అందుతుంది. అలాగని పూర్తిగా మానేస్తే పదార్థం అనుకున్న రుచిలో రాకపోవచ్చు. ఆ మోతాదును వీలైనంతవరకూ తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆలివ్‌ లేదా కనోలా నూనెల్ని ఎంచుకోవచ్చు. అలాగే ఉప్పు వినియోగం చాలామటుకూ తగ్గితే ఆరోగ్యానికి మంచిది.

ఉప్పుకు ప్రత్యామ్నాయంగా నిమ్మరసం వేసుకోవచ్చు. తాజాగా ఉండే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లాంటివి వాడొచ్చు. వీలైనంతవరకూ సోడియం శాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలి. ఇంకా ఒక గుడ్డును తీసుకోవాలనుకునే వారు రెండు గుడ్ల తెల్లసొనల్ని తీసుకుంటే ఆరోగ్యాన్ని పొందవచ్చు. పచ్చసొనలో కెలోరీలు, కొవ్వు అధికంగా ఉండటంతో తెల్లసొనను ఎంచుకోవడం ఎంతో ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1 COMMENT

  1. Right here is the right website for anybody who wishes to find out about
    this topic. You understand a whole lot its almost
    tough to argue with you (not that I personally would want
    to…HaHa). You definitely put a fresh spin on a topic which has been discussed
    for ages. Great stuff, just wonderful!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here