న్యూఢిల్లీ, మే 30 (న్యూస్‌టైమ్): దేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ముందు బహిరంగ ప్రదేశంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలుత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్‌ మోదీకి అభినందనలు తెలిపారు. ఈ వేడుకకు బిమ్‌స్టిక్‌ దేశాధినేతలతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి గౌడ, దేవేంద్ర ఫడణవీస్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌, పళనిస్వామి, ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ దంపతులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ దంపతులు, రతన్‌ టాటాతో పాటు సుమారు ఎనిమిది వేలమంది అతిథులు హాజరయ్యారు.

మోదీతో ప్రమాణస్వీకారం అనంతరం 57 మంది కేంద్రమంత్రులతో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)లో చేరారు.

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ, శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రిగా ఎదిగిన మోదీ మహోన్నత శిఖరాలకు చేరారు. తాజాగా మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీతో కలిపి మంత్రివర్గంలో మొత్తం 58 మంది చేరారు. వీరిలో కేబినెట్‌ మంత్రులుగా 25 మంది, స్వతంత్ర హోదాలో తొమ్మిది మంది, కేంద్ర సహాయ మంత్రులుగా 24 మందికి అవకాశం కల్పించారు.

  • కేబినెట్‌ మంత్రులు (మోదీతో కలిపి 25మంది)

1. రాజ్‌నాథ్‌సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
2. అమిత్‌ షా (గుజరాత్‌)
3. నితిన్‌ జైరాం గడ్కరీ (మహారాష్ట్ర)
4. డీవీ సదానంద గౌడ (కర్ణాటక)
5. నిర్మలా సీతారామన్‌ (తమిళనాడు)
6. రాంవిలాస్‌ పాసవాన్‌ (బిహార్‌)
7. నరేంద్ర సింగ్‌ తోమర్‌ ( మధ్యప్రదేశ్‌)
8. రవిశంకర్‌ ప్రసాద్‌ (బిహార్‌)
9. హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ- పంజాబ్‌)
10. థావర్‌ చంద్‌గహ్లోత్‌ (మధ్యప్రదేశ్‌)
11. ఎస్‌.జయశంకర్‌ (తమిళనాడు)
12. రమేశ్‌ పోఖ్రియాల్‌ (ఉత్తరాఖండ్‌)
13. అర్జున్‌ ముండా (ఝార్ఖండ్‌)
14. స్మృతి జుబిన్‌ ఇరానీ (దిల్లీ)
15. హర్షవర్ధన్‌ (దిల్లీ)
16. ప్రకాశ్‌ జావదేకర్‌ (మహారాష్ట్ర)
17. పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర- ముంబయి)
18. ధర్మేంద్ర ప్రధాన్‌ ( ఒడిశా)
19. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఉత్తర్‌ప్రదేశ్‌)
20. ప్రహ్లాద్‌ జోషి (కర్ణాటక)
21. మహేంద్రనాథ్‌ పాండే (ఉత్తర్‌ప్రదేశ్‌ -వారణాసి)
22. అరవింద్‌ సావంత్‌ (మహారాష్ట్ర – ముంబయి)
23. గిరిరాజ్‌ సింగ్‌ (బిహార్‌)
24. గజేంద్రసింగ్‌ షెకావత్‌ (రాజస్థాన్‌)

  • స్వతంత్ర హోదా (9 మంది)

25. సంతోష్‌ గాంగ్వర్‌ ( ఉత్తర్‌ప్రదేశ్‌)
26. రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ (హరియాణా)
27. శ్రీపాద్‌ యశోనాయక్‌ (గోవా)
28. జితేంద్ర సింగ్‌ (జమ్ము కశ్మీర్‌)
29. కిరణ్‌ రిజిజు (అరుణాచల్‌ ప్రదేశ్‌)
30. ప్రహ్లాద్‌ పటేల్‌ (మధ్యప్రదేశ్‌)
31. రాజ్‌కుమార్‌ సింగ్‌ (బిహార్‌)
32. హర్‌దీప్‌సింగ్‌ పూరీ (పంజాబ్‌)
33. మనసుఖ్‌ మాండవీయ (గుజరాత్‌)

కేంద్ర సహాయ మంత్రులు (24 మంది)

34. ఫగ్గన్‌సింగ్‌ కులస్థే (మధ్యప్రదేశ్‌)
35. అశ్వినీకుమార్‌ చౌబే (బిహార్‌)
36. అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ (రాజస్థాన్‌)
37. వీకే సింగ్‌ (పంజాబ్‌)
38. కృషన్‌పాల్‌ గుర్జార్‌ (హరియాణా)
39. రావ్‌సాహెబ్‌ ధాన్వే (మహారాష్ట్ర)
40. జి.కిషన్‌ రెడ్డి (తెలంగాణ)
41. పురుషోత్తం రూపాలా (గుజరాత్‌)
42. రాందాస్‌ అథవాలే (మహారాష్ట్ర)
43. సాధ్వి నిరంజన్‌ జ్యోతి (ఉత్తర్‌ప్రదేశ్‌)
44. బాబుల్‌ సుప్రియో (పశ్చిమ బెంగాల్‌)
45. సంజీవ్‌ బాల్యన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
46. సంజయ్‌ శామ్‌రావ్‌ (మహారాష్ట్ర)
47. అనురాగ్ ఠాకూర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)
48. అంగడి సురేష్‌ చిన్నబసప్ప (కర్ణాటక)
49. నిత్యానంద్‌ రాయ్‌ (బిహార్‌)
50. రతన్‌లాల్‌ కటారియా (హరియాణా)
51. వి. మురళీధరన్‌ (కేరళ)
52. రేణుకా సింగ్‌ సరుతా (ఛత్తీస్‌గఢ్‌)
53. సోం ప్రకాశ్‌ (పంజాబ్‌)
54. రామేశ్వర్‌ తెలీ (అసోం)
55. ప్రతాప్‌చంద్ర సరంగి (ఒడిశా)
56. కైలాస్‌ చౌదరి (రాజస్థాన్‌)
57. దేవశ్రీ చౌదరి (పశ్చిమ బెంగాల్‌)

3 COMMENTS

  1. My wife and i got quite fulfilled Michael managed to finish up his homework because of the precious recommendations he had from your own web site. It is now and again perplexing to simply continually be giving away techniques which often the rest have been trying to sell. And we all consider we now have the blog owner to appreciate for this. All the explanations you have made, the easy web site menu, the relationships you make it easier to foster – it is all amazing, and it is facilitating our son in addition to the family recognize that the concept is thrilling, which is especially vital. Thank you for all!

  2. I enjoy you because of all of your effort on this web site. Kate delights in managing investigation and it is obvious why. A lot of people hear all of the powerful mode you convey valuable tips and tricks on your blog and in addition increase contribution from other ones on the point while our girl is truly studying a great deal. Enjoy the remaining portion of the new year. You are always performing a pretty cool job.

  3. I simply wanted to type a small note so as to appreciate you for the superb advice you are giving at this site. My considerable internet look up has now been paid with brilliant facts and strategies to write about with my contacts. I ‘d say that we readers actually are unequivocally fortunate to be in a superb community with so many outstanding people with insightful plans. I feel truly fortunate to have discovered your entire website page and look forward to so many more amazing minutes reading here. Thanks once more for all the details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here