విశాఖపట్నం, జూన్ 18 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలంలో తాత్కాలిక ప్రాతిపదికన సుమారు 145 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ నిబంధనలకు విరుద్దంగాను, రోష్టర్‌ లేకుండా, సాంఘిక సంక్షేమాన్ని, బి.సి. సంక్షేమశాఖ ఉన్నత విద్యామండలి అనుమతి లేకుండా ఇష్టానుషారంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రవిశ్వవిద్యాలయ జ్యోతిరావుఫూలే విగ్రహర దగ్గర ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశరలో వై.యస్‌.ఆర్‌. స్టూడెంట్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది.

అనంతరర వై.యస్‌.ఆర్‌.విద్యార్ధి విభాగర విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ గౌరవ వైస్‌ ఛాన్సలర్‌ గత మూడు సంవత్సరాల కాలంలో ఏయూలో భర్తీ చేసిన ఫ్రొపెసర్‌ నియమాకాలలో అక్రమంగా భర్తీ చేయడాన్ని ఏయూ విచారణ కమిటీలు తప్పుబట్టాయని, పట్టుమని 10 రోజులు కాలవ్యవధిలో 145 పోస్టులు చేయటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

తెలుగుదేశం హయాంలో నియమించబడిన పాలక మండలి, రెక్టార్‌, రిజిష్ట్రార్‌, డీన్‌లు వారికి సంబంధించిన భజనపరులను, కార్యకర్తలను యూనివర్సిటీ తాత్కలిక ప్రాతిపదికన ఇచ్చిన నోటిఫికేషన్‌లో భర్తీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వీరి దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చి తదుపరి వచ్చే వైస్‌ఛాన్సలర్‌ పాలకవర్గంపై పోరాటానికి ఈ 145 మంది స్వార్దం కోసం వినియోగించుకోవడానికుయుక్తుల పన్నాగాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఉన్నత విద్యామండలి పలు అసెంబ్లీ కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం వైస్‌ఛాన్సలర్‌ పదవీకాలం పూర్తయ్యే చివరి మూడు నెలలకు ఏ నియమకాన్ని చేపట్టకూడదు అన్న నిబంధనను త్రుంగలో త్రొక్కి ఇష్టానుసారంగా జమిందారులుగా తన పొలంలో కూలీలను నియమించుకొనే విధంగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని పలు సందర్బాలలో కోర్టులో తప్పులుపెట్టి, మొట్టికాయలు వేశాయన్నారు.