హైదరాబాద్, జూన్ 18 (న్యూస్‌టైమ్): తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి పోతోందని దుయ్యబట్టారు.హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్ లైట్ ఏరియావాళ్లే నయం అని విమర్శించారు. టీఆర్ఎస్‌లో ఉంటేనే నిధులు ఇస్తామని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకపోతే ఇక ఎన్నికలు ఎందుకు? అని ప్రశ్నించారు.