మెదక్, జూన్ 30 (న్యూస్‌టైమ్): బిందెడు నీళ్ల కోసం ఇలా కిలోమీటర్ల దూరం నడిస్తేకాని ఆ రోజు ఇళ్లు గడవని పరిస్థితి ఇక్కడిది. మెదక్‌ జిల్లాకే వరప్రదాయినిగా ఉన్న మంజీరానది నేడు చుక్కనీరు లేకుండా ఎండిపోవడంతో జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. దీంతో బిందెడు నీళ్లకోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. 30 టీఎంసీల నీటితో నిత్యం జలకళతో ఉట్టిపడే మంజీరా ఎండిపోవడంతో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మంచినీరందంచే పథకాలకు గడ్డుకాలం ఎదురైంది. దీంతో నారాయణఖేడ్‌ పట్టణానికి పూర్తిగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

దీనికితోడు పట్టణంలోని బోర్లన్నీ ఎండిపోవడంతో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. పట్టణంలోనే ఇంత తీవ్రమైన సమస్య ఉంటే ఇక పల్లెల్లో గుక్కెడు మంచినీరు దొరకడంలేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఖేడ్‌ నియోజకవర్గం అంటేనే గుర్తుకు వచ్చేది గిరిజన తండాలు. మనూరు, కంగ్డి, నారాయణఖేడ్‌, కల్హేర్‌, పెద్ద శంకరంపేట మండలాల్లో ఉన్న గిరిజన తండాల్లో నీటికష్టాలు తీవ్రంగా ఉన్నాయి.

గుక్కెడు మంచినీళ్ల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఎండిన బావులు, చెలిమల్లో ఉన్న ఆ కొద్దినీటినే తోడుకొని రోజులను గడిపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎడారిలో మారిన ఖేడ్‌ నియోజకవర్గం మంచినీటి దాహర్తిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే రాజకీయ నేతలను తమ ఊళ్లో అడుగుపెట్టనీయమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, వర్షాభావ పరిస్థితుల కారణంగా పుష్కలంగా నీరు ఉండే ప్రాంతాల్లో సైతం నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఉన్న ఒక్క బోరు ఆపి ఆపి నీటిని పంప్ చేయడంతో నీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. బాలానగర్ మండలంలో 31 గ్రామ పంచాయతీలు, 16 అనుబంధ గ్రామాలు, 116 గిరిజన తండాలున్నాయి. 60 కుటుంబాలున్న తండాలో సైతం ఒకే బోరు ఉండటంతో నీటి సమస్య మరింత ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. ప్రజా ప్రతినిధులను, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో తండావాసులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామ పంచాయతీ సోమ్లా నాయక్ తండాలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు మొదలయినట్లు తెలిపారు.

తాండాలో దాదాపుగా 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. తండాలో మరో బోరు వేసి నీటి ఇబ్బందులు తీర్చాలని అధికారులకు, గ్రామ సర్పంచ్‌కు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. బోరు వద్ద నిలబడితో అరగంటకు ఒక బిందె నీళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు. వ్యవసాయ బోర్లవద్దకు నీటి కోసం వెళితే వారు కసురుకుంటున్నారని గిరిజనులు ఆవేధన చెందుతున్నారు. నీటి కష్టాలపై పల్లె వికాసంలో అధికారులను, ప్రజా ప్రతినిధులను నిలదీసేందుకు సిద్దంగా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

మెదక్ జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కల్హేర్‌, కంగ్టి, మనూరు, నారాయణఖేడ్‌, పెద్దశంకరంపేటతోపాటు రేగోడ్‌, అల్లాదుర్గం మండలాల్లో గుక్కెడు నీటికోసం నానా తిప్పలు పడుతు న్నారు. ముందస్తు జాగ్రత్తగా కలెక్టర్‌ ఆదేశాలు పంపినప్పటికీ ఏ గ్రామంలో కూడా ఇప్పటి వరకు నీటి కష్టాలు తొలగలేవు. మార్చి నెలలోనే ఇంత కంటే దారుణమూన పరిస్థితులు ఎదుర్కొన్న ప్రజలు ఏప్రిల్‌, మే నెలలో ఏ విధంగా ఉంటుం దోనని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా గ్రామాల్లో పడుతున్న కష్టాలతోపాటు కరెంట్‌ కొరత ఉండడంతో వ్యవసాయ బావుల వద్ద నీరు తేవాలంటే కరెంట్‌ సరఫరా లేకపోవడంతో కనీసం రోజుకు రెండు గంటల కరెంట్‌ లేకపోవడంతో నీరు తాగలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోయారు. భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడంతో తాగునీటి కరవు ముంచుకొస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో ప్రస్తుతం శీతాకాలం నుంచే నీటి ఎద్దడి మొదలైంది.

గ్రామాలతో పాటు గిరిజన తండాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే క్రమంలో రాబోయే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన అలుముకున్నది. అనే క మండలాల్లో 240 వాటర్‌ సప్లై పథకాలు, 10 మినీ పైపు వాటర్‌ సప్లై పథకాలు, 536 చేతిపంపులు, మరో 20 సంప్‌లు పనిచేస్తున్నాయి. ఈ పథకంలో ఇప్పటికే నీటి మట్టాలు పడిపోయాయి. అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో నీటి ఎద్దడి నెలకొంటుంది. పలు గ్రామాల్లో తాగునీటి కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాల్లో, గిరిజన తండాల్లో వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు.

కాగా తాగునీటి ఎద్దడి నివారణకు గత ఏడాది తాత్కాలిక ప్రణాళిక ప్రాతి పదికగా ఈ ఏడాది కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోరు బావులను లోతు చేయడం, పూడిక తీయడం, అవసరమైన చోట ప్రైవేటు బోరుబావులను అద్దెకు తీసుకోవాలంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అక్టోబర్‌ నెల నుండే నీటి తీవ్రత ఏర్పడడంతో గతం కంటే ఈ సంవ త్సరం నీటి కోసం ఎక్కువ బడ్జెట్‌ కేటాయించామని చెప్పినప్పటికి ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మంచినీటి కోసం నానా పాట్లు పడాల్సి వస్తుందని వారు తెలిపారు. మెదక్‌ జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం నారాయణఖేడ్‌ అందుకు ముందస్తు చర్యగా నీటి సమస్య తీరుస్తామని జిల్లా కలెక్టర్‌ చెప్పినప్పటికీ మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య తీర్చడం లేదని గ్రామస్తులు చెప్పారు.

తాగునీటి రవాణాకు రూ.1.67కోట్లు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిధులు సక్రమంగా వినియోగం కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. విపత్తు నివారణ నిధి కింద నిర్వహణలో కొన్ని నిబంధనలు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అడ్డంకిగా తయారయ్యాయి. కొత్తగా బోరుబావుల త్రవ్వకం, పైప్‌లైన్ల ఏర్పాటు, బోరుమోటార్ల కొనుగోలుకు సిఆర్‌ఎఫ్‌ నిబంధనలు సహకరించవు. 15నుంచి 20శాతం జనావాసాల్లో పైప్‌లైన్‌ల విస్తీర్ణం, బోరుమోటార్ల రిపేరు, కొనుగోలు కోసం డిమాండ్లు వస్తున్నాయి. లక్షల రూపాయల్లోపు వ్యయం అయ్యే పనులకు కూడా నిబంధనలు అంగీకరించడం లేదనే సాకుతో చేపట్టడం లేదు. అదేచోట రూ.2లక్షల నుంచి 3లక్షల వ్యయం చేస్తూ తాగునీటి సరఫరా చేస్తున్నారు.

తాగునీటి పథకాలకు నిధుల కొరత శాపంగా మారిన నేపథ్యంలో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 208 గ్రామాలు, 210 గిరిజన తండాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని నారాయణఖేడ్‌, కంగ్టి, కల్హేర్‌, మనూరు, పెద్దశంకరంపేట మండలాల్లో గతంలో పోలిస్తే ఈ సారరి వర్షపాతం బాగా తగ్గింది. ఫలితంగా చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. ఈ పరిణామం భూగర్భజలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆగస్టులో భూగర్భజలాల శాఖలెక్కల ప్రకారం నియోజకవర్గంలో నారాయణఖేడ్‌లో 22.03మి.మీ, మనూరులో 20.22మి.మీ దిగువకు భూగర్భజలాలు పడిపోయాయి. కల్హేర్‌లో 8.3మి.మీ, పెద్దశంకరంపేటలో 16.99మి.మీ, కంగ్టిలో 18.80మి.మీ దిగువకు పడిపోగా నారాయణఖేడ్‌ మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఈ మట్టం మరింత పడిపోయే పరిస్థితి పొంచిఉంది.

మంచినీటి పథకాలకు ప్రధానంగా ఆధారమైన భూగర్భజలాలు అనూహ్యంగా పడిపోవడంతో శీతాకాలంలోనే నీటి ఎద్దడి నెలకొంది. నారాయణఖేడ్‌ మండలంలో 15గ్రామాలు మంచినీటి ఎద్దడితో తల్లడిల్లుతు న్నాయి. దీనికి తోడుగా మండలంలో చల్లగిద్దతండా, తుర్కపల్లితండా, వెంకటాపూర్‌తండా, పలుగుతండా, ర్యాలమడుగు తండా, గడ్డతండా, లక్ష్మణ్‌నాయక్‌ తండా, మాణిక్‌నాయక్‌ తండా, గైరాన్‌తండా, అనంతసాగర్‌ తండా, కంగ్టి మండలంలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గైరాన్‌తండా, వంగ్దాల్‌, రూప్లా, బీబ్యా, పొమ్యానాయక్‌, భీంరావు, దెగుల్‌వాడీ తండాలు, మనూరు మండలంలో కమలాపూర్‌ తండా, కొండ్యానాయక్‌, రత్నానాయక్‌, బంగ్లా, నాగిల్‌గిద్ద, ఎర్రబొగుడ, డోవూరు తండాల్లో అప్పటి మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి కార్యక్రమంలో తండాకు 10ఇళ్లు, మురికికాల్వలు మంజూరు చేసినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని తండావాసులు ఆరోపిస్తు న్నారు. ఎనక్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొండ్యానాయక్‌ తండాలో 2009లో తండాకు రోడ్డు సక్రమంగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్‌ శశిధర్‌ మూడుకిలోమీటర్ల దూరం నడిచివెళ్లి రోడ్డు, నీటి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నా రు. దామరగిద్ద పంచాయతీలోని గోప్యానాయక్‌ తండాలో రక్తమిస్తాం నీళ్లు తాపండని 2010లో వచ్చిన వార్తకు కూడా ఇంతవరకు స్పందన రాలేదని పేర్కొంటున్నారు.

కల్హేర్‌ మండలంలో జూలతండా, జమ్లాతండా, తోల్యాతండా, కరణంతండా, మునిగేపల్లి తండా, బాల్కంచెల్కతండాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కాగా సింగర్‌తండాలో వర్షమొ స్తే నాలుగు నెలలపాటు పడవ ప్రయాణం తప్పదని గిరిజనులు వాపోతున్నారు.

అదేవిధంగా జులాతండా ఇప్పటివరకు కరెంటుకు నోచుకోకపోవడం గమనార్హం. నియోజక వర్గంలో గత సంవత్సరం మంచినీటి ఎద్దడి కోసం, పారిశుధ్యం కోసం రూ.1.60కోట్లు కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ ప్రకటించినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. 11.11.2011లో బోరంచ రచ్చబండ కార్యక్రమంలో గిరిజన మహిళలు ఎర్రబొగుడ తండాకు రోడ్డు కల్పించాలని, మంచినీటి వసతి కల్పించాలని సి.ఎం ఇందిరమ్మ బాట సందర్భంగా అక్టోబర్‌ 30న నారాయణఖేడ్‌ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో గ్రామాలతోపాటు గిరిజన తండాలు మంజీరా నీరు అందిస్తామని తెలిపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి దాఖలు కనిపించడం లేదు.

వెంటనే స్పందించి అధికారులను ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం, నీటి వసతి కల్పించలేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలను దృష్టిలో ఉంచుకుని మంచినీరు, రోడ్ల సమస్య తీర్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

283 COMMENTS

 1. G0l8GX I think other web-site proprietors should take this website as an model, very clean and great user friendly style and design, let alone the content. You are an expert in this topic!

 2. This particular blog is obviously educating and factual. I have picked up a bunch of useful advices out of this amazing blog. I ad love to return again soon. Thanks a lot!

 3. IaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžve read some good stuff here. Certainly worth bookmarking for revisiting. I wonder how much effort you put to make such a fantastic informative web site.

 4. My brother suggested I might like this website. He was entirely right. This post actually made my day. You cann at imagine just how much time I had spent for this information! Thanks!

 5. This blog is definitely entertaining and factual. I have picked up a bunch of interesting advices out of this blog. I ad love to come back again and again. Thanks a bunch!

 6. Thanks for some other fantastic post. Where else may anyone get that kind of information in such an ideal method of writing? I have a presentation next week, and I am at the search for such info.

 7. Particularly helpful point of view, thank you for blogging.. I enjoy you telling your perspective.. So content to have found this publish.. So content to get discovered this submit..

 8. You are my inhalation, I own few web logs and sometimes run out from post . No opera plot can be sensible, for people do not sing when they are feeling sensible. by W. H. Auden.

 9. This is really interesting, You are a very skilled blogger. I ave joined your rss feed and look forward to seeking more of your fantastic post. Also, I have shared your site in my social networks!

 10. You are my aspiration, I possess few blogs and occasionally run out from brand . Follow your inclinations with due regard to the policeman round the corner. by W. Somerset Maugham.

 11. Im no professional, but I believe you just made the best point. You undoubtedly understand what youre talking about, and I can seriously get behind that. Thanks for being so upfront and so sincere.

 12. Im no pro, but I imagine you just crafted the best point. You definitely know what youre talking about, and I can really get behind that. Thanks for staying so upfront and so sincere.

 13. Keep up the wonderful piece of work, I read few articles on this website and I think that your site is very interesting and has got sets of great info.

 14. I think other site proprietors should take this website as an model, very clean and excellent user friendly style and design, let alone the content. You are an expert in this topic!

 15. We stumbled over here coming from a different web address and thought I may as well check things out. I like what I see so now i am following you. Look forward to looking into your web page yet again.

 16. Right now it sounds like BlogEngine is the preferred blogging platform available right now. (from what I ave read) Is that what you are using on your blog?

 17. You can certainly see your enthusiasm in the work you write. The world hopes for even more passionate writers like you who are not afraid to say how they believe. Always go after your heart.

 18. I think other web-site proprietors should take this website as an model, very clean and magnificent user genial style and design, as well as the content. You are an expert in this topic!

 19. Usually I do not read article on blogs, but I would like to say that this write-up very forced me to try and do it! Your writing style has been amazed me. Thanks, quite nice article.

 20. Wow! This could be one particular of the most helpful blogs We have ever arrive across on this subject. Actually Fantastic. I am also an expert in this topic therefore I can understand your effort.

 21. Merely wanna input on few general things, The website layout is perfect, the subject material is real fantastic. If a man does his best, what else is there by George Smith Patton, Jr..

 22. I just want to say I am all new to blogs and absolutely enjoyed you’re website. Likely I’m planning to bookmark your site . You surely come with wonderful articles. Thanks for sharing with us your blog site.

 23. I just want to mention I’m all new to blogging and honestly liked your web blog. Almost certainly I’m planning to bookmark your website . You really come with wonderful stories. Appreciate it for sharing with us your website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here