మచిలీపట్నం, జులై 2 (న్యూస్‌టైమ్): జాతీయ రహదారులు 216, జాతీయ రహదారి 221 విస్తర్ణకు సంబంధించి భూములు కొల్పోయిన రైతులకు నష్టపరిహారం పెంపునకై, పెండింగ్ చెల్లింపులకు సంబంధించి జిల్లా కలెక్టరు కోర్టులో రైతులు ఫైల్ చేసిన పిటిషన్లపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ కలెక్టరేట్‌లో విచారణ నిర్వహించారు.

216 జాతీయ రహదారి అభివృద్దికి 6 గ్రామాలు బంటుమిల్లి మండలం ముంజులూరు, బందరు మండలం అరిసేపల్లి, బందరు, మోపిదేవి, చల్లపల్లి, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన రైతులు తమకు నష్టపరిహారం పెంపు చేయాలని కొంత మంది రైతులు నష్టపరిహారం అందలేదని మరి కొందరు ఫైల్ చేసిన పిటిషన్లు కలెక్టర్ విచారించారు. అదే విధంగా 221 జాతీయ రహదారి (విజయవాడ – భద్రాద్రి) అభివృద్దికి సంబంధించి జి. కొండూరు, జి. కొండూరు మండలం ఆత్కూరు గ్రామాల రైతులు విచారణకు హాజరయ్యారు.

ముఖ్యంగా వ్యవసాయేతర భూమిగా కన్వర్టు అయిన భూములకు వ్యవసాయ భూములుగా పరిగణించి నష్టపరిహారం చెల్లించడం, ఇళ్ల స్దలాలను వ్యవసాయ భూములుగా పరిగణించి నష్టపరిహారం చెల్లించడం ద్వారా రైతులు నష్టపోయారని కలెక్టర్‌కు విన్నవించారు. జిల్లా కలెక్టర్ వీటిపై తగిన విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా జాయింటు కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలతకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here