సిద్ధిపేట, జులై 15 (న్యూస్‌టైమ్): లక్ష్మీగణపతి ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో రూపొందుతున్న ‘నేను రైతుని’ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జగదేవపూర్‌లో లఘు చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు.

దేశానికి వెన్నుముక అయినటువంటి రైతు గురించి పలు రకాల సమస్యలు వాస్తవాలు ఈ లఘు చిత్రంలో ఉంటాయని దర్శకులు బీరప్ప బీఆర్‌పీ తెలిపారు. ‘నేను రైతుని’ చిత్రం 15 నిమిషాల నుండి 25 నిమిషాల లోపు ఉంటుందని తెలిపారు. చిత్రంలో నటీనటులు కుక్కునూరు ఎలక్షన్, మహేష్, నరేష్, యశ్వంత్ తదితరులు ఉన్నారు.

ఈ చిత్రానికి కెమేరా రాజు బాలకృష్ణ, సహాయ దర్శకులు రమేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బీరప్ప బీఆర్‌పీ వహించునున్నారు. తొందరలో ఎడిటింగ్ డబింగ్ పూర్తి చేసి యూట్యూబ్ ద్వారా విడుదల కానుంది.