విజయవాడ, జులై 15 (న్యూస్‌టైమ్): విజయవాడ తెలుగుదేశం నాయకుల్లో రోజురోజుకూ సంఖ్యత కొరవడుతోంది. అధిరానికి దూరమై నామమాత్రపు సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన తెదేపాలో తాజాగా కీలక నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాసరావు (నాని) మధ్య తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి.

‘నా లాంటి వాడు పార్టీకి అవసరం లేదనుకుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఆ విషయాన్నైనా నాకు తెలియచేయాలి. అలా చెప్తే తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు నాని. తన లాంటి వాడు పార్టీలో కొనసాగాలంటే చంద్రబాబు తన పెంపుడు కుక్కని అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్లు చేస్తున్నాడు. దౌర్భాగ్యం! నిన్నటి వరకూ చంద్రబాబు కాళ్లు, రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు వ్యక్తులు మాత్రమే తేడా కాళ్లు కాళ్లే. రాజకీయ జన్మలు, పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులనేవి గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలు, సైకిల్‌ బెల్లుల దొంగలకి, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదారులకు అవసరం. నాకు అవసరం లేదు’ అంటూ కేశినేని ట్విటర్‌ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీనికి ప్రతిస్పందిస్తూ ‘బస్సుల మీద ఫైనాన్స్‌ తీసుకుని 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని, కోట్లాది రూపాయలు ఫైనాన్స్‌ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది. దళిత నాయకుడు, మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. వినే ధైర్యం నీకుందా? చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే అతడినే అనరాని మాటలని ఆ పార్టీని కూల్చావు. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మనిస్తే ఇవాళ ఆయన గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి మీద నేనో, నువ్వో ఎవరు పోరాడుతున్నారనేది ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు. సంక్షోభం సమయంలో పార్టీ, నాయకుడి కోసం పోరాడే వాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయే వరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా సమాధానమిచ్చారు.

మొత్తానికి వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వైరం, మాటల యుద్ధం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరంగా మారింది. ఎవరి తగ్గమనాలో తెలియని అయోమయంలో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల మాట.

652 COMMENTS

  1. This is really interesting, You are a very skilled blogger. I have joined your feed and look forward to seeking more of your fantastic post. Also, I have shared your website in my social networks!

  2. You have mentioned very interesting points ! ps decent site. I didn at attend the funeral, but I sent a nice letter saying that I approved of it. by Mark Twain.

  3. I used to be suggested this blog via my cousin. I am no longer sure whether this post is written by him as no one else realize such detailed about my trouble. You are wonderful! Thanks!