మీ భార్య మూడీగా ఉందా? దీనికి కారణం ఏంటో ఆరాతీయండి. అంతేకాదు… ఇంటి పనులతో శ్రమ ఎక్కువా లేకుండా ఇతరత్రా సమస్యలతో ఆమె మూడీగా ఉంటుందా అనేది తెలుసుకోండి. ఎప్పుడూ కోపంతో ఊగిపోతుంటే.. ఇక లాభం లేదు.. ఓ ముద్దు పెట్టేయండి. మూడీగా ఉంటే ఆమెను ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆమె పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచండి. ఇంకా చాలామంది మహిళలు పురుషులు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరని భావిస్తున్నారు. ఇలా మీ భాగస్వామి అనుకుంటే మీరలా కాదని నిరూపించండి. ఆమె సమస్యలేంటో అడిగి తెలుసుకోండి.

ఇంటి పనిలో కాసింతనైనా సాయం చేయండి. అప్పడప్పుడు తను చేసేపనికి థ్యాంక్స్‌ చెప్పండి. ఇంకా మీరు ఆమెను గుర్తిస్తున్న విషయాన్ని తెలియజేయండి. ఇంటి, ఉద్యోగ బాధ్యతలను తానొక్కటే మోస్తున్నాననే భావన కలిగించకండి. పని ఒత్తిడిని దూరం చేసుకునేందుకు కాస్త సాయపడండి. ఇవన్నీ చేస్తే తప్పకుండా మూడీగా ఉండే మీ భాగస్వామి చలాకీగా తయారవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులా.. చాలా తక్కువ సమయమే ఉందా.. మీ భాగస్వామితో మాట్లాడలేకపోతున్నారా..? అయితే ఈ టిప్స్‌ పాటించండి.

ముఖ్యంగా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉండకూడదని మానసిక నిపుణులు అంటున్నారు. మీ కమ్యూనికేషన్‌ అభివృద్ధి చేసుకోవాలంటే.. ఒకరికోసం ఒకరు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా, ఇద్దరి వ్యక్తుల మద్య గౌరవప్రదమైన సంబంధం ఏర్పడుతుంది. తక్కువ సమయం ఉన్నాకూడా, ఒకరికోసం ఒకరు ఇష్టంగా ఉన్నట్లైతే, ఇద్దరూ కలిసి కెరీర్‌ను చేరుకోగలుగుతారు. ఓపెన్‌గా, నిజాయితీగా, మరియు పాజిటివ్‌ కమ్యూనికేషన్‌ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

అలాగే విబేధాలను దూరం చేస్తుంది. తరచూ విబేధాలతో, మనస్పర్ధలతో భార్యాభర్తలు గడిపితే.. కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరైనా వెనుకకు తగ్గడం చాలా ముఖ్యం. అలాగే ఉద్యోగస్తులైతే కనీసం వారంలో ఒకరికోసం ఒకరు కొంత సమయం ఖర్చుచేయాలి. ఒకరి మాటలు ఒకరు వినండి. తర్వాత ఎక్స్‌ప్రెషన్‌కు మర్యాద ఇవ్వండి. భాగస్వాములు తమ తమ ఫీలింగ్స్‌కు మర్యాద ఇచ్చుకోవాలి. ఇలా భావాలను, భవిష్యత్త్‌ ప్రణాళికలను పిల్లల పెంపకాన్ని భాగస్వాములు ఉద్యోగులైనా విరామ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకోవడం చేస్తే ఎలాంటి విబేధాలు తలెత్తవని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

చాలా మంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని చెపుతున్నారు సెక్సాలజిస్టులు. మార్కెట్‌లో లభించే హార్లిక్స్‌.. బూస్ట్‌ల కంటే… గత రాత్రి పడక గదిలో లభించిన దాంపత్య సుఖం వల్లే స్త్రీలు ఆఫీసుల్లో చలాకీగా ఉంటున్నట్టు తమ పరిశోధనల్లో తేలిందని వారు చెపుతున్నారు. ముఖ్యంగా స్త్రీల మనస్సుల మీద, చేతల మీద లైంగిక తృప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. ఆ తృప్తి ఆనందమే వారు వేసుకునే డ్రెస్‌, మేకప్‌లలో ప్రతిబింబిస్తాయంటున్నారు. మరికొందరి మహిళలు లేదా స్త్రీలు అందంగా అలంకరించుకున్నప్పటికీ.. వారు హుషారుగా ఉండలేక పోవడానికి ప్రధాన కారణం వారిలో లైంగిక తృప్తి అనేది లేక పోవడమేనట.

అంతేకాకుండా, తరచుగా తలనొప్పి, నడుం నొప్పి అంటూ ఏవేవో కనిపించని నొప్పుల గురించి మాట్లాడే స్త్రీలలో తమ దాంపత్య జీవితంలో పూర్తి అసంతృప్తి అవహించడమేనని చెపుతున్నారు. అందుకే భార్యాభర్తలు నిరంతరం సెక్స్‌లో పాల్గొంటుండాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు.