• కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్‌కు ఎంపికైన నేహా దీక్షిత్!

  • యూపీలో పోలీస్ ఎన్‌కౌంటర్లపై పరిశోధనాత్మక కథనాలు!

న్యూఢిల్లీ, జులై 19 (న్యూస్‌టైమ్): ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన పాత్రికేయులకు ఇచ్చే ప్రత్యేక అవార్డు ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్’ ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్‌కు ఈ ఏడాది భారతదేశం నుంచి ‘ద వైర్’ న్యూస్ వెబ్ పోర్టల్ జర్నలిస్ట్ నేహా దీక్షిత్ ఎంపికయ్యారు. పోలీసుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, హత్యలు అక్రమంగా నిర్బంధించడం రాజకీయ ప్రేరేపితతో జరిగే అరెస్టులు మొదలైన వాటిపై నేహ దీక్షిత్ పరిశోధనాత్మక కధనాలు ఎన్నో రాశారు.

వార్తా కథనాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కమిషన్ స్పందించి నోటీసులు జారీ చేసింది. అమాయక పౌరుల నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అవార్డుకు నేహాతో పాటు మరో రెండు దేశాలకు చెందిన జర్నలిస్టులు ఇద్దరు ఎంపికయ్యారు. సమాధానం చెప్పుకోలేని స్థితిలో యూపీ సర్కార్ ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం జరుపుతున్న ఎన్కౌంటర్లపై నేహా దీక్షిత్ రాసిన కథనాలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన 14 మంది కుటుంబాలను కలుసుకొని ఆమె అనేక వివరాలు సేకరించారు. ఈ సమాచారం బయటకు రావడంతో ఆదిత్యనాథ్ సర్కార్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపింది. హర్యానాలో జరిగిన గో హత్యపై కూడా నేహా దీక్షిత్ పదుల సంఖ్యలో పరిశోధనాత్మక కథనలు రాశారు.

మేవత్ ప్రాంతంలో గోవులను తరలిస్తున్నారని ఇది కూడా అనుమానమే. ఒకే ఒక కారణంతో 16 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అలాగే యూపీలో పోలీసులు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి వందల సంఖ్యలో ముస్లింలను అరెస్టు చేయడంపై వార్తా కథనాలు రాశారు.

172 COMMENTS

  1. It’а†s actually a nice and useful piece of info. I am satisfied that you shared this helpful info with us. Please stay us informed like this. Thanks for sharing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here