మేడ్చల్, జులై 19 (న్యూస్‌టైమ్): మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కట్టమైసమ్మ దేవాలయం పరిధిలోని కెసిఆర్ నగర్‌లో పోలీసుల అండతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులు ఖాళీ స్థలాలను కబ్జా చేసి నిరుపేదలకు అమ్మి డబ్బులు దండుకుంటోంది ల్యాండ్ మాఫియా. కాప్రా కట్టమైసమ్మ పరిధిలోని మల్లికార్జున నగర్ కెసిఆర్ నగర్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు జీవనం గడుపుతున్నారు. అయితే ఇక్కడ కొందరు ఇళ్లు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నారు.

ఖాళీగా ఉన్న ప్లాట్‌లపై కన్నేసినటువంటి బెంగాల్ అమ్మ. జోత్స్నా బేగం. మీనా బేగం. కాలనీలో నివసిస్తున్న అటువంటి వారిని భయపెడుతూ బెదిరిస్తూ యధేచ్చగా కబ్జాలు చేసినటువంటి ప్లాట్లను ఒకరికి తెలియకుండా ఇంకొకరికి అమ్ముతూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా వారి చేతిలో మోసపోయినటువంటి కొందరు వారి బెదిరింపులకు భయపడి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు వారిని ఏమీ చేయలేక వదిలేస్తున్నారు అని కాలనీవాసులు మీడియాను ఆశ్రయించారు.

ఈ సందర్భంగా మీడియాతో బాధితులు మాట్లాడుతూ కెసిఆర్ నగర్ కాలనీలో బెంగాల్ అమ్మ, జోత్స్నా బేగం, మీనా బేగం వల్ల భయానకమైన అటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, వారి వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇదే అదనుగా చేసుకున్నవారు మరింత రెచ్చిపోయి భూకబ్జాలకు పాల్పడుతున్నారని వాపోయారు. తాము ఎన్నో సంవత్సరాలుగా కాలనీకి చెందినటువంటి కమిటీ హాలులో ఏ పండుగ కార్యక్రమం జరిగినా కూడా ఇందులోనే చేసుకుంటున్నామని, దీనిపై కన్నేసిన అటువంటి వారు నకిలీ పత్రాలు సృష్టించి ఒకరికి తెలియకుండా ఇంకొకరికి లక్షల్లో అమ్ముకున్నారని, ఆయా స్థలాలను కొన్న వారు ఎవరికీ తెలియకుండా కొని ఇట్టి స్థలం తమది అని వస్తున్నారని, అలాగే దీనికంటే ముందు తాము కూడా కొన్నామని ఇంకొకరు కూడా వచ్చారని ఇటువంటి విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిపై గతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు చేశామని, అయితే వారు బెయిలుపై వచ్చి మళ్లీ కబ్జాలకు పాల్పడుతున్నారని తమకు పోలీసుల మద్దతు ఉందని, ఎవరూ తమను ఏమీ చేయలేరని బహిరంగంగానే చెబుతున్నారని, ఈ విషయం తెలిసి న్యాయం కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో తాము ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

అక్రమార్కులకు ఎదురు తిరిగిన వారినీ టార్గెట్ చేస్తూ కిరాయి గూండాలతో బెదిరిస్తున్నారని, దాంతో ఎవరికి వారే భయపడి ఇన్ని రోజులుగా ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము భయంతో బతుకుతున్నామని, అందుకే ఈరోజు మీడియాను సంప్రదించామని, ఎలాగైనా తమకు తమ కాలనీవాసులకూ దోపిడీదారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. భూ కబ్జాదారులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా కఠినమైన చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోవడం లేదని, వారం క్రితం అర్ధరాత్రి 100 మంది యువకులతో భయబ్రాంతులకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక్కడికి వచ్చిన పోలీసులు ప్రత్యక్షంగా వారిని చూసినా కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి పోలీసు అధికారిని అట్టి భూ కబ్జాదారిని ఏకవచనంతో సంబోధించడంలో మతలబు ఏమిటని, తమ కాలనీ విషయంలో ఇన్ని ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో తాము రోజురోజుకు భయపడుతూ బతుకుతున్నామని, ఇప్పటికైనా పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here