ఈ చెట్టును చూస్తే ఆకుల్లేని, కాయలు మాత్రమే ఉన్న చెట్టులా ఉంది కదూ! ఇది చెట్టే కానీ జీవం లేని కృత్రిమ చెట్టు. దీని పేరు విండ్‌ ట్రీ. కృత్రిమ చెట్టని దీన్ని తీసి పారేయడానికి వీల్లేదు. సహజమైన చెట్టు చల్లటి గాలి, నీడ ఇస్తే ఈ వైట్‌ విండ్‌ ట్రీ కరెంటునిస్తుంది. అదెలాగంటారాట 36 అడుగులున్న ఈ స్టీలు చెట్టుకి 72 ఆకుల్లాంటి నిర్మాణాలుంటాయి. ఏ చిన్న గాలి తరంగాలు వచ్చినా ఆకుల్లాంటి టర్బైన్లు గుండ్రంగా తిరిగి కరెంటుని ఉత్పత్తి చేస్తాయి.