అలోవెరా ఒక చిక్కగా జెల్‌గా ఉండే ఒక పదార్థం. అలోవెరా (కలబంద)ను కాలినగాయాలకు, తెగిన గాయాలకు, చర్మ ఇన్ఫెక్షన్లకు, సౌందర్య సాధనంగా అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అలోవెరాను సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. కుమారి అంటే ప్రిన్సెస్‌ అని అర్ధం. ఇది చర్మం ఆరోగ్యంగా, యూత్‌ ఫుల్‌గా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. అలోవెరా జెల్‌ల్లో అనేక న్యూట్రీషియన్స్‌, విటమిన్స్‌, మినిరల్స్‌ ఇవి శరీరానికి ఎంత అవసరం అయిన వాటితో నిండి ఉంది.

అలోవెరా జ్యూస్‌ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్‌ మన శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు నెట్టివేస్తుంది. ఇంకా ఈ జ్యూస్‌లో మంచి అమినో యాసిడ్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మోనోపాజ్‌ దశలో శరీరంలో ఏర్పడే హాట్‌ ఫ్లాషెస్‌ నుండి మన శరీరానికి ఉపశమనం కలిగించి శరీరంను చల్లగా ఉంచుతుంది. అలోవెరా జ్యూస్‌లో ఉన్న అనేక విటమిన్స్‌ మన శరీరంలోని డ్యామేజ్‌ అయిన బాడీ సెల్స్‌ లేదా టిష్యూలను రిపేర్‌ చేయడానికి సహాయపడుతుంది.

ఈ అలోవెరా జెల్‌ శరీర బాహ్య పరిస్థితులకు స్వీకృతి పెంచడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అలోవెరా జెల్‌ శరీరానికి పోషకాలను, శరీరానికి అవసరం అయ్యే వాటిని జతచేస్తుంది. ఇండియన్‌ స్కిన్‌ టోన్‌కు అలోవెరతో ఫర్ఫెక్ట్‌ ఫేస్‌ ప్యాక్‌ ఆ అలోవెర జ్యూస్‌ ను బహుముఖ ప్రయోజనకారి అంటారు. కొన్ని వేల సంవత్సరలా నుండి దీన్ని ఔషదంగా ఉపయోగిస్తున్నారు. కాలిన గాయాలు, హెమరాయిడ్స్‌ అల్సర్‌ వంటి అనేక అనారోగ్యాలను చాలా ఎఫెక్టివ్‌గా నయం చేస్తుంది.

అలోవెరాలోని ఆరోగ్యగుణాలు చెప్పలేనన్ని ఉన్నాయి. కలబందలో విటమిన్‌ ఎ, సి, ఇ, బి1, బి2, బి3 మరియు బి6 ఉన్నాయి. కలబంద రసాన్ని నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా కలబంద రసంలో స్ట్రాబెర్రీ జ్యూస్‌ మిక్స్‌ చేయాలి. దీనిలో మాపెల్‌ సిరఫ్‌ను మిక్స్‌ చేసి కొద్దిగా నిమ్మరసం మిక్స్‌ చేసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. ఇది మెత్తగా స్మూతీగా అయిన తర్వాత ఒక గ్లాసు లో పోసుకొని తీసుకోవాలి. వేసవిలో వేడినుండి మన శరీరంను రక్షించుకోవడానికి తాజా అలోవెర జ్యూస్‌కు కొద్దిగా పైనాపిల్‌, బొప్పాయి మిక్స్‌ చేసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. మెత్తబడే వరకూ స్మూత్‌గా బ్లెడ్‌ చేసి తర్వాత నిమ్మరసం, తేనె మిక్స్‌ చేసి గ్లాసులో తీసుకొని తాగాలి. అవసరం అయితే కొన్ని ఐస్‌ ముక్కలు కూడా జోడించవచ్చు. అలోవెర, నిమ్మరసం శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది.

ఈ జ్యూస్‌ ను మిక్స్‌ జార్‌లో వేసి బాగా మిక్స్‌ చేయాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు, తేనె, అలోవెరా జ్యూస్‌ వేసి బాగా మిక్స్‌ చేయాలి. మొత్త మిశ్రమాన్ని మరో సారి బ్లెడ్‌ చేసి గ్లాసులో వడగట్టి పోసుకొని అందులో కొన్న పుదీనా ఆకులు వేసి గార్నిష్‌ చేసి తీసుకోవాలి. మీరు యాంటీ ఆక్సిడెంట్‌ మరియు బీటా కెరోటిన్‌, ఇతర ఎసెన్షియల్‌ న్యూట్రీషియన్‌ కోసం చూస్తుంటే కనుకు ఒక గ్లాస్‌ క్రాన్‌ బెర్రీ జ్యూస్‌లో కొద్దిగా అలోవెరా మిక్స్‌ చేసి అందులో రెండు గ్రీన్‌ ఆపిల్‌ మిక్స్‌ చేయాలి. తర్వాత క్యారెట్‌, బేరిపండ్లు కూడా మిక్స్‌ చేసి ఈ కాంబినేషన్‌కు మిక్సీలో గ్రైండ్‌ చేసుకొని సరిపడా నీళ్ళు పోసి స్మూతీగా తయారయ్యాక, వెంటనే గ్లాసులో వడగట్టి తీసుకోవాలి. మీరు ఫ్రెష్‌గా ఫీలవ్వాలన్నా, లేదా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా హెల్తీ గ్రీన్‌ అలోవెరా స్మూతీని తీసుకోవాలి. ఒక గ్లాస్‌ కోకన్‌ వాటర్‌లో కొద్దిగా కాలే వేసి మిక్స్‌ చేసి, అందులోనే ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలు, కీరదోస ముక్కలు కొద్దిగా వేసి బ్లెడ్‌ చేయాలి.

తర్వాత అందులో రెండు చెంచాలా అలోవెరా జ్యూస్‌, మామిడిపండు ముక్కలు మిక్స్‌ చేసి మిక్సీలో బ్లెండ్‌ చేసి, గ్లాసులో పోసుకొని తాగాలి. ఒక కప్పు కీరదోస జ్యూస్‌, ఒక కప్పు ఆపిల్‌ జ్యూస్‌ తీసుకుని అందులో 2 చెంచాలా అలోవెరా జ్యూస్‌ లేదా పల్స్‌ వేసి బాగా మిక్స్‌ చేసి మిక్సీలో వేసి బ్లెడ్‌ చేయాలి. ఈ స్మూతీకి కొద్దిగా నిమ్మరసం మిక్స్‌ చేసి గ్లాసులో పోసుకొని తాగాలి. వేసవి వేడిని ఎదుర్కోవడానికి ఐస్‌ అలోవెరా లెమనేడ్‌, అల్లం, ఆరెంజ్‌ను మిక్సీలో వేసి అందులో అరకప్పు అలోవెర జ్యూస్‌ మిక్స్‌ చేసి, అరకప్పు ఐస్‌ క్యూబ్‌, నిమ్మరసం మిక్స్‌ చేయాలి. అందులోనే మీకు నచ్చిన స్వీట్నర్‌ను కూడా మిక్స్‌ చేసి తీసుకోవాలి. అరకప్పు తాజా పైన్‌ ఆపిల్‌, ఒక క్యారెట్‌, ఒక గ్రీన్‌ ఆపిల్‌, ఒక చెంచా అలోవెర గుజ్జు వేసి బాగా మిక్స్‌ చేసి అందులో ఒక చెంచా కొబ్బరి పాలు మిక్స్‌ చేసి బ్లెండ్‌ చేయాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని డ్రింకింగ్‌ గ్లాసులో పోసి తీసుకోవాలి. కలబంద, స్ట్రాబెర్రీ ఆరోగ్యకరమైనది. ఇందులో న్యూట్రీషియన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి పులస్కలంగా ఉంపటుంది. ఒక బౌల్లో ఆరెంజ్‌, నిమ్మ రసం, స్ట్రాబెర్రీ, అలోవెరా జ్యూస్‌ మిక్స్‌ చేసి మిక్సీలోవేసి బ్లెండ్‌ చేయాలి. తర్వాత తీసుకోవాలి. అవొకాడోలో హెల్తీ న్యూట్రీషియన్స్‌ విటమిన్‌ ఈ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాలో ఆక్సిడేషన్‌ను నివారించడంలో సహాయపడుతాయి. అలోవెరా, అవొకాడో తీసుకోవడం వల్ల వయస్సు మీదపడకుండా చేసే యాంటీఆక్సిడెంట్స్‌ కెరోటినాయిడ్స్‌కు సహాయపడుతుంది. ఒక కప్పు కొబ్బరి నీళ్ళు, అరకప్పు అలోవెర జ్యూస్‌, అరకప్పు కీరదోస కాయ జ్యూస్‌, కాల్‌ కప్పు అవొకాడో, 2 కప్పులు ఆర్గానిక్‌ బెర్రీస్‌ ఒక పెద్ద బౌల్లో తీసుకొని బ్లెండ్‌ చేసి తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here