కడప, జులై 29 (న్యూస్‌టైమ్): కడప నగరపరిధిలోని 20వ డివిజన్‌లో ఉన్న కృష్ణా సర్కిల్‌ నుంచి దేవునికడప రోడ్డు వరకు కాలువలపై అక్రమ కట్టడాలను కడప నగరపాలక సంస్థ కమిషనర్‌ లవన్న ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్బంగా కమిషనర్ లవన్న మాట్లాడుతూ వర్షాకాలం ప్రభావం వలన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయని అటువంటి ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు.

అలాగే నగరంలోని మెయిన్‌ మున్సిపల్‌ హైస్కూలు మద్రాసు రోడ్డులో ఉన్న తోపుడుబండ్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని పలువురు తన దృష్టికి తీసుకురాగా సమస్యాత్మకంగా ఉన్న తోపుడు బండ్లను తొలగించడంజరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఈఈలు దౌలా, కరీముల్లా, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ అధికారి, డీఈ దస్తగిరి, శానిటరీ సిబ్బంది నాగరాజు, భరత్‌కుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.