ఏలూరు, జులై 29 (న్యూస్‌టైమ్): ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచెస్తున్న ప్రతి హమాలీ కార్మికుల కుటుంబానికి స్వంతఇల్లు కల్పించాలని తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నానని, ఈ మేరకు వెంకటాపురం పంచాయతీలో మాదేపల్లి శుక్రవారితోట ప్రాంతాలలో హమాలీలకు ప్రత్యేక కాలనీలు కూడా ఏర్పాటుచేశామని, అయితే 2014లో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ ఈ కాలనీలను నిర్లక్ష్యం చేయడంతో కనీస సౌకర్యాలు లేక కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించానని 15 రోజుల్లో హమాలీల కాలనీల్లో పాదయాత్రచేసి సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి అవసరమైన నిధులు సమకూర్చి కాలనీవాసుల కష్టాలు తీరుస్తానని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు.

ఇంకా ఇళ్లలేని హమాలీ సోదరులందరికీ స్వంతఇంటికలను సాకారం చేస్తానని ప్రతి హమాలీ తనపిల్లలను చదవించడానికి శ్రద్దవహించాలని అమ్మఒడిపధకం క్రింద ప్రభుత్వం నగదు సహాయం అందించనున్నదని, పిల్లల చదువుభారం పేదవర్గాలకు ఆర్థిక భారం కాకూడదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ది ఎన్నికలముందు ప్రకటించిన హామీని నెరవేర్చారని చెప్పారు.

చదువుద్వారా హమాలీ పిల్లలు భవిష్యత్‌లో ఈ కష్టాల కడలిలో కాకుండా ఆనందంగా అగ్రవర్ణాల పిల్లలతోపాటు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని అందుకే అమ్మఒడి పధకం పేద విద్యార్థులకు ఒక బరోసా కల్పిస్తుందని ఆళ్లనాని చెప్పారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికసంఘ నాయకులు యు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.