• తీవ్రమైన పగుళ్ళతో బాధపడుతున్నారా?

అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు.. ఇంటిపని, వంటపని చేస్తున్నప్పుడు మెత్తని స్పాంజితో తయారు చేసిన స్లిప్పర్స్‌ వాడాలి. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదు రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్‌ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలవిూద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. పాదాలను నీళ్ళలోనే ఉంచి ప్యూమిక్‌స్టోన్‌తో పాదాలవిూద మడమలవిూద పగుళ్ళను మూడు-నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది.

మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి. రోజూరాత్రిపూట హేండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్‌ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సుధరించి నిద్రించడం మంచిది. కాలివేళ్ళగోళ్ళు వీలనయింతగా కత్తిరించడం మంచిది. పొడిచర్మంగలవారు వారానికి ఒకసారి గోరువెచ్చటి నూనెలో పాదాల్ని కాసేపు వుంచాలి. ఇలా చేస్తే విూ పాదాలు మృదువుగా తయారవుతాయి. కాగా, చాలా మంది మహిళలు లేదా యువకులు పొద్దస్తమానం ఫేస్‌ వాష్‌ చేస్తున్నా వారి ముఖం జిడ్డుగా మారుతుంది. ఇలా జిడ్డు చర్మం గలవారు ఇంట్లోనే దొరికే వస్తువులతో పేస్‌ ప్యాక్‌ తయారు చేసి, దాన్ని ఉపయోగించి జిడ్డు ముఖాన్ని కాంతివంతం చేయవచ్చు.

అదెలాగంటే, పది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. కోడిగుడ్డు తెల్లసొనను మాత్రమే బాగా గిలకొట్టి, అందులోనే ద్రాక్షపండ్లను, నిమ్మరసాన్ని కూడా వేసి మరికాసేపు గిలకొట్టాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే నేచురల్‌ క్లెన్సర్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ద్రాక్షరసం వల్ల చర్మానికి మృధుత్వం వస్తుంది. కోడిగుడ్డు వల్ల చర్మం వదులుకాకుండా కాపాడుతుంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పేస్‌ ప్యాక్‌ను పొడి చర్మం గలవారు మాత్రం వాడకూడదు.

ఒకవేళ వాడినట్లయితే వారి చర్మం మరింత పొడిబారిపోతుంది. ఒకవేళ ఇలా పండ్లు, సౌందర్య సాధనాలను ఉపయోగించి పేస్‌ ప్యాక్‌ చేసేందుకు సమయం, ఓపికా లేనప్పుడు… నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో ముఖాన్నంతటినీ బాగా రుద్ది పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్లయితే… ముఖంలో జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా అవుతుంది.