విశాఖపట్నం, జులై 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం వైద్య కేంద్రాన్ని ఏయూ రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌లు ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య కేంద్రాన్ని పరిశీలించి, చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న విద్యార్థి నీలాంబర్‌తో మాట్లాడారు.

విద్యార్థి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా ఆరోగ్య కేంద్రం తన సేవలు అందించాలని అధికారులు సూచించారు. ఏయూ వైద్య కేంద్రం సిబ్బంది అందిస్తున్న చికిత్స విధానం గమనించారు. అనంతరం ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.ఎన్‌ మూర్తితో మాట్లాడుతూ. వైద్య కేంద్రం అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన అధికారులకు వివరించారు.

నిత్యం వందలాది మంది విద్యార్థులకు కేంద్రం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు. వైద్య కేంద్రం రెండో అంతస్థు నిర్మాణం జరిగితే పూర్తిస్థాయిల 24 గంటలు వైద్య సేవలు విద్యార్థులకు అందించడం సాధ్యపడుతుందని తెలిపారు. వైద్య కేంద్రంలో ఏర్పాటు అందుబాటులో ఉంచిన ఉపకరణాలను అధికారులకు చూపించారు.