విశాఖపట్నం, జులై 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డిని పలువురు అభినందించారు.

ఉదయం ఎంపీ విజయసాయి రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఐ.డి. రాజు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజనీతిశాస్త్ర విభాగం ఆచార్యులు సి.హెచ్‌ వెంకటరావు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.