గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే గ్రామ పంచాయితీ. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. పంచాయితీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(బి) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థ. పంచాయితీ ఏరియా అంటే ఒక పంచాయితీ ప్రాదేశిక ప్రాంతం. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. స్థానిక స్వపరిపాలన విధానములో ఇదే మొదటి మెట్టు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.

ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయితీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామ పంచాయితీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేవి.

అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే రెండవదిగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు 1964లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. చట్టరీత్యా కమిషనర్ అనే అధికారి (జిల్లా కలెక్టర్) ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయితీగా సృష్టించవచ్చు.

పంచాయితీ రాజ్‌లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ గ్రామ పంచాయితీ. పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయితీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం మూడంచెల విధానం అమల్లో ఉంది.

మొదటి అంచెగా పేర్కొనేది… గ్రామ పంచాయితీ. ఇది గ్రామస్థాయిలో ఉంటుంది.

ఇక, రెండో అంచె: మండల పరిషత్తు. ఇది మండల స్థాయిలో ఉంటుంది.

చివరిగా మూడో అంచె: జిల్లా పరిషత్తు. ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది. దీనిలో ముఖ్యమైన విభాగాలు లేక పదవులు: గ్రామ సభ, పంచాయతీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ కార్యదర్శి. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు. ఎన్నికలలో రాజకీయ పార్టీ అభ్యర్ధులు వుండరు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్, జిల్లా కలెక్టర్లు గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేస్తారు.

సాధారణంగా 300 మందికి తగ్గకుండా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. జనాభాననుసరించి ఆ గ్రామంలో వార్డుల సంఖ్యను నిర్ణయిస్తారు. వార్డు సభ్యులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. రెవెన్యూ డివిజన్ స్థాయిలో (ఆర్డీవో) వార్డు సభ్యుల రిజర్వేషన్లు నిర్ణయమవుతాయి. ఎస్సీ, ఎస్టీ జనాభాను అనుసరించి, బీసీలకు 34 శాతం స్థానాలు కేటాయిస్తారు.

వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఉపసర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు వర్తించవు. వార్డు సభ్యులుగా పోటీచేసేవారు రూ. 500, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 డిపాజిట్‌గా చెల్లించాలి. వార్డు మెంబర్‌గా పోటీచేసే అభ్యర్థి వ్యయపరిమితి గ్రామ జనాభా పదివేల కంటే ఎక్కువ ఉంటే రూ. 10,000, జనాభా పదివేల కంటే తక్కువ ఉంటే రూ. 6,000. గ్రామపంచాయతీ సమావేశం 30 రోజులకోసారి తప్పనిసరి.

గ్రామపంచాయతీ సమావేశాల కోరం 1/3వ వంతు. కోరం సభ్యుల కోరిక మేరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. వరుసగా 90 రోజులు సమావేశాలు నిర్వహించనివారిపై కలెక్టర్ చర్య తీసుకోవచ్చు. వార్డు సభ్యులు స్టేజ్-2 అధికారి సమక్షంలో ప్రమాణం చేస్తారు. వార్డు సభ్యులు తమ రాజీనామాను మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు అందిస్తారు. ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఉప సర్పంచ్ పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి.

ఉపసర్పంచ్ పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే 30 రోజుల్లోగా నూతన ఉపసర్పంచ్‌ను ఎన్నుకోవాలి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేటప్పుడు కనీసం 2/3వ వంతు సభ్యుల సంతకాలతో కూడిన నోటీసును ఆర్డీవోకు అందించాలి. నోటీసును స్వీకరించిన ఆర్డీవో నెలరోజుల్లోగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. మొత్తం సభ్యుల సంఖ్యలో మెజార్టీ సభ్యుల సంఖ్యను కోరంగా భావిస్తారు.

సాధారణ మెజార్టీతో ఉపసర్పంచ్‌ను తొలగించవచ్చు. కోరం లేకపోవడంవల్ల అవిశ్వాస తీర్మానంపై చర్చించే సమావేశాలు వరుసగా 3 సార్లు వాయిదా పడితే ఆ తీర్మానం వీగిపోయినట్లుగా భావించాలి. వార్డు సభ్యులకు ఎలాంటి వేతనాలు ఉండవు. సమావేశాలు నిర్వహించేటప్పుడు రూ. 75 సిట్టింగ్ ఫీజుగా చెల్లిస్తారు. గ్రామ పంచాయతీ గ్రామపాలనలో కార్యనిర్వాహకశాఖ.

 • గ్రామ పంచాయతీ నిర్మాణం…

గ్రామ సభ
గ్రామపంచాయతీ వార్డు సభ్యులు
గ్రామపంచాయతీ కో ఆప్టెడ్ సభ్యులు
గ్రామపంచాయతీ శాశ్వత ఆహ్వానితులు
గ్రామ సర్పంచ్
గ్రామ ఉప సర్పంచ్
గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి/గ్రామ కార్యదర్శి
గ్రామ రెవిన్యూ అధికారి.

 • గ్రామ సభ…

గ్రామసభ అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహాన్ని గ్రామసభ అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి దీన్ని ప్రాతిపదికగా భావిస్తారు. గ్రామసభలో గ్రామంలో వయోజనులు (ఓటు హక్కు కల వారు). గ్రామసభ పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలాధారం, మాతృక. గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు.

గ్రామసభ అధికారాలు, విధులు, నిర్మాణంపై రాష్ట్ర శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందిస్తుంది. ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు. ఏటా ఏప్రిల్‌ 14న, అక్టోబర్‌ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి.

అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు సర్పంచ్‌ లేదా ఉప సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. గ్రామసభకు కోరం నిర్దేశించలేదు. 1/10వ వంతు మంది సభ్యుల కోరికపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. ఒకవేళ సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించకపోతే జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు.

రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం మంది ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి. గ్రామసభకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు. గ్రామ బడ్జెట్ ఆమోదంలో గ్రామసభ కీలకం.

గ్రామ పంచాయతీ గ్రామసభకు బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబరు 1న ఏర్పడింది. 1959లో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేశారు.

 • గ్రామ సభ విధులు…

గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాయ లెక్కలు, గత కాలపు పరిపాలన, ఆడిట్‌ నివేదికలను ఆమోదించడం. గ్రామ పంచాయతీ అభివృద్ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు. వచ్చే కాలానికి చేపట్టే పనులు, బడ్జెట్‌లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం.

పన్నుల మార్పుల ప్రతి పాదనలు, పన్ను బకాయిదారులను, కొత్త కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపిక జాబితా రూపొందించడం. సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం. అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.

 • గ్రామ పంచాయతీల వ్యవస్థాపన…

పంచాయతీరాజ్ వ్యవస్థను 3 స్థాయిల్లో నెలకొల్పాలని తెలుపుతున్నది. అవి: జిల్లాపరిషత్, తాలూకా, గ్రామ పంచాయతీ. 20 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్న రాష్ర్టాల్లో మాధ్యమిక సంస్థల ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంది.

 • గ్రామ పంచాయతీల నిర్మాణం…

గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్‌ల సభ్యులు ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. 2వ, 3వ స్థాయిల్లో అధ్యక్షుల ఎన్నిక కచ్చితంగా పరోక్ష పద్ధతిలోనే జరగాలి. ఆ రాష్ట్ర శాసన నిర్మాణశాఖ నిర్ణయించిన మేరకు ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉండవచ్చు.

 • గ్రామ పంచాయతీల సీట్ల రిజర్వేషన్…

పంచాయతీరాజ్ అన్ని స్థాయిల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో అదే వర్గానికి చెందిన మహిళలకు 1/3 వంతు సీట్లను రిజర్వ్ చేయాలి. మహిళలకు పంచాయతీరాజ్ వ్యవస్థ అన్ని స్థాయిల్లో 1/3వ వంతుకు తగ్గకుండా రిజర్వేషన్లను కల్పించాలి (ఎస్సీ, ఎస్టీ, మహిళలను కలుపుకుని). సర్పంచ్, మాధ్యమిక స్థాయి, జిల్లా పంచాయతీ అధ్యక్ష పదవుల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలకు కేటాయించాల్సిన సీట్లను ఆ రాష్ట్ర శాసనసభ నిర్ధారిస్తుంది. రిజర్వేషన్ల గురించి ఆ రాష్ట్ర శాసననిర్మాణశాఖ చట్టాన్ని రూపొందిస్తుంది.

అంతే తప్ప 73వ రాజ్యాంగ సవరణ చట్టం బీసీలకు రిజర్వేషన్లు కల్పించదు. దేశంలో పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం – బీహార్. ప్రస్తుతం దేశంలో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్టాలు బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, త్రిపుర, పశ్చిమబెంగాల్.

 • గ్రామ పంచాయతీల కాలపరిమితి…

ఈ చట్టాన్ని అనుసరించి అన్ని స్థాయిల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం ఐదేళ్లు. ఒకవేళ ఐదేళ్ల లోపు ఒక వ్యవస్థ రద్దయితే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ పదవీకాలం 6 నెలలే ఉంటే ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.

 • గ్రామ పంచాయతీల సభ్యత్వానికి అనర్హత…

పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ అధ్యక్షులు, సభ్యులు వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణశాఖకు ఉంటుంది. పార్లమెంటు, శాసనసభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి. స్థానిక సంస్థలకు పోటీచేయడానికి కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలి. ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. 1995 నుంచి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు.

 • గ్రామ పంచాయతీ విధులు…

పంచాయతీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు, 11వ షెడ్యూల్‌లోని 29 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ చేయాలి. 29 అంశాల్లోని 12 అంశాలు తప్పనిసరిగా బదిలీ చేయాలి. మిగిలిన 17 అంశాలు ఐచ్ఛిక విధులుగా ఉంటాయి.

వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ
భూమి అభివృద్ధి, భూసంస్కరణలు, మృత్తికా సంరక్షణ
చిన్నతరహా నీటిపారుదల, నీటి వనరుల నిర్వహణ
చేపల పెంపకం, పశు శాలల నిర్వహణ
సామాజిక అడవుల పెంపకం
గౌణ అటవీ ఉత్పత్తులు
చిన్నతరహా పరిశ్రమలు
ఖాదీ గ్రామీణ కుటీర పరిశ్రమలు
గ్రామీణ గృహవసతి
తాగునీరు సరఫరా
మురుగు కాల్వల ఏర్పాటు, నిర్వహణ, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ
పాడుపడ్డ బావులను, కుంటలను పూడ్చటం
ఇంధనం, పశుగ్రాసం
రోడ్లు, వంతెనలు, జలమార్గాలు, పడవలు వంటి రవాణా సౌకర్యాలు, పంచాయతీ భవనాలు నిర్మించడం లేక బాగుచేయడం
పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ
వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ, విద్యుత్ పంపిణీ
సాంప్రదాయేతర శక్తి వనరులు
పేదరిక నిర్మూలన పథకాలు
ప్రాథమిక, ఉన్నత విద్య
సాంకేతిక శిక్షణ
వయోజన విద్య, వృత్తి విద్య
గ్రంథాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ మొదలగునవి
సాంస్కృతిక కార్యకలాపాలు
మార్కెట్ ధరలు
ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అంటు వ్యాధుల నివారణ చర్యలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
జనన, మరణాల నమోదు
శ్మశానాల నిర్వహణ, దిక్కులేని శవాలు, పశువుల కళేబరాలను పూడ్చటం
కుటుంబ నియంత్రణ
మహిళా శిశు సంక్షేమం
సాంఘిక సంక్షేమం (శారీరక, మానసిక వికలాంగుల సంక్షేమం)
ప్రజాపంపిణీ వ్యవస్థ
బలహీన వర్గాల సంక్షేమం
సామాజిక సంపద, ఆస్తుల సంరక్షణ.

 • గ్రామ పన్నులు, నిధులు, ఆదాయాలు…

రాష్ట్ర శాసననిర్మాణశాఖ నిర్ణయించిన మేరకు పన్నుల విధింపు, వసూలు.
రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే కొన్ని పన్నుల్లో వాటా.
రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లు.
పంచాయతీలకు సంబంధించి నిధులను జమచేయడానికి, ఆ సొమ్మును ఖర్చు చేయడానికి రాష్ట్ర శాసననిర్మాణశాఖ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయవచ్చు.
పంచాయతీల ఆర్థిక వనరులు
ఎ) పన్నుల ద్వారా వచ్చే ఆదాయం: ఇంటి పన్ను, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీ పన్ను, భూమి శిస్తు, వాహన పన్ను, జంతువులపై పన్ను, ప్రకటనలపై పన్ను, దుకాణాలపై పన్ను మొదలైనవాటి ద్వారా వచ్చే ఆదాయం.
బి) ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: తన మూలధనం నుంచి వచ్చే ఆదాయం, విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లపై వచ్చే ఆదాయం.
సి) ప్రభుత్వ సహాయక గ్రాంట్లు, సెస్సులు, అస్తులు పై రాబడి, గ్రామ పంచాయతి నిధులపెట్టిబడిపై వడ్డీ.
డి) వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు.
ఇ) పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటుచేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు.
పంచాయతీ నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే సర్పంచ్ ఖర్చు చేయాలి. సర్పంచ్ కి చెక్ రాసే హక్కు వుంటుంది. నిధుల దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు.పంచాయితీలు రుసుం, పంచాయితీలను వాటి జనాభాను బట్టి, వార్షిక ఆదాయాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు.

మేజర్ గ్రామపంచాయతీలు: రూ. 60,000 కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నవి.
మైనర్ గ్రామపంచాయతీలు: రూ. 60,000 కంటే తక్కువ వార్షికాదాయం ఉన్నవి.
20,000 జనాభా కంటే తక్కువగా వున్న ఉనిసిపాలిటీలన్నింటిని స్పెషల్ గ్రేడు పంచాయితీలుగా చేశారు.
గ్రామ పంచాయతీల ఆర్థికస్థితి సమీక్ష కోసం ఆర్థిక కమిషన్:

ఆర్థిక సంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలు, పదవీకాలం మొదలైన వాటికి సంబంధించి రాష్ట్రశాసననిర్మాణశాఖ, చట్టాలను రూపొందించవచ్చు.
ఈ నిబంధన ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు కావాలి.
ఆర్థిక సంఘంలో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. 4. వీరిని గవర్నర్ నియమిస్తారు.
వీరు తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించాలి. పదవీకాలం గవర్నర్ సూచించిన (నిర్ణయించిన) మేరకు (ఐదేండ్ల) ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ వ్యవస్థల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ.
పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇవ్వాల్సిన సహాయక గ్రాంట్లను సకాలంలో అందేటట్లు చూడటం
రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పింస్తుంది. 9. గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసన నిర్మాణశాఖకు సమర్పిస్తారు.

 • గ్రామ పంచాయతీల ఆర్థికస్థితి ఆడిటింగ్…

పంచాయతీ ఖర్చులను రికార్డు చేయడం, వాటి ఆడిటింగ్‌లకు సంబంధించి తగిన శాసనాలను రాష్ట్ర శాసననిర్మాణశాఖ రూపొందిస్తుంది.

 • గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘాల ఏర్పాటును సూచిస్తున్నది.
రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు.
కమిషనర్‌ను, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతి (రాష్ట్రపతి తొలగిస్తారు)లోనే తొలగిస్తారు.
గ్రామ పంచాయతీ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విభాగం అన్వయించడం:

73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి 9వ భాగం కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుందని, వర్తించదని లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకే వర్తిస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేయవచ్చు.

 • గ్రామ పంచాయతీ ఈ విభాగం వర్తించని ప్రాంతాలు (మినహాయింపులు)…

 • 244(1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు…

244(3)లో పేర్కొన్న షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ఈ విభాగం వర్తించదు.
నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, జమ్ముకశ్మీర్ రాష్ర్టాల్లో ఈ విభాగం వర్తించదు.
మణిపూర్ రాష్ట్రంలో జిల్లా కౌన్సిల్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ చట్టం వర్తించదు.
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాహిల్ కౌన్సిల్ ప్రాంతంలో కూడా ఈ చట్టం వర్తించదు.

 • గ్రామ పంచాయతీ పూర్వశాసనాల కొనసాగింపు…

ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాదిలోపు అన్ని రాష్ట్రాల్లో పూర్వపు శాసనాల ప్రకారమే పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంటుంది. (ఏప్రిల్ 24, 1993 నుంచి ఏప్రిల్ 24, 1994లోపు)
ఈ చట్టంలోని అంశాలను, రాష్ట్ర శాసనసభలో సగం మంది కంటే ఎక్కువ హాజరై ఆపై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీతో 73వ రాజ్యాంగ సవరణ చట్టం మౌలిక లక్షణాలకు లోబడి పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది.

 • గ్రామ పంచాయతీ న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు – ట్రిబ్యునళ్లు…

పంచాయతీరాజ్ వ్యవస్థలోని నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల సీట్ల కేటాయింపునకు సంబంధించి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
పంచాయతీరాజ్ ఎన్నికల వివాదాల విచారణ నిమిత్తం ఆ రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు.

 • గ్రామ పంచాయతీ 73వ రాజ్యాంగ సవరణ అమలు…

73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 పంచాయతీరాజ్ వ్యవస్థ (భాగం 9, ప్రకరణలు 243 – 243(ఒ)). ఈ రాజ్యాంగ సవరణ 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాలలో ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు.

11వ షెడ్యూల్‌లోని 29 అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక. 73వ సవరణ తర్వాత 3 స్థాయిల్లోని సంస్థలకు గ్రామ స్వరాజ్ పేరుతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన రాష్ర్టం- మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయనప్పుడు మధ్యలోనే వారిని తొలగించే రీకాల్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించినవారు- మహాత్మాగాంధీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా స్థానిక సంస్థల ప్రతినిధులను వెనుకకు పిలిచే పద్ధతిని ప్రవేశపెట్టింది. రీకాల్ ద్వారా తొలగింపునకు గురైన మొదటివ్యక్తి- చాబ్రా నగరపాలక అధ్యక్షుడు.

స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించిన మొదటి రాష్ట్రం- బీహార్. పంచాయతీరాజ్ సంస్థలపై రాజస్థాన్ ప్రభుత్వం సాదిక్ అలీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ్రామసభ సమావేశాలు సరిగా జరగడంలేదని సిఫారసు చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం గ్రామసభ పనితీరును మెరుగుపర్చడానికి గిరిధర్‌లాల్ వ్యాస్ కమిటీని నియమించింది. స్థానిక సంస్థల ప్రతినిధులకు గ్రావ‌ుశాట్ ఉపగ్రహ చానెల్ ద్వారా శిక్షణనిస్తున్న రాష్ర్టం- కర్ణాటక.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన రాష్ట్రం- గుజరాత్. గ్రామసభ ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న రాష్ట్రం- కేరళ. విలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రం- హర్యానా. 1978 నుంచి నియమబద్ధంగా నేటివరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం- పశ్చిమ బెంగాల్. ఎస్సీలు లేని కారణంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేసిన రాష్ట్రం- అరుణాచల్‌ప్రదేశ్. షెడ్యూల్డ్ జాతుల నివాస ప్రాంతాల్లోనూ స్థానిక సంస్థల ఏర్పాటుకు చట్టసవరణ చేసిన సంవత్సరం- 1996.

కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను 2004లో ఏర్పాటు చేశారు. దేశంలో నేటివరకు ఆంధ్రప్రదేశ్‌తో సహా కేవలం 10 రాష్ట్రాల్లో మాత్రమే జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటును సూచించిన కమిటీ- జలగం వెంగళరావు కమిటీ. స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి ఇగ్నోతో కేంద్రప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. 2009, అక్టోబర్ 2 నుంచి 2010, అక్టోబర్ 2 మధ్య ఏడాదిని గ్రామసభ సంవత్సరంగా నిర్వహించారు. 2010 నుంచి ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

 • గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు…

పంచాయితీ సభ్యులు అన్ని గ్రామాలకు ఒకే విధంగా వుండరు. గ్రామంలోని ఓటర్ల సంఖ్యను బట్టి వీరి సంఖ్య వుంటుంది. గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. గ్రామంలోని ప్రతి వార్డు నుండి ఒక సభ్యున్ని రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది.

పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది.

గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు.

 • గ్రామ పంచాయతీ కోఆప్టెడ్‌ సభ్యులు…

గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.

 • గ్రామ పంచాయతీ శాశ్వత ఆహ్వానితులు….

మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.

 • గ్రామ సర్పంచ్‌…

గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని ‘గ్రామ సర్పంచ్’ అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. ఇవి రొటేషన్ పద్ధతిలో వుంటుంది. సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు.

అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్‌ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్‌ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు.

అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణ ఓటర్లతో ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికవుతారు. సాధారణ రిజర్వేషన్లు సర్పంచ్ స్థానాలకు వర్తిస్తాయి. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయమవుతాయి. గ్రామసభ, గ్రామపంచాయతీలకు అధ్యక్షత వహించే సర్పంచ్ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు.

సర్పంచ్‌గా పోటీచేసే సాధారణ అభ్యర్థులు రూ. 2,000, ఎస్సీ, ఎస్టీలు రూ. 1,000 డిపాజిట్‌గా చెల్లించాలి. డిపాజిట్ పొందడానికి 1/6వ వంతు ఓట్లు పొందాలి. సర్పంచ్‌లకు తెలంగాణలో రూ. 5000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3000 గౌరవ వేతనం లభిస్తుంది. సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థి వ్యయపరిమితి గ్రామ జనాభా పదివేల కంటే ఎక్కువ ఉంటే రూ. 80,000, పదివేల కంటే తక్కువ ఉంటే రూ. 40,000.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యయాన్ని లక్షకు పెచింది.

స్టేజ్-2 అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారికి అందివ్వాలి. సర్పంచ్‌లను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించలేరు. సర్పంచ్ పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే 4 నెలల్లోగా తిరిగి ఎన్నిక నిర్వహించాలి. ఒకవేళ పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉపఎన్నిక అవసరం లేదు. సర్పంచ్‌లు ఖర్చుల ఆడిట్ నివేదికను సమర్పించనప్పుడు, చెక్ పవర్‌ను దుర్వినియోగం చేసిన సందర్భాల్లో, సమావేశాలు నిర్వహించని సందర్భాల్లో వారిని కలెక్టర్ సస్పెండ్ చేయవచ్చు. పంచాయతీరాజ్ శాఖ విచారణలో అవకతవకలు నిరూపణ అయితే వారిని తొలగించే ఉత్తర్వులు కలెక్టర్ జారీచేస్తారు.

గ్రామాధికారి సహకారంతో గ్రామపంచాయతీ ఎజెండాను సర్పంచ్ రూపొందిస్తారు. పంచాయతీ తీర్మానాలను అమలుచేయడంలో సర్పంచే కీలక ప్రాత్రధారి. 1984లో గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం నియమించిన వీడీవోలు గ్రామం, పంచాయతీలో సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ తీర్మానాలను పంచాయతీరాజ్ శాఖకు గ్రామాధికారి పంచాయతీ కార్యదర్శికి పంపిస్తారు. తీర్మానాల అమల్లో సీఈవోగా వ్యవహరిస్తారు. సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి ఆదేశాల మేరకు గ్రామ పాలనా బాధ్యతలను వీడీవో లేదా పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 స్థాయిల్లోని సంస్థల్లో పన్నులు వేసే అధికారం కేవలం పంచాయతీకే ఉంది. ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధిస్తే ఆ వ్యక్తి శిక్ష విధించిన రోజు నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదు.

 • గ్రామ సర్పంచ్‌ విధులు…

పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణాధికారం ఉంటుంది. ఉప సర్పంచ్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ఉప సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే 30 రోజుల లోపు ఉప ఎన్నిక ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయవచ్చు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు.

గ్రామ పంచాయతీ ఆహార కమిటీ, విద్యా కమిటీ, పారిశుధ్య కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్‌ వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తారు. ప్రజా స్థలంలో రోడ్లపై విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడం. మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ. రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం. పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం.

ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం. శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం. కలరా, మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం. తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను నమోదు చేయడం, పశుశాలలను ఏర్పాటు చేయడం. ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం. సాంఘిక, ఆరోగ్య, విద్యా వసతులను కల్పించడం.

కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం. ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణ. ఆట స్థలాలు, క్లబ్బులు, రేడియో సెట్లను ఏర్పాటు చేసి ప్రజావినోదం కోసం వసతి కల్పించడం. పార్కులు, గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ. వికలాంగులు, రోగులు, అనాథలకు సహాయం చేయడం. నర్సరీలు, ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు. వ్యవసాయదారులకు మంచి విత్తనాలు, నూతన వ్యవసాయ పద్ధతులను అందించడం. సహకార సంఘాలను ప్రోత్సహించడం. గిడ్డంగులు, మార్కెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ.

ప్రసూతి కేంద్రాలను, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పరచి నిర్వహించడం. బజారు కుక్కలను, ఇతర జంతువులను తొలగించడం. ఉత్సవాలను, సంతలను, జాతరలను ఏర్పాటు చేయడం. పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు.

 • గ్రామ సర్పంచ్‌ అధికారాలు…

ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ.
గ్రామ పంచాయతి సమావేశాలకు అధ్యక్షత.
గ్రామ పంచాయతి నిర్ణయాల అమలు.
గ్రామ కార్యనిర్వహణాధికారి/ కార్యదర్శి పని పర్యవేక్షణ.
గ్రామాభివృద్ధి అధికారి నుండి కావలసిన సమాచారం సేకరణ, సభ్యుల అనర్హతను, ఖాళీలను జిల్లా పరిషత్ అధికారులకు తెలియచేయుట.

 • గ్రామ పంచాయతీ సమావేశం-కోరం…

సర్పంచ్ కనీసం నెలకొకసారి అయినా పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. 90 రోజుల లోపల తిరిగి సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. సర్పంచ్ 90 రోజుల లోపల తిరిగి సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోతే పంచాయతీ కార్యదర్శే స్వయంగా సమావేశం ఏర్పాటు చేయొచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల కోరం మొత్తం సభ్యులను 1/3 వంతు సభ్యులుగా నిర్ణయించారు. అయితే కోరం లేకపోయినా సమావేశం నిర్వహించవచ్చు.

గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఇద్దరూ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో కింది సభ్యులు పాల్గొంటారు.

 • గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు…

ఎం.పి.టి.సి. సభ్యులు గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు, మండల పరిషత్తు కో ఆప్టెడ్ సభ్యుడు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీ అభ్యర్థులు వుండరు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏక గ్రీవ ఎన్నికలను ప్రోత్సహించటానికి, ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమానం ఇస్తుంది.

 • గ్రామ ఉప సర్పంచ్‌…

గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలసి ఒకరిని ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను పంచాయతీ సభ్యులు మొదటి సమావేశంలో ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్‌ కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలంటే వార్డు సభ్యులై ఉండాలి. గ్రామ ఉప సర్పంచ్ రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు: ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పిస్తారు.

గ్రామ ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం: ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టరాదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యులలో 2/3వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఉపసర్పంచ్‌ను తొలగిస్తారు.

సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమ యంలో ఓటు హక్కు ఉంటుంది. గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు: సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.

 • గ్రామ పంచాయితీ కార్యదర్శి…

గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా గ్రామంలోని ప్రజల కోసమే రూపొందించబడుతుంది. అయితే గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాలు, పథకాలు ప్రజల దగ్గరకు చేరేందుకు, గ్రామీణ స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండటం అవసరం.

గ్రామపంచాయితీ అధిపతిగా, ప్రజలకు బాధ్యునిగా సర్పంచి ఉండినా, ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు, ఇతర సంబంధిత సమాచారం అందక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో గ్రామ పంచాయితీల పరిపాలనా విధానాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక గ్రామ పంచాయితీ కార్యదర్శి పోస్టును సృష్టించి తేదీ 1.1.2002 నుంచి అమలులోకి తెచ్చింది. (జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001)

 • పంచాయితీ కార్యదర్శి విధులు – బాధ్యతలు…

సెక్షను 31 ప్రకారం సర్పంచ్‌ యొక్క ఆదేశంతోగానీ, లేదా అతడి సూచనతోగానీ కార్యదర్శి, గ్రామపంచాయితీ సమావేశాలను హాజరు పరుస్తూ ఉండాలి. నెలకొక సమావేశం జరిగేటట్లు చూసుకోవాలి. గత సమావేశం జరిగిన నాటి నుంచి తొంబై రోజుల గడువులో సమావేశం ఏర్పాటు చేసేందుకు సర్పంచి ఆమోదం తెలియజేయని పక్షంలో కార్యదర్శి తనంతటతాను మీటింగు ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయితీ మీటింగులకు సాధారణంగా కార్యదర్శి హాజరై, చర్చలలో పాల్గొనవచ్చును.

కానీ అందులో ఓటు చేయటానికీ, తీర్మానం ప్రవేశపెట్టడానికీ అధికారం లేదు. సెక్షను 32 ప్రకారము గ్రామ పంచాయితీ, వాటి కమిటీల తీర్మానాలు అమలుచేయడం కార్యదర్శి బాధ్యత. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్‌ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది.

(సెక్షన్‌ 246)… పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు. సెక్షన్‌ 268 (2) (15), జి.ఒ 72, తేదీ 29.2.2000 ప్రకారం పన్నులు, లైసెన్సులు మరియు అనుమతుల విషయంలో సంబంధించిన వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం రాబట్టే అధికారం ఉంది. అవసరమైనప్పుడు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1908 సూచించిన విధంగా సాక్షులను హాజరుపరచి, పరీక్షించే అధికారం కూడా ఉంది.

సరైన కారణం లేకుండా ఎవరైనా సెక్షన్లు అతిక్రమిస్తే రూ.100 వరకూ జరిమానా విధించవచ్చు. సమన్లు అందుకున్న తరువాత ఏదైనా కారణంచేత హాజరుకాలేకపోతే కనీసం రెండు లేక మూడు రోజుల ముందుగా కార్యదర్శికి, అధికారికి తెలియజేయాలి. నిధులు దుర్వినియోగమైతే సర్పంచితో పాటు కార్యనిర్వహణాధికారి (కార్యదర్శి) కూడా బాధ్యుడు అవుతాడు. (జి.ఒ 53, తేదీ : 4.2.1999)

 • పంచాయితీ కార్యదర్శి ఉద్యోగ విధులు…

జి.ఓ.ఎం.ఎస్‌ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002 ద్వారా పంచాయితీ కార్యదర్శుల కర్తవ్యాలకు సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి.పై ఆదేశాల ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీ పరిధిలోనే నివసించాలి. గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి. కార్యదర్శి ఇంకా ఈ కింద విధులను, బాధ్యతలను నిర్వర్తించాలి.

 • గ్రామ పంచాయితీ పరిపాలనా విధులు…

గ్రామ సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి. గ్రామపంచాయితీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. గ్రామ పంచాయితీ, కమిటీల తీర్మానాలను అమలుచేయాలి. ప్రభుత్వ, పంచాయితీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలి. గ్రామ చావడిలను నిర్వహించాలి. ప్రభుత్వ భూములను, భవనాలను ఇతర ఆస్థులు అన్యాక్రాంతం అయినప్పుడు లేదా ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పైఅధికారులకు తెలియజేయాలి. గ్రామ పంచాయితీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి. పంచాయితీ పన్నులను సక్రమంగా నూటికి నూరుపాళ్లు వసూలు చేయాలి.

 • సాధారణ పరిపాలనా పరమైన విధులు…

ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి. గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి. 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి. వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్థి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్‌ (పహాణీ) జారీ చేయాలి. కుల ధృవీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిపికెట్లు ఇచ్చేసమయంలో ప్రాథమిక రిపోర్టు సమర్పించాలి. ఏదైనా సర్టిఫికెట్టుకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోతే నాన్‌ అవైలబిలిటీ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.

గ్రామంలో పారిశుధ్యాన్ని నిర్వహించాలి. రోజూ విధులు తనిఖీ చేసి, కనుగొన్న లోపాలను సిబ్బందితో సరిచేయించాలి. గ్రామపంచాయితీ తన కర్తవ్యాలను నిర్వహించడంలో పూర్తి సహకారమందించాలి. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలి. ఎపి ట్రాన్స్‌కో గ్రామస్థాయిలో నిర్వహించే కార్యకలాపాలకు సహకరించాలి. అధీకృత ప్రకటన ద్వారా కనీసవేతన చట్టం 1948 ప్రకారం గ్రామపంచాయితీ సెక్రెటరీ ఇన్‌స్పెక్టరు హోదాలో కనీసవేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి.

జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికోసం రెండు రిజిష్టర్లు మెడికల్‌ డిపార్టుమెంట్‌ నుంచి పొంది, నెలవారీ నివేదికలు డి.ఎం.హెచ్‌.ఓ.కు పంపాలి. సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి. లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ మరియు వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.

 • గ్రామ రెవిన్యూ అధికారి….

పూర్వం ఆంధ్రప్రాంతంలో కరణం మునసబు మరియు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. 1985 లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి (వి.ఏ.వో ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. పంచాయితీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.

వీరు తహసీల్దారు (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు. అధికారుల కేటాయింపు మరియు నియమించు విధానము: 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,123 గ్రామాలు న్నాయి. అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు. . కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21,809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి.

పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వోలు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.

గ్రామ రెవెన్యూ అధికారి విధులు: గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ (గ్రామ పరిపాలన)శాఖ 31.7.2007లో పేర్కొన్నారు. దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు, సామాజిక సంక్షేమం అభివృద్ధి వున్నాయి. సాధారణ పరిపాలన, రెవిన్యూ విధులు, గ్రామ లెక్కలు నిర్వహించడం.

 • గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు…

పంచాయతీలకు గ్రామపరిధిలో చేపట్టదలచిన అభివృద్ధికి అవి రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు అవుతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గ్రామాల్లో ఆయా పాలక వర్గాలు ప్రతిపాదించిన పనులకు పంచాయతీల ఖాతాలకే నేరుగా నిధులు లక్షల్లో చేరుతాయి. పాలక వర్గాల అభీష్టం మేరకు నిధులు మంజూరు అవుతాయి.

ఒక్కో గ్రామ పంచాయతీకి 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు పంచాయతీ ఖాతాలకు చేరతాయి. రాష్ట్రంలోని 21 వేల పంచాయతీలకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. గ్రామసభ అభీష్టం మేరకు లింకు రోడ్లు, పక్కా డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించుకోవచ్చు. 12వ ఆర్థిక సంఘం నిధులు మినహా ప్రభుత్వం నుంచి పంచాయతీలకు మరే ఇతర గ్రాంట్లు అందలేదు.

ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదార్లు, డ్రెయిన్ల పనులు నిలిచిపోయాయి.గతంలో మార్కెటింగ్ నిధులతో రహదారులు నిర్మించినప్పటికీ గడిచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకరించలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ సామగ్రి తదితర అవసరాలు తీరుతున్నాయి. ఈ దశలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను నేరుగా పంచాయతీలకు అందివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

 • మండల పరిషత్…

పంచాయతీరాజ్ వ్యవస్థలో మాధ్యమిక వ్యవస్థ మండల పరిషత్
ఒక మండలాన్ని ఎంపీటీసీలుగా విభజిస్తారు.
ఎం.పీ.టీ.సీ – మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం
3000 – 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తారు.
మండల పరిషత్‌లో కనిష్ఠ ఎంపీటీసీల సంఖ్య 7, గరిష్ఠ ఎంపీటీసీల సంఖ్య 23.
ఎంపీటీసీలు పార్టీ ప్రాతిపదికపై ఎన్నికవుతారు.
సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై ఎన్నికవుతారు. ఎంపీటీసీలుగా పోటీచేయడానికి ఆ మండల పరిధిలో ఓటరై ఉండాలి.
సాధారణ అభ్యర్థులు రూ. 2500, ఎస్సీ, ఎస్టీలు రూ. 1250 డిపాజిట్‌గా చెల్లించాలి.
ఎంపీటీసీగా పోటీచేసే అభ్యర్థి వ్యయపరిమితి రూ. లక్ష.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో గెలుపొందినవారు ప్రమాణం చేస్తారు.
ఎంపీడీవో సమక్షంలో ఎంపీపీ ప్రమాణం చేస్తారు.
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో జనాభా ప్రాతిపదికపై నిర్ణయిస్తారు.
మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. వీరిని ఎన్నుకునేటప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటుహక్కు ఉండదు.
వైస్ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు వర్తించవు.
పరిషత్ సమావేశాలకు చైర్మన్ అధ్యక్షుడు. చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ అధ్యక్షుడు.
ప్రతి 30 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. సమావేశాల నిర్వహణకు కోరం సభ్యులు 1/3వ వంతు అవసరం. కోరం సభ్యుల కోరిక మేరకు ప్రత్యేకంగా సమావేశం కావచ్చు.
చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు నిరాకరిస్తే జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఆదేశానుసారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలి.
ఈ సమావేశాల్లో చేసే తీర్మానాలకు చట్టబద్ధత ఉంటుంది. మండల పరిషత్‌కు ఒక మైనార్టీ సభ్యుడిని కో ఆప్ట్ చేసుకునే అధికారముంది.
మండల పరిషత్ సమావేశాలకు మండలంలోని సర్పంచ్‌లు, కలెక్టర్ శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావచ్చు.
ఎమ్మెల్యే, లోక్‌సభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు.
ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు.
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కేవలం ఎంపీటీసీలు మాత్రమే పాల్గొంటారు. మిగతావారికి అవకాశం లేదు. ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చ జరిగేటప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను సమావేశాలకు హాజరుకావాలని ఎంపీపీ కోరవచ్చు.
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక బహిరంగ ఓటు విధానం ద్వారా అంటే చేతులెత్తడం ద్వారా జరుగుతుంది.
ఎన్నికలో బలాబలాలు సమానమైతే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
ఎంపీపీల గౌరవ వేతనం తెలంగాణలో రూ. 10,000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,000
ఎంపీటీసీల గౌరవ వేతనం తెలంగాణలో రూ. 5000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3,000
సమావేశాల సందర్భంగా, ఇతర విధుల్ని నిర్వర్తించేటప్పుడు టీఏ, డీఏలు అదనం
ఎంపీపీ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. మండల విద్యా కమిటీకి ఎంపీపీ అధ్యక్షత వహిస్తారు. పరిషత్ సమావేశాల్లో నియమనిబంధనలను ధిక్కరించిన సభ్యులపై ఎంపీపీ చర్య తీసుకోవచ్చు (4 నెలలు సస్పెండ్ చేయవచ్చు).
చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. వారి పదవీకాలంలో ఒకసారి మాత్రమే ఈ తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
మండల పరిషత్‌లో విప్ వర్తిస్తుంది.
పార్టీ గుర్తుపై ఎన్నికయినందున ఒక పార్టీ తరఫున గెలుపొందినవారు ఆ పార్టీ జారీచేసే విప్‌నకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 2/3వ వంతు సభ్యుల సంతకాలతో ఆర్డీవోకు నోటీసును అందజేయాలి.
నెలరోజుల్లోగా ఆర్డీవో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది సమావేశానికి హాజరుకావాలి.
సాధారణ మెజార్టీతో చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించవచ్చు. వరుసగా 3 సమావేశాలు కోరం లేకుండా వాయిదా వేసినట్లయితే ఆ తీర్మానం వీగిపోయినట్టే.
మండల పరిషత్‌కు పన్నులు విధించే అధికారం లేదు.
జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను వినియోగిస్తుంది. అభివృద్ధిలో ఒక యూనిట్‌గా గ్రామాల మధ్య సమన్వయానికి కృషిచేస్తుంది.

 • అసలు గ్రామ పంచాయితీలో ఎవరెవరు ఉంటారో తెలుసా?

గ్రామ పంచాయతీ అంటే? ఏముంటుందిలే అనుకునే వారే ఎక్కువ. చివరికి సర్పంచ్ పదవికి పోటీచేసి ఏళ్ల తరబడి పదవులు వెలగబెట్టిన వారికీ అసలు తమ పంచాయతీలో ఎవరెవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి. దీనిపై కొంత అవగాహనకు ఈ దిగువన పేర్కొన్న వివరాలను గమనించవచ్చు…

 • సర్పంచ్ 1

 • ఉప సర్పంచ్ 1

 • వార్డ్ సభ్యులు 12

 • యం.పి.టి.సి 1

 • కారోబర్ 1

 • కార్యదర్శి 1

 • వి.ఆర్.ఓ 1

 • వి.ఆర్.ఏ 1

 • ఏ.ఎన్.యం 1

 • టీచర్లు 8

 • షకిదర్ (నీటిపారుదల) 1

 • లైన్ మెన్ 1 హెల్పర్ 1

 • వి.సి.ఒ (సాక్షరభారతి) 2

 • వెటర్నిటీ అసిస్టెంట్ 1

 • విలేజ్ పోలీస్ ఆపిసర్ 1

 • ఫీల్డ్ అసిస్టెంట్ 1

 • ఏఈవో అసిస్టెంట్(అగ్రి)1

 • ఆర్టికల్చర్ (నర్సరీ) 1

 • సుంకరులు(సపాయి) 2

 • ఐకేపీ అధ్యక్షులు 2

 • ఆశా వర్కర్స్ 2

 • ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) 2

 • అంగన్వాడీ టీచర్స్ 2

 • వాటర్ మెన్ 1

 • రేషన్ షాప్ డీలర్ 2

 • విద్యావాలంటీర్స్ 1

 • మధ్యాన భోజనం 2

 • అంగనీవాడి ఆయాలు 2

వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయంలో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎన్ని గ్రామలల్లో జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామంలో ఎంత మంది వద్ద వున్నవి? ఏ సమయంలో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని సంప్రదించాలి? ఏ పనికి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచాయితీలో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్‌లు ఉన్నాయా? ఇకపొతే దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు అని అంటారు.

కానీ ఇన్ని శాఖలు (ఇంకా ఉన్నాయి కావచ్చు) ఎన్ని కొమ్మలు (శాఖలు) ప్రతి రోజు పని చేస్తున్నాయి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఎంత మందికి అందుబాటులో ఉంటున్నారు? చదివి ఆశ్చర్యపోవడం కాదు, ‘షేర్’ చేస్తే ఇంకొందరు ఆశ్చర్యపోతారు.

159 COMMENTS

 1. I simply want to mention I’m all new to blogs and definitely loved this web site. Most likely I’m want to bookmark your blog . You actually come with fantastic well written articles. Thanks a bunch for revealing your blog site.

 2. I simply could not leave your site prior to suggesting that I extremely enjoyed the standard information a person supply to your visitors? Is going to be back incessantly to inspect new posts

 3. You really make it seem really easy with your presentation but I in finding this topic to be actually something that I believe I would never understand.

  It sort of feels too complex and very large for me. I am looking forward
  to your subsequent put up, I will try to get the grasp of it!

 4. Undeniably believe that which you stated. Your favorite justification appeared to be on the net the easiest thing to be aware of.
  I say to you, I certainly get annoyed while people
  think about worries that they just do not know about.
  You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having
  side-effects , people could take a signal. Will likely be back to get more.
  Thanks

 5. Do you mind if I quote a few of your articles as long as I provide credit
  and sources back to your website? My blog is in the exact same area of interest as
  yours and my users would genuinely benefit from a lot of the
  information you present here. Please let me know if this alright with you.
  Thank you!

 6. Supporting the weblog.. thanks alot Is not it superb whenever you uncover a good publish? Loving the publish.. cheers Adoring the weblog.. pleased

 7. Very nice article and straight to the point. I don at know if this is actually the best place to ask but do you folks have any thoughts on where to employ some professional writers? Thanks

 8. Right now it appears like WordPress is the best blogging platform available right now. (from what I ave read) Is that what you are using on your blog?

 9. Im no expert, but I feel you just made the best point. You obviously understand what youre talking about, and I can really get behind that. Thanks for staying so upfront and so genuine.

 10. This is really interesting, You are a very skilled blogger. I ave joined your feed and look forward to seeking more of your magnificent post. Also, I have shared your website in my social networks!

 11. My brother recommended I might like this web site. He was totally right. This post actually made my day. You can not imagine simply how much time I had spent for this information! Thanks!

 12. Usually I do not read article on blogs, but I wish to say that this write-up very forced me to check out and do it! Your writing taste has been amazed me. Thanks, quite great article.

 13. I just want to say I’m beginner to blogs and absolutely enjoyed this web blog. Most likely I’m likely to bookmark your site . You certainly have outstanding article content. Thanks a lot for sharing with us your blog.

 14. Sweet blog! I found it while surfing around on Yahoo News. Do you have any suggestions on how to get listed in Yahoo News? I’ve been trying for a while but I never seem to get there! Many thanks

 15. Magnificent beat ! I would like to apprentice while you amend your site, how could i subscribe for a blog web site? The account aided me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast offered bright clear idea

 16. magnificent issues altogether, you just received a logo new reader. What could you recommend about your submit that you just made a few days in the past? Any certain?

 17. One other issue is that if you are in a situation where you don’t have a cosigner then you may genuinely wish to try to wear out all of your federal funding options. You’ll find many grants or loans and other scholarships or grants that will offer you finances to assist with school expenses. Thanks a lot for the post.

 18. You could certainly see your enthusiasm in the work you write. The world hopes for more passionate writers like you who are not afraid to say how they believe. Always go after your heart.

 19. Can I simply say what a reduction to search out someone who truly is aware of what theyre talking about on the internet. You definitely know the way to convey a difficulty to light and make it important. Extra folks have to read this and understand this side of the story. I cant consider youre no more fashionable since you undoubtedly have the gift.

 20. Thanks for the sensible critique. Me & my neighbor were just preparing to do a little research on this. We got a grab a book from our area library but I think I learned more clear from this post. I’m very glad to see such wonderful info being shared freely out there.

 21. We are a group of volunteers and starting a new scheme in our community. Your site provided us with valuable information to paintings on. You have performed a formidable process and our entire neighborhood will likely be thankful to you.

 22. What i do not realize is if truth be told how you’re not actually a lot more smartly-liked than you might be right now. You are very intelligent. You already know thus considerably when it comes to this topic, produced me personally believe it from numerous various angles. Its like men and women don’t seem to be fascinated until it¡¦s something to accomplish with Woman gaga! Your individual stuffs excellent. All the time care for it up!

 23. Wonderful beat ! I would like to apprentice while you amend your website, how can i subscribe for a blog web site? The account aided me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear idea

 24. hello!,I like your writing so much! share we communicate more about your post on AOL? I need a specialist on this area to solve my problem. Maybe that’s you! Looking forward to see you.

 25. I like what you guys are up also. Such intelligent work and reporting! Carry on the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it’ll improve the value of my site :).

 26. Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve truly enjoyed surfing around your blog posts. In any case I will be subscribing to your feed and I hope you write again soon!

 27. Thanks for any other informative web site. Where else may I get that kind of info written in such an ideal approach? I have a challenge that I’m just now running on, and I have been on the look out for such information.

 28. It’s in reality a great and helpful piece of information. I am happy that you simply shared this useful information with us. Please keep us up to date like this. Thank you for sharing.

 29. Very efficiently written information. It will be valuable to everyone who usess it, as well as yours truly :). Keep up the good work – can’r wait to read more posts.

 30. Attractive element of content. I simply stumbled upon your website and in accession capital to assert that I get actually loved account your weblog posts. Any way I will be subscribing for your augment or even I achievement you access consistently fast.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here