అమరావతి, ఆగస్టు 16 (న్యూస్‌టైమ్): అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను నిరుద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యవస్థ ప్రభుత్వం ప్రజలకు అంటగడుతున్న తెల్ల ఏనుగు లాంటిదని విమర్శిస్తున్నారు.

ప్రజల సొమ్ముని స్వాహా చెయ్యడం తప్ప ఆ వ్యవస్థ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి తన పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదీ సామాన్య ప్రజల అభిప్రాయంగా ప్రతిపక్షాలు సైతం ప్రచారం చేస్తున్నాయి.