రాజమహేంద్రవరం, ఆగస్టు 21 (న్యూస్‌టైమ్): గోదావరికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉందట. ఈ మేరకు ఆర్టీజీఎస్ ముందస్తుగా హెచ్చరికలు జారీచేసింది. ఈనెల 22వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు చెబుతున్నారు. దీంతో గోదావరి నదికి భారీగా వరదలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. గోదావరి నదికి మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరించింది. ఈరోజు నుండి మూడు రోజుల పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ పేర్కొంది. ఈనెల 22వ తేదీ వరక భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు చెబుతున్నారు. దీంతో గోదావరి నదికి భారీగా వరదలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ముంపు ప్రాంతల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.