ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయ చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశం.

వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం, సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ, జాతి, రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ఈ వ్యవసాయం చేయుటకు రైతులు వివిధ విధానాలను ప్రాంతాలవారీగా అనుసరిస్తారు. గతంలో అనగా సుమారు యాభై సంవత్సరాల క్రితం రాయల సీమ ప్రాంత పల్లె ప్రజలు అనగా రైతులు వారి వ్వవసాయ నీటి అవసరాలకు కాలువలు, చెరువులు, బావులు, కసిం కాలువలు, బోరు బావులు, కుంటలు, వాగులు, వంకలు, వంటి జల వనరులపై ఆధార పడేవారు.

రైతులు కొన్ని ప్రాంతాలలో నీటి వసతి కొరకు చెరువులు, బావులు పైనే ఆధార పడి వుండే వారు. వర్షాకాలంలో చెరువులు నిండితే ఆరు నెలల వరకు నీళ్లు వుండేవి. చిన్న చిన్న వంకలు వాగులు వున్నాయి. ఆ రోజుల్లో వాటిల్లో సన్నగానైనా ఎల్లప్పుడు నీరు పారు తుండేవి. దాంతో భూగర్బ జలం పుష్కలంగా వుండి బావుల్లో నీళ్లు పైకే వుండేవి. ఆ వంకల్లో సాగె నీటిని నిలగట్టి చిన్న కాలువ ద్వార పంటలకు మల్లించే వారు. లేదా ఏతం గూడ వంటి సాధనాల ద్వారా నీటిని పొలాలకు మళ్లించి పంటలు వండించె వారు. బావుల నుండి కపిలి అనే సాధనం ద్వారా ఎద్దులతో నీటిని పైకి తోడి పంట పొలాలకు పెట్టే వారు. ఆ తర్వాత బావులకు కరెంటు మోటార్లు వచ్చాయి. దాంతో రైతుల పని కొంత సులువైంది. బావులు సాధారణంగా గుండ్రంగా గాని, నలు చదరంగా గాని వుంటాయి.

చుట్టు రాతి కట్టడం వుండి లోనికి దిగడానికి రాతి బండలతో చేసిన మెట్లుంటాయి. వీటి లోతు సుమారు ఐదు లేక ఆరు మట్లు వుంటుంది. ఒక మట్టు అంటే ఐదు అడుగులు. మహా లోతైన బావి అంటే ఏడు మట్లు బావి. ఆరోజుల్లో ఈ బావుల్లో నీళ్లు పైకే వుండేవి, అనగా పది అడుగుల లోతులో వుండేవి. పిల్లలందరు ఎండా కాలం బావుల్లో ఈత కొట్టే వారు. కొత్తవారు ఈత నేర్చు కునే వారు. ఈ బావుల్లో నుండి కపిలి / మోటతో నీళ్లను బయటకు తోడి పంటలు పండించె వారు. ప్రస్తుతం ఇటు వంటి బావులు వర్షం లేక అడుగంటి పోయాయి. వర్షాబావంతో మామూలు బావుల్లో నీరు అడుగంటి పోగా విధిలేక రైతు లందరు బోరింగు బావులు త్రవ్వించారు. అవి వంద లాది అడుగుల లోతులో నుండి మోటార్ల సాయంతో నీటిని తోడు గలవు. భూగర్బ జలాన్ని ఈ బోరు బావులు వందలాది అడుగుల లోతునుండి తోడేస్తున్నందున లోతు తక్కువ గల దిగుడు బావులన్ని ఎండి పోయాయి. ఆ ఎండి పోయిన బావుల్లోనె బోరులు వేసి యంత్రాలతో నీటిని పైకి లాగు తున్నారు. ప్రస్తుతం అందారూ ఈ బోరు బావులపైనే ఆధార పడి కొంత వరకు పంటలు పండించు కుంటున్నారు. ఒకప్పుడు ఈ దిగుడు బావులన్ని కపిలి బావులే.

గతంలో ఈ బావులనుండి కపిలి/మోటతో నీళ్లను తోడి పంటలకు పండించేవారు. ఆ బావులకు కపిలి వుండేదనడానికి నిదర్శనంగా ఆ బావులకు ఉన్న కపిలి దొరువులను ప్రక్కనున్న చిత్రంలో చూడ వచ్చు. అప్పట్లో మహా అయితే ముప్పై నలమై అడుగుల లోతు నుండి కపిలితో నీరు తోడే వారు. ఆ బావులు అడుగంటగ ఆ దిగుడు బావులలోనె వందలాది అడుగుల లోతున బోరులు వేసి నీటిని తోడె వారు. కొంత కాలం తర్వాత ఆబోరు బావులలో కూడ నీరు అతి తక్కువగా వస్తున్నందున, అంత సన్నగా వచ్చే నీరు పొలానికి పెట్టితే ఒక బారెడు దూరంకూడ పారవు. అందు చేత ఆ బోరుబావిలో నుండి సన్నగా వచ్చే నీటి దారను ఒడిసి పట్టి ఆ దిగుడు బావిలోనె నిల్వ చేసి సుమారు అయిదారు అడుగులు లోతు నీరు వచ్చాక ఆనీటిని మరిక మోటారుతో బయటకు తోడి కొంత కాలం పంటలు పండించారు.

భూగర్బంలోని నీరు బోరు ద్వార పైకి అనగా దిగుడుబావి అడుకుకి వస్తుంది. అక్కడ కొంత మేర నిల్వ చేసుకొని మరొక మోటారుతో ఆ నీటిని పైకి తోడె వారు. ప్రక్కనున్న చిత్రంలో ఈ తతంగ మంతా చిత్రంగా చూడండి. ప్రస్తుతం అలాంటివి కొన్ని పని చేయడం లేదు. ఈ ప్రాంతంలో ఈ తరం వారికి బావుల్లో ఈత కొట్టడం, చెరువుల్లో గేలాలతో, కొడం తో చేపలు పట్టడం, వంకల్లో, వాగుల్లొ చేపలు పట్టడం మొదలగు ఆటలన్ని పూర్తిగా అందు బాటులో లేవు. అవన్నీ కనుమరుగయ్యాయి. చిన్న చిన్న కసింకాలువలు చెరువు కట్ట క్రింద ప్రారంబమై సుమారు ఒక మైలు పొడవునా వుంటాయి. అటు ఇటు పొలాల్లో ని మురుగు నీరు ఈ కాలవలోకి ప్రవహిస్తుంది. అందు చేత అంద్లో నీళ్లు పారు తుంటుంది. చెరువులో నీరు అయిపోయినా ఈ కసింకాలవలో నీరు ఉంటుంది. ఆ నీటిని ఏతం, గూడ, ద్వార పైకి తోడి పొలాలకు పారిస్తుంటారు రైతులు.

ఇదొక నీటి వనరు. కాని ప్రస్తుతం సంవత్సరాల తరబడి చెరువులు నిండక పోవడంతో ఈ కసిం కాలువలు కూడ ఎండి పోయాయి. ఇంకొన్ని కసింకాలువలు అరుదుగా వుంటాయి. అవి ఏ కొండ వాలులోనో ప్రారంబమై కొన్ని మైళ్ల పర్వంతం వుంటాయి. ఇందులోని నీరు కూడ పంటలకు వాడుకుంటారు. ఈ కసింకాలావల్లో నీరు ప్రవహించదు కాని నీరు నిల్వ వుంటుంది. ఎంత తోడినా తిరిగి వూరు తుంది. అంచేత దానికిరుపక్కాలా బావుల్లో నీరు సంవృద్దిగా వుంటుది. ఈ కరువు కాలంలో అవి కూడ ఎండి పోయాయి. పశువుల మేతకు కూడ ఈ కసిం కాలవలు చాల ఉపయోగ పడేవి. ఎలాగంటే ఇందులో నీరు ఎల్లప్పుడ్లు వున్నందున అందులో జమ్ము, గడ్డి ఏపుగా పెరిగి వుండేది.

దాని గట్టు మీద కూడ గరిక బాగ వుండేది. ఆవులు గట్టున మేస్తె బర్రెలు నీళ్లలో దిగి జమ్ము, తుంగ వంటి గడ్డిని బాగా మేసేవి. చిన్న చిన్న చేపలు, పీతలు మొదలగు వాటిని పట్టే వారికి కూడ ఇవి ఉపయోగ పడేవి. ఇలాంటి కసింకాలువలు ఎండి పోయాయి. ఆవులు, ఎద్దులు, పందులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ప్రతి రైతు పశువులను పెంచడం అవసరం. వాటి వల్ల అదనపు ఆదాయమే గాకుండా వాటి వలన పొలాలకు ఎరువు కూడ లబ్యమౌతుంది. పైగా ఎద్దులు పొలంపనులకు అత్యవసరం. ఎద్దుల ను రైతు తన బిడ్డల్లాగ చూసు కుంటాడు. వాటికి సరైన మేత పెట్టి, స్నానం చేయించి, రక రకాల ఆబరణాలతో అలంక రించి ఆనందిస్తాడు. ఈ పశువుల కొరకే ఒక ముఖ్యమైన పండగ కూడ వున్నది.

దీన్ని బట్టి రైతుకు పశువుల పట్ల తనకున్న అబిమానం తెలుస్తుంది. ఎద్దులకు వేసె అలంకరణ, ఆబరణాలు మూతికి మూజంబరం అని నార దారాలతో గాని వెంట్రుకల దారల తో గాని చేసి అలంకరిస్తారు. ఆ దారాల మధ్యలో గవ్వలు అమర్చుతారు. ఎద్దుల మూతికి ఇవి ఎంతో అందంగా వుంటుంది. ఎద్దుల కొమ్ములను పదునైన కత్తితో నునుపుగా చెక్కి వాటికి రంగులు వేసి, కొమ్ముల చివరన ఇత్తడి, స్టీలు కుప్పెలు వేస్తారు. ఎద్దుల మెడలకు వెడల్పాటి తోలు బెల్టు కట్టి దానికి అక్కడక్కడా గజ్జెలు, మువ్వలు కట్టి, చివరన గంట వేలాడ గడ్తారు. ఎద్దులు నడుస్తుంటె ఆ గజ్జెల, మువ్వల చప్పుడు విన సొంపుగా వుంటుంది. ఆ గజ్జెల, గంటల శబ్దాన్ని బట్టి తమ ఎద్దులు ఎక్కడున్నాయో రైతులు గుర్తు పట్ట గలరు. ఎద్దుల అలంకరణకు కావలసిన సామగ్రి ఆరోజుల్లో సంతల్లో అమ్మేవారు.

ఇప్పుడు ఎద్దులు లేవు, వాటికి అలంకరించె ఆభరణాలు లేవు. పశువుల పండగ సందర్భంగా ఇటువంటి అలంకరణ మారుస్తుంటారు. సంక్రాంతి వరుస పండగల్లో పశువుల పండుగ మూడోది. ఆ రోజున ఇంటి కొక్కరు చొప్పన పల్లె వాసులు తెల్లవారక ముందే ఒక కత్తి, సంచి తీసుకొని పక్కనె వున్న అడవికి బయలు దేరుతారు. అనేక రకాల వన మూలికలు, ఆకులు, కాయలు, చెట్టు బెరడు, గడ్డలు, పువ్వులు, వేర్లు, మొదలగు నవి తీసుకొని వస్తారు. కొన్ని తప్పనిసరిగా వుండవలసిన మూలికలు కొన్ని వున్నాయి అవి తీసుకొని మిగతా ఎన్ని రకాల మూలికలు ఎన్ని వీలైతె అన్ని తీసుకొని వస్తారు. ఇంటికి వచ్చి, వాటినన్నింటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఆ తర్వాత రోట్లో వేసి బాగ దంచి పొడి లాగ చేస్తారు. చివరిలో అందులో ఎక్కువ మోతాదులో వుప్పు వేసి ఇంకా బాగ దంచు తారు.

దాన్ని ”ఉప్పుచెక్క” అంటారు. ఇది పశువులకు సర్వ రోగ నివారిణి. పశువులను/ ఎద్దులను దగ్గర్లోని చెరువుకు గాని, బావి వద్దకు గాని తీసుకెళ్లి స్నానం చేయించి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు చెక్కను తినిపిస్తారు. పశువులు ఉప్పు చెక్కను ఇష్టంగా తినవు. కాని బలవంతంగా తినిపిస్తారు కొన్ని సన్న జీవాలు అనగా గొర్రెలు, మేకలు ఉప్పు చెక్కను ఇష్టంగా తింటాయి. అనేక రకాల వనమూలికల తో తయారైన ఈ ఉప్పుచెక్క అత్యంత మధురమైన వాసన వస్తుంది. ఈ వుప్పు చెక్క తయారికి కావలసిన కొన్ని వనమూలికలు: మద్ది చెక్క (బెరడు) నేరేడు చెక్క, మామిడి చెక్క, కరక్కాయ, నల్లేరు, అడవి గుమ్మడి, అడవి ఉల్లి, మన్నేరు గడ్డ, ఎలక్కాయ, ఉసిరి కాయ, చలువ వేర్లు, అలా ఈ జాబితా చాల పెద్దది.

అన్నీ తేవాలని లేదు గాని వీలైనన్ని ఎక్కవ సేకరించాలు. అందులో కొన్ని తప్పని సరైనవి కొన్ని వుంటాయి. ఈ ఆచారం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోను ఆ పరిసర ప్రాంతాలైన తమిళనాడు లోను ఎక్కువ. ఆ రోజుల్లొ వున్నవన్ని దేశీయ ఆవులే/ గేదెలె. రెండు మూడు లీటర్ల పాలిస్తే అదే పెద్ద గొప్ప. పెద్ద ఇళ్లలొ అలాంటి ఆవులు ఒక మంద వుండేవి. మిగతా వారి వద్ద ఒకటి రెండు ఆవులు/ గేదెలు వుండేవి. ఆరోజుల్లో పాలు ఎవ్వరు అమ్మేవారు కాదు. అంతా ఇంటి కొరకె. పాలు లేని వారికి వీరు మజ్జిగ ఇచ్చేవారు. ఈ ఆవులకు ప్రత్యేకించి మేత ఏమి వేసే వారు కాది. బయటకు తీసుకెళ్లి పొలాలలో, మైదానాలలొ మేపించి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చేవారు. వాటికి అదే మేత. పాలిచ్చే ఆవులకు/గేదెలకు మాత్రం రాత్రులందు కొంత మేత వేసె వారు. వరి పొలాల్లోని గట్టుల మీద, చెరకు తోటల్లోను దొరికే పచ్చి మేత వేసె వారు. పాలనుండి నెయ్యి తీసి తాము వాడుకోగా మిగాతాది అమ్ముకునె వారు.

ఇదొక అధనపు ఆదాయం. మేకలు, గొర్రెలు మాత్రం మందలు, మందలుగా వుండేవి. వీటిని పాలు పిండడం చాల తక్కువ. దేశ వాలీ రకాలైన ఆవులు, ఎద్దులు ఇప్పుడు లేవు. ఎక్కడో అరుదుగా ఎద్దులు, ఎద్దులు బండి, మడక కనబడతాయి. ఈ పనులన్ని ట్రాక్టర్లు చేస్తున్నాయి. కాని ఇప్పుడు ఇంచు మించు ప్రతి ఇంట్లోను ఒక పాడి ఆవు వున్నది. అది ఖచ్చితంగా జర్సీ ఆవు లేదా మంచి జాతి ఆవు వున్నది. వీటికి ప్రతి రోజు మంచి ఆహారం పెట్టాలి, ప్రతి రోజు స్నానం చేయించాలి చాల జాగ్రత్తగా చూసుకోవాలు. వాటి పరిసరాలు శుబ్రంగా వుంఛాలి. ఇవి పూటకు ఐదారు లీటర్ల పాలిస్తాయి. ఇలా రెండు పూటలా ఇస్తాయి. ప్రస్తుతం రైతుల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడుతున్నాయంటే ఈ ఆవుల చలువే. దానికి తగ్గట్టు చిన్న పల్లేల్లో కూడ పాల డిపోలు వెలిశాయి. రెండు పూటలా వారు పాలు కొంటారు.

వాటిని శీతలీకరించి పట్నాలకు పంపుతున్నారు. వర్షాబావంతో గుక్క తిప్పుకో లేక తిక మక పడుతున్న రైతుకు ఈ జర్సీ ఆవులు, పాల డిపోలు కొండంత అండ. ప్రస్తుతం పట్నాలలో సంవృద్దిగా చిక్కని పాలు కావలిసినన్ని దొరుకు తున్నాయంటే అదంటా పల్లె టూరి రైతుల చలువే. గతంలో పట్న వాసులు పాలకు ఎంత కట కట పడ్డారొ అందరికి తెలిసిన విషయమె. పసి పిల్లలకు అరుదుగా దొరికే నీళ్ల పాలు కూడ దొరక చాల అవస్తలు పడ్డారు. దానికి నివారణగా అప్పట్లో పాల పొడి డబ్బాలు కూడ దిగుమతి అయ్యాయి. ప్రభుత్యంకూడ పాల వెల్లువ పథకానికి తగినంత చేయూత నందిస్తున్నది. దాన్ని అంది పుచ్చుకున్న పల్లెటూరి రైతు కొంతలో కొంత సుఖంగా జీవనం సాగించుకుంటూ పోతున్న పరువును కొంతలో కొంతైనా నిలబెట్టు కుంటున్నాడు. గొర్రెలు, మేకలు. చాల మంది రైతులకు గొర్రెలు, మేకలు మందలు వుండేవి.

వాటిని తమ ఇంటి ముందున్న దొడ్లల్లో వుంచేవారు. వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టే వారు కాదు. రతి రోజు వాటిని దగ్గరున్న అడవికి తీసుకెళ్లి మేపుకొని వచ్చేవారు. పొట్టేళ్లను మాత్రామె మాంసానికి అమ్మేవారు, కొనేవారు. గొర్రెలను మాంసానికి అమ్మే వారు కాదు.గొర్రెలు ఇతరుల కంటికి ఒకే లాగ కనిపిస్తాయి. వాటి కాపరికి మాత్రం కొన్ని గొర్రెలను గుర్తు పట్టగలడు. కాని వాటి పిల్లలు తమ తల్లులను ఖచ్చితంగా గుర్తు పట్ట గలవు. దీనికి రుజువేమంటే సాయంకాలం వెళ గొర్రెల మంద ఇంటి కొచ్చే వేళ తల్లి గొర్రెలు తమ పిల్లల కొరకు ఊరి బయటనుండే పిల్లలను పిలుస్తూ అంత వరకు మందలో ఒకటిగా వస్తున్న గొర్రెలు ఊరు దగ్గర పడగానె మందను వదిలి తమ పిల్లలను పిలుస్తూ ముందుకు పరుగెడుతాయి తమ పిల్లల కొరకు.

అప్పటికే గిడుగు నుండి బయటకు వచ్చిన పిల్లలు తమ తల్లుల గొంతు విని పిల్లలు కూడా అరుస్తూ అనగా తమ తల్లులను పిలుస్తూ బయటకు పరుగెడతాయి. అలా పరుగెత్తిన పిల్లలు ఊరి బయట గాని, వీదిలో గాని, అవి ఇంకా దొడ్లోకి రాక ముందే తమ తల్లులను గుర్తించి వాటిని పట్టుకొని పాలు తాగుతాయి. ఇలా అవి తమ తల్లులను ఖచ్చితంగా గుర్తు పడతాయి. ఒక వేళ పిల్లలు తెలియక తమ తల్లి గాక ఇంకొక గొర్రె వద్దకు పాలు తాగ డానికి వెళ్లితె ఆ తల్లి గొర్రె తప్పించు కుంటుంది. ఆ పిల్ల తన తప్పు ను గ్రహించి తన తల్లి గొర్రె వద్దకు వెళ్లీ పాలు తాగు తుంది. ఈ తతంగ మంతా చూడ డానికి చాల అత్మీయంగా వుంటుంది. మేకలు ఆవులు కూడ ఇంతే. ఇది ప్రకృతి నియమం. మానవుల్లోను ఈ ప్రకృతి నియమం తప్పదు. నిద్ర పోతున్న పిల్లకు వేరొక తల్లి పాలివ్వడానికి ప్రయత్నిస్తే ఆ పశికందు సరిగా స్పందించదు.

ఇంకా ఏ మాత్రం ఎదగని ఆ పిల్ల పాలిస్తున్నది తన తల్లి కాదని ఎలా గుర్తించ గలదు. అదీ ముఖం చూడ కుండానే? దీనికి కారణం ఏమిటి? శాస్త్ర వేత్తలు కారణాలెన్నైనా చెప్పొచ్చు. అసలు కారణం ఒకటే…. అది ప్రకృతి నియమం. దానికి కారణాలు. అడవికి మేతకొరకు తోలు కెళ్లిన గొర్రెల/ మేకలకు రేసు కుక్కల భయం ఒకటి వెంటాడు తుంటుంది. ఇవి అడవి జంతువులు. కాపరుల కళ్ల ముందే వారు చూస్తుండగానె మందల మీద పడి బతికుండ గానె అతి వేగంగా గొర్రెను గాని మేకను గాని పట్టి తినేస్తాయి. ఆ తర్వాత తాపీగా వెళ్లి పోతాయి. ఇవి మనుషులకు ఏ హాని చేయవు. మనుషులు కూడ వీటికి ఎలాంటి హాని చేయరు. ఇవి దేవతా కుక్కలని అంటారు. ఇవి గుంపులు, గుంపులు గా తిరుగు తుంటాయి.

ఇవి స్థిరంగా ఒక చోట వుండవు. అప్పుడప్పుడు వస్తుంటాయి పొట్టేలు, ఆవు. బాన, బండి (కపిలి బండి) కదురుగోలు, ఇరుసు, ఎద్దుల బండి, కాడి మాను, మడక, లేదా నాగలి, గొర్రు, పార , తొలిక, కర్రు, గునపము, గొడ్డలి, కొడవలి, కత్తి, పిక్కాసు, మాను, పల్లంకి, మోకు, పగ్గం, తొండం తాడు, పలుపు, జాటి, ముల్లు గర్ర, పలుపులు, చిలుకు దోటి, కొంకి, గోరు గిల్లు, గీస కత్తి, చిక్కం, మచ్చు గత్తి, గొర, దోకుడు పార, మొదలగునవి వ్యవసాయమ్లో ఉపయోగించు పరికరాలు… వీటిల్లో ఇనుప వాటిని కంసాలి చేస్తాడు. కర్రతో చేసె వాటిని వడ్రంగి చేస్తాడు. నార, దారాలతో చేసే వటికి అనగా పగ్గం, తొండంతాడు, మోకు, మూజంబరం వంటి వాటిని రైతులు స్వంతంగా చేసుకుంటారు.

వీటిలో కొన్ని వాడుకలో లేక కనుమరుగైనవి. కపిలి, ఏతం, గూడ మొదలైన నీటి పారుదల ప్రక్రియలు పూర్తిగా వాడుకలో లేనందున దానికి సంబందించిన పరికరాలు ఎక్కడా కనబడవు. వ్యవసాయ పరికరాలలో మొదటిగా చెప్పుకోదగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసినది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుము తో చేసినది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి.

వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయ డానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడ వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు. కత్తి, కొడవలి, గొడ్డలి. కొడవలి: వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయ డానికి ఉపయోగిస్తారు. అలాగే పశువుకు గడ్డి కోయడానికి ఉవయోగిస్తారు. ఇది చిన్న కత్తి లాగె వుండి వంపు వైపు సన్నని రంపపు వళ్లు లాంటి పళ్లు కలిగి వుంటుంది. దీనికి పదును వుండదు. తేలికగా వుంటుంది. కత్తి: కత్తులు చాల రకాలు. చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్ట డానికి, చెరుకు కొట్టడానికి, వాడుతారు. పెద్ద కత్తి: దీన్ని పెద్ద కొమ్మలు కొట్ట డానికి ఉపయోగిస్తారు.

వేట కత్తి: దీన్ని వేటను నరక డానికి, లావు పాటి కొమ్మలను నరక డానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ. కొంకి: ఇది కత్తికన్న ఎక్కువ వంపు కలిగి వుండి, దానికి పిడి బదులు అక్కడ ఒక రంధ్రం వుంటుంది. అందులో పొడవాతి వెదురు కర్రను దూర్చి వుంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ. గొడ్డలి: చిన్నగొడ్డలి.. పెద్ద గొడ్డలి రెండు రకాలు. చిన్న దాన్ని చిన్న పనులకు, పెద్ద దాన్ని పెద్ద పెద్ద మానులను నరకడాని కుపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా వుండదు. తొలిక: మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి, వాడు తారు. చిలుకు దోటి: సన్నని పొడవాతి వెదురు కర్రకు కొసన ఒక కొక్కెము తగిలించి వుంటుంది: దీంతొ ఎత్తైన చెట్ట్ల కొమ్మల్లో వుండే చింత కాయలు, ములక్కాయలు ఇతర కాయలను కోయ డానికి ఉపయోగిస్తారు. చిక్కం దోటి: చిలుకు దోటి లాంటిదే.

కాని దీనికి చివరన ఒకచిన్న చక్రం లాంటిది వుండి దానికి చిన్న వల వుంటుంది. దీన్ని చెట్లపై నున్న మామిడి కాయలను కోయ డానికి వాడతారు. మామిడి కాయలను చిలుకు దోటితో కోస్తే అవి కింద పడి దెబ్బలు తగిలి పాడవుతాయి. ఈ చిక్కంతో కోస్తే కాయలు ఆ చిక్కంలో (వలలో) తగులుకొని కింద పడవు. మెల్లిగా క్రిందికి దించి కాయలను తీసు కుంటారు. పార: మట్టిని తట్టల కెత్త డానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాల అవసరం. గడ్డ పార/గునపం: మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించ డానికి దీని వుపయోగం చాల వున్నది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండి వీటికి కావలసిన పరికరాలు అవి పని చేసె విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించ బడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలె పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు అయిదారు అడుగుల ఎత్తైన కర్రల వేదిక. వడిసెల: అరచేతి వెడల్పు తో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల రెండు చివరలన రెండు పొడవాటి దారాలు వుంటాయి.

మధ్యలో ఒక రాయిని పెట్టి రెండు దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిర గిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్ళి పడుతుంది.పొలాల్లో పక్షులను తోల డానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్ట డానికి లేదు. పూర్వం వడిసెలను యుద్దాలలో కూడా వాడినట్లు ఆధారాలున్నాయి. ఆరోజుల్లో వరి పంట పండించాలంటే… పొలాన్ని మూడు సార్లు మడకతో దున్ని, చువరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. ఒకపెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒక సారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురద లోనికి తొక్కుతారు. ఆకు అనగా, కానుగ, వేప, గంగ రావి, జిల్లేడు మొదలగు ఆకు తెచ్చి అడుసు లో వేసి తొక్కుకాతారు. పొలాల గట్టు మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి మోపులుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు.

ఇది పంటకు చాల సారవంత మైన సేంద్రియ ఎరువు. తర్వాత అదివరకే నారు పోసి వుంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు. ఆడ కూలీలు వచ్చి నాట్లు వేస్తారు. ఈ కూలీలు నాట్లు వేస్తూ పాటలు పాడతారు. ఈ పాటలు ఒకరు ఒక నుడుగు పాడితె మిగతా వారు కోరస్‌ గా పాడు తారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా, ఆ పాటలు విన సొంపుగా ఎంతో ఆహ్లాద కరంగా వుంటుంది. మధ్యాహ్న సమయానికి పొలం యజమాని ఇంటి నుండి కూలీలకు అన్నం సంగటి వస్తుంది. అప్పుడు కూలీలు బయటికి వచ్చి తమ బురద కాళ్లను కడుక్కొని చెట్టు కింద కూర్చొని చేతిలో సంగటి ముద్దను వేయించుకొని తింటారు. కొందరు చిన్న పిల్ల లున్న తల్లులు రెండు ముద్దల సంగటిని కొంగులో వేసుకుని మూట గట్టుకొని తాము తెచ్చుకున్న గిన్నెలో కూర పోయించు కొని ఇంటి కెళ్లి తమ పిల్లలకు అన్నం పెట్టి, చంటి పిల్లలుంటే వారికి పాలిచ్చి తిరిగి పనిలోకి వస్తారు. పొద్దు పోయిందాక వారు పని చేస్తారు.

వరి నాటిన నాలుగు వారాలకు కలుపు తీయాలి. ఇది కూడ బురదలో పనే. ఆడవారి పనే. తెల్ల వారి సద్దులు తాగి పనిలోకి దిగితే మధ్యాహ్నం ఒంటిగంటకు సంగటి తిని అరగంట అలసట తీసుకుని మల్లీ పనిలోకి దిగుతారు. కలుపు తీత లో కూడ వీరు పాటలు పాడుతారు. వరి నాట్లు, కలుపు తీయడం ఈ రెండు పనులలోనె ఈ పాటల కార్యక్రమం వుంటుంది. మిగతా ఏ పనిలోను ఈ కోరస్‌ పాటలుండవు. ఈపాటలు వారికి పనిలోని అలసటను మరిపించి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. వెలి దుక్కి (నీళ్లు పెట్టి అరిన తర్వాత దున్నే దుక్కిని వెలిదుక్కి అంటారు. నీల్లతో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అంటారు.) వెలి దుక్కి రెండు మూడు సార్లు దున్ని చివరి సాలులో పశువుల ఎరువు వేసి దున్ని సాళ్లు, కాలువలు కట్టి మడవలు ఏర్పాటు చేసి కొని ( మడవలు అంటే నాలుగు సాళ్లను ఒకటిగా నీటి పారుదల సౌకర్యం కొరకు చేసేవి) నాలుగు రోజులు ఆరనిచ్చి ముందుగానె సిద్దంచేసుకున్న చెరకు ముక్కల సుమారు ఒక అడుగు పొడవున్న వాటిని సాళ్లలో వరుసగా పేర్చి మధ్య మధ్యలో వున్న కాలువల ద్వారా నీటిని మడవలకు పారించి అక్కడున్ను చెరుకు ముక్కలను సాళ్లలో బూమిలో తక్కువ లోతులో పాతి పెడ్తారు.

ఆపొలానికి వారానికి అవసరాన్ని బట్టి తడి ఇస్తారు. ఒకటి రెండు నెలలకు చెరుకు మొలకెత్తి ఒక ఆడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. అప్పుడు నాగలి/మడకలతో ”సాలు” తోలు తారు. అనగా మడకలతో సాలు గట్టున దున్నగా గట్టుగా వున్నది సాలుగా, సాలుగా వున్నది గట్టుగా మారి చెరుకు మొలకలు వున్న సాలు జానెడెత్తు పూడి అది గట్టుగా మారుతుంది. ఇప్పుడు చెరకు మొక్కలు గట్టు మధ్యలో వుంటాయి. అప్పుడు తిరిగి మడవలు ఏర్పాటు చేసి నీళ్లు పారిస్తారు. చెరకు మూడు నాలుగడుగులు పెరిగాక ఆ మొక్కలను నాలుగైదింటిని ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే ఒకటిగా చుట్టు తారు. ఈ ఏర్పాటు చెరుకు గడలు నిటారుగా పెరగడానికి. ఆ తర్వాత రెండు మూడు నెలలకు మరలా మరో చుట్టకం వేస్తారు. ఇప్పుడు రెండు సాళ్లలోని గడలను పైన ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే చుడ్తారు. చెరకు పెరిగే పొడవును బట్టి మరో చుట్టకం వేస్తారు. అవసరం అయితే చెరకు గడలు పడి పోకుండా కర్రలతో వూతం కూడ ఏర్పాటు చేస్తారు. అవసరం వుంటే జడ చుట్టకం వేస్తారు. అనగా రెండు మూడు సాళ్లలోని గడలను ఒకటిగా చేర్చి సాలు పొడవునా చెరకు ఆకులతోనే జడలాగ … దారం లాగ అల్లి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

చెరకు పంట సాధారణంగ పది నెలల పంట. ఆ రోజుల్లో విస్తారంగా చెరకు తోటలు వుండేవి. అందు చే గుంట నక్కల బెడద ఎక్కువ. అవి చెరకులను కొరికి రసాన్ని పీల్చేవి. దాని వల్ల రైతు కు నష్టం. దాని నివారణకు కుండ పులి అనే ఒక సాదనాన్ని రైతు తయారు చేశాడు. అది ఎలాగంటే… మామూలు గా వుండే ఒక రేకు డబ్బాను తీసుకొని దానికి ఒక వైపున పూర్తిగా మూతను తీసేసి రెండో వైపున వున్న మూతకు మధ్య లో ఒక చిన్నని రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒక జనుము పోసను కట్టి దాన్ని తడి చేసి డబ్బాలోపలి వైపున రెండు చేతులతో జమ్మును వేళ్లను జారుడుగా సాగ దీస్తే అది బయంకరమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి గుంట నక్కలు పారి పోతాయి. ఇప్పిడిప్పుడు ఆరు నెలల చెరకు వంగడం ప్రచారంలో వున్నది. దీని ప్రత్యేకత ఏమంటే పంట కాలం తక్కువ, రసంలో తీపి శాతం ఎక్కువ, పొడవు తక్కువ కనుక గాలికి పడిపోదు. పైగా చెరకు గడ గట్టిగా వుంటుంది కనుక గుంట నక్కలు కొరకలేవు.

పక్యానికొచ్చిన చెరకును చక్కెర మిల్లులకు పంపు తారు. కాని ఎక్కువగా రైతులు స్వంతంగా బెల్లం తయారికి మొగ్గు చూపు తారు. ఎందుకంటే?…. చక్కెర మిల్లుల నుండి చెరకు కొట్టడానికి అనుమతి పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొట్టిన చెరకును మిల్లుకు తీసుకెళ్ళడానికి మరి కొంత సమయం పడుతుంది. ఇంత లోపల కొట్టిన చెరకు గాలికి ఆరి పోయి బరువు తగ్గి పోయి రైతుకు నష్టం. చెరకు కొంత ఆరితే చెక్కెర శాతం పెరుగు తుంది దానివలన మిల్లుకు అది లాభం. అందుకే వారు ఆలస్యం చేస్తారు. మొదట సారి చెరకు నాటి అది పక్యానికి వచ్చింతర్వాత ఆ చెరకును కొట్టి బెల్లంచేసింతర్వాత ఆపొలంలో చెరకు ఆకు మిగిలి వుంటుంది. దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ తర్వాత దానికి నీరు పార గట్టితే చెరకు మొదళ్లలోనుండి పిలకు వచ్చి మరల చెరకు తోట పెరుగుతుంది. ఈ విదంగా రెండు మూడు సార్లు చేయ వచ్చు. దీనిని మర్దాలు తోట, కాసి తోట, లేదా మొక్క తోట అంటారు. ఇందులో కూడ మొదటి తోటలో లాగానె అంతర కృషి చేసి ఎరువులు వేయాల్సి వుంటుది.

ఈ పంట కొంత తొందరగా కోతకు వస్తుంది. ఖర్చు, శ్రమ కొంత తక్కువ. రైతు తన అవసరాలకు పోగా నాలుగు డబ్బులు కళ్లజూసె మరో ప్రధాన పంట వేరు శెనగ. ఇది మెట్ట పంట. కేవలం వర్షాదార పంట. తొలకరి వర్షాలు పడగానె చేలల్లో దుక్కి దున్ని సిద్దం చేసు కుంటారు. ఒకరోజు సాలుకు సాలుకు ఒక జానెడు దూరం వుండేటట్లు మడకలతో దున్నుతూ సాలు వెంబడి వేరు శనగ విత్తనాలు వేస్తారు. ఇలా ఐదారు సాల్లకు ఒక సాలు కందులు, జొన్నలు, అనప గింజలు, పెసలు, అనుములు, అలసందలు వంటి అపరాలు వేస్తారు. విత్తనాలు మొలకెత్తిన సుమారు ఒక నెల తర్వాత కలుపు తీయాలి.

అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో తొలిక లతొ కలుపు మొక్కలను తొలిగిస్తారు. ఎద్దులతో నడిచే గుంటక అనే సాధనంతో కూడా కలుపు తీస్తారు. ఊడలు దిగే సమయాన చెట్టు చుట్టు మెల్లిగా త్రవ్వితే వూడలు బాగ దిగి కాయలు బాగ కాస్తాయి. ప్రకృతి కరుణించి సకాలం లో వర్షాలు పడితే …. రైతు ఇంటి కి కావలసిన అన్ని అపరాలు, ఇంటికి చేరుతాయి. ఇంటి ఖర్చుకు పోగా మిగిలిన వేరుశెనగ కాయలు అమ్ము కుంటె రైతు నాలుగు రూకలు ఆనందంతో కళ్ల జూస్తాడు. ఇదంతా గతం. ఇప్పుడు అకాల వర్షాలతో ఈ మెట్ట పంటలు వేసిన రైతులు భూమి దున్నిన కూలి, వేసిన విత్తనాల ఖర్చు కూడ నష్ట పోయే పరిస్థితి దాపురించింది. ఇవి మెట్ట పంటలు. వర్షాదార పంటలు. వీటి మధ్య మధ్య సాలుల్లో ఇతర అపరాల, పప్పు దినుసుల పంటలు కూడ వేస్తారు. జొన్న సజ్జ పంటలకు పంట దశలో పక్షులు, పిట్టల బెడద ఎక్కువ.

వాటి నివారణ కొరకు చేలు మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక నిర్మించి దానిపైకెక్కి వడిసెల లో రాళ్లు పెట్టి కొట్టి పక్షులను కాకులను తరుముతారు. ఆ వేధికనే మంచె అంటారు. ఇవి కూడ ఆహార పంటలే. కాని మెట్ట పంటలు. అచ్చంగా వీటినే పండించ కుండా వేరుశనగ పంటలో అంతర్‌ పంటగా వేసే వారు. తగు మాత్రం పండించు కునే వారు. ఇంటి అవసరాల కొరకు, వైవిధ్య ఆహారం కొరకు. కాని ఆ కొర్రల, ఆరెకల అన్నం వట్టిది తిన్న చాల రుచిగా వుంటుంది. పైగా ఈ పంట చాల సులబంగా ఎలాంటి తెగుళ్ల బారిన పడకుండా, ఎరువులు ఏమి లేకున్న వర్షాదార పంటగా పండు తుంది. కాని ఏ కారణం చేతనో ఆపంట పూర్తిగా కనుమరుగై చాల కాలమే అయినది. కానీ పట్టణాలలి కొన్ని చోట్ల చెక్కెర వ్యాది గ్రస్తులకు రాగులు, కొర్రలు, ఆరెకలు, ఎర్ర జొన్నలు అమ్మబడును అనే బోర్డులున్నాయి.

వీటినె కొన్ని ప్రాంతాలలో తైదులు అంటారు. ఇవి ఆవాలంత చిన్నవి. వీటిని మెట్ట పంట గా గాని, లేద నీటి పారుదల కింద గాని పండిస్తారు. ఇది తక్కువ కాలపు పంట. వీటిని రైతులు ప్రతి యొక్కరు పండించేవారు. రాగులను రాగల్రాయి లో వేసి విసిరి. పిండి చేసి ఆ పిండిని అన్నం వండే టప్పుడు అందులో వేసి కెలికి దాన్ని ముద్దలు ముద్దలు గాచేసి తిటారు. వాటినే రాగి ముద్దలు అంటారు. రాగులు చాల బలవర్దకమైన ఆహారం. చాల రుచి కరమైనది కూడ. అందుకే ఈ రోజుల్లో కూడ పట్టణాలలోని పెద్ద పెద్ద హోటళ్లలో రాగి సంగటి ని ప్రత్యేక మైన ఆహార పదార్థంగా వడ్డిస్తుంటారు. రాగి పిండితో జావ కూడ తయారు చేస్తారు.ఇది చాల భలవర్థకమైన పదార్థం. ఆరోగ్యానికి కూడ చాల మంచిది. ఆ రోజుల్లో రైతు నిత్యం డబ్బు మొఖం జూసె పంట ఆకు తోట. ఇది తమలపాకుల తోట.

ఇవి విస్థారమైన తోటలు కాదు. ఏ కొద్ది మంది రైతులే చాల కొద్ది విస్థీర్ణంలో వేసె వారు. అయినా ఆదాయం బాగానె వుండేది. అయితే ఆకు తోట పెంపకం అత్యంత నిష్టతో, అంటు , ముట్టు తగల కుండా పెంచాలి. ఎవరు పడితె వారు ఆ తోటలోనికి పోకూడదు. యజమాని రైతే లేదా వారి కుటుంబ సబ్యులు మాత్రమె లోనికెళ్లెవారు. వారాని కొక సారి గోరు గిల్లు (బొటన వేలుకు తగిలించుకునే ఇనుపగోరు)తో ఆకులను గిల్లి వారపు సంతలో అమ్మే వారు. వాటికి ధర బాగానె వుండేది. మారు బేర గాళ్లు తోట దగ్గరకే వచ్చి ఆకులను కొనుగోలు చేసె వారు. ఈ ఆకు తోటకు చుట్టు దట్టమైన దడి ఆరడుగుల ఎత్తు వుండి దానికి మూడడుగుల చదరంలో ఒక చట్రం వుండి దానికి ఒక తలుపు వుండేది. దానికి తాళం వేసుకునే వాడు రైతు.

ఈ తమలపాకులకు ఇప్పుడు కూడ మంచి ధర వున్నా ఏ కారణం చేతనో ఆ పంట దాదాపుగా కనుమరుగై పోతున్నది. పండ్ల తోటలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి మామిడి తోటలు ఇవి చాల విస్తారంగా వుంటాయి. ఈ మధ్యన రైతులు ఈ మామిడి తోటలపై ఎక్కువ మక్కువ చూపు తున్నారు. కారణ మేమంటే వరి వంటి నీటి పంటలకు నీరెక్కువ కావాలి. వర్షాభావంతో నీటి లభ్యత చాల తక్కువ. అందు చేత చాల మంది రైగులు తమపొలాలలో వరి, చెరకు వంటి పంటలను మానేసి మామిడి తోటల వైపు మొగ్గు చూపు తున్నారు. ఈ మామిడి తోటలకు నీటి అవసరం తక్కువ. మామిడి చెట్లు నాటిన తరువాతి సుమారు మూడు సంవత్సరాల వరకు కొంత శ్రద్ద వహించి అంతర కృషి చేయాలి.

ఆ తర్వాత వాటంతట అవే పెరుగుతాయి. నీటి లభ్యతను బట్టి నీరు పారిస్తారు. లేకుంటే లేదు. ఈ తోటలలో మొదటి మూడు సంవత్సరాల వరకు ఇతర పంటలను, అనగా వేరుశనద, చెరకు మొదలైన పంటలను కూడ పండిస్తారు. ఈ పంటలకు పారించే నీరె మామిడి చెట్లకు కూడ సరిపోతుంది. ప్రత్యేకించి మామిడి చెట్లకు నీరు పెట్ట నవసరం లేదు. మూడు సంవత్సరాల తర్వాత మామిడి తోటలు కాతకు వస్తాయి. ఆ తర్వాత చాల సంవత్సరాల వరకు తోటలు పెరుగుతూనె వుంటాయి., కాత కాస్తూనె వుంటాయి. దీనిలో శ్రమ చాల తక్కువ. మామిడి పూత, పిందె సమయాలలో మాత్రము జాగ్రత్త వహించి అవసరాన్ని బట్టి మందులు చల్లాలి. ఇప్పుడు ఈ మామిడి తోటలు విస్తారంగా పెరిగి పోతున్నందున ఒక్కోసారు పంట దిగుబడి ఎక్కువై ధర పడి పోయి రైతులకు నిరాశ మిగులుతోంది.

కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి తగ్గి పోతున్నది. ఆ కారణంగా కూడ రైతులు నష్ట పోతున్నారు. మామిడి కాత బాగ కాసి రైతు ఆనంద పడుతున్న సమయాన మే నెలలో విపరీతమైన గాలి వడగండ్ల వానలు వచ్చి పక్వానికి రాని ఆ మామిడి కాయలన్ని నేల రాలి పోతాయి. ఆ సందర్బాలలో రైతుల ఆవేదన వర్ణనాతీతం: ఇలాంటి ప్రకృతి పరమైన ఇబ్బందులే కాక మానవ కల్పిత ఇబ్బందుల వలన కూడ మామిడి రైతులు కొన్ని సార్లు నష్ట పోతున్నారు. ఈ చుట్టు పక్కల మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు అనేకం వున్నాయి. అవి సరిగా రైతుల నుండి కాయలను కొనుగోలు చేస్తే రైతుకు మంచి గిట్టు బాటు అవుతుంది. కాని ఒక్కోసారు ఈ పరిశ్రమల యజమానులంత ఏకమై (సిండికేట్‌) కూడబలుక్కొని రైతు పండించిన మామిడికి మిల్లుల యజమానులు ధర నిర్ణయిస్తారు.

రైతు ఈ మామిడిని నిల్వ చేసు కోలేడు. మిల్లులు వారు చెప్పిన ధరల ప్రకారం తప్పని సరిగా వారికి అమ్మాల్సిందే. ఈ విధంగా రైతులు మోస పోతున్నారు. కలుపు మొక్కలు పలు విదాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంట్టకు నష్టం కలిగిస్తాయి. వాటిని కూలీలు చాకచఖ్యంగా సులబంగా గుర్తిస్తారు. పీకేస్తారు. కాని ఒక రకమైన కలుపు మొక్క వుంటుంది. దాని పేరు ”ఊదర” .ఇది ఎలా వరి మొక్కల మధ్యలో చేరుతుందో గాని ఇది చాల మోస కారి మొక్క. ఈ ”ఊదర” మొక్క పూర్తిగా వరి మొక్క లాగే వుంటుంది. వరి మొక్కల మధ్య చేరి అక్కడున్న బలాన్ని అతి తొందర గా పీల్చు కుంటాయి. సకాలంలో వాటి నిపీకేయక పోతె వరి పంట పండదు.

అంతా ఊదర పంటే. అవి ఎంత మోసకారివైన ఈ కూలీల కళ్లు గప్పలేవు. చూడ డానికి ఒకే విధంగ వున్న అవి అతి వేగంగా ఏపుగా పెరిగు తాయి. వరి మొక్కలన్ని ఒక విధంగా వున్నా వరి మొక్కలాగే వున్న ఈ ఊదర మొక్కలు కొంత బలంగా ఏపుగా వుంటాయి. ఆ తేడాను బట్టి గుర్తించి వాటిని పీకి అక్కడె ఆ బురదలోనె పూడ్చేస్తారు. ఒకటొ అరో మిగిలిపోతే అవి వెన్ను వచ్చినప్పుడు మాత్రమె గుర్తించ గలము. అప్పుడు రైతులు ఆ వెన్ను లన్ని పక్యానికి రాక ముందే పీకి పారేస్తారు. ఈ కలుపు మొక్క కేవళం వరి పొలాల్లో మాత్రమే పెరుగు తుంది. మరే ఇతర పంటలలోను ఇది పెరగదు.

ఇతర పంటల్లో పెరిగితే దీని ప్రత్యేకతను గుర్తించి పీకేస్తారేమో నని దానికి ముందె తెలుసు నేమో? రెండు సార్లు కలుపు తీసిన తర్వాత రెండు నెలలకు వరి పొట్ట కర్ర కొస్తుంది., ఆ తర్వాత ఆ పొట్ట పగిలి వెన్ను బయటకు వచ్చి పాలు పోసుకుంటుంది. ఆ సమయాన ”గువ్వలు” దాడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. వాటిని గిజిగాడు అంటారు. ఇవి ఊర పిచ్చుకల కన్న చిన్నగా వుండి వేల సంఖ్య లో వుంటాయి. పొలాల చుట్టు పక్కల చెట్ల మీద అందమైన గూళ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి. వీటి గూళ్లు చాల అందంగా ఒకటి రెండంతస్తులను కూడ కట్టు కుంటాయి.

అవి తమ ఇళ్లల్లో అనగా గూళ్లల్లో దీపాలు కూడ పెట్టు కుంటాయి. ఈత, చెరకు వంటి ఆకులనుండి పొడవాటి ఈనెలను తీసి చెట్టు చిటారు కొమ్మన, ముఖ్యంగా బావుల్లోకి వాలి వున్న చెట్ల కొమ్మలకు అందమైన గూళ్లు అల్లి అందులో నివసిస్తుంటాయి. చీకటి పడేముందు పొలాల్లో మిణుగురు పురుగులు వెలుగులు చిమ్ముతు ఎగురుతుంటాయి. వాటిని పట్టి తీసుకెళ్ళి వాటిని చంపకుండా తమ గూటిలో పైబాగాన వుంచిన బంక మట్టికి గుచ్చి ఆ వెలుగులో అవి కాపురం చేసుకుంటాయి. రెండు మూడు పురుగులు చాలు ఆ గూటిలో వెలుగు నింపడానికి. ఆ మిణుగురులు చని పోతె వెలుగు రాదు. ప్రతి రాత్రి కొత్త మిణుగురులని తెచ్చి దీపాలు పెట్టు కుంటాయి. వేలెడంత లేని ఈ పిట్టకు ఇంత తెలివి ఎలా వచ్చిందో అని ఆచ్యర్య పోవలసినదే. వాటి గూడు నిర్మాణ శైలి కూడ అంత అందంగా వుంటుంది.

ఈ పిట్టలు వరికంకులు పొట్ట పగిలే దశలో వందలాదిగా గుంపులు గుంపులుగా వరికంకుల మీవాలి ఆ లేత గింజలను తమ ముక్కులతో వత్తి అందులో వచ్చే తెల్లని పాలను తాగుతాయి. పంట పండాక ఇటువంటి గింజలు అన్నీ తాలు గింజలే. అందు చేత ఆ సమయంలో గువ్వలను తోల డానికి రైతు పొలం దగ్గర కాపలా వుండవలసినదే. కంకుల్లో గింజ ముదిరాక ఈ గువ్వలు రావు. గింజలు ముదిరాక ఎలుకలు బాద మరొకటి వుంది. ఎలుకలు గట్టుల్లో బొరియలు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచు కుంటాయి. ఈ విధంగా కూడ రైతుకు పంట నష్టం. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్యం ఉచ్చులను, విషపు బిళ్లలను సరపరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది.

కాని ఆ రోజుల్లో ”ఇర్ల వాళ్లు” ఎలుకలను పట్టడాని పలుగు, పార, చిన్న గునపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ ఎలుక బొరియ కనబడితె అందులోకి ఊదర తో పొగ పెట్టి త్రవ్వి ఎలికలను పట్టి, అవి ఆ బొరియల్లో దాచి పెట్టిన వరి కంకులను చేజిక్కించుకునే వారు. (”ఊదర ” అనగా సన్న మూతి గల ఒక మట్టి కుండలో ఆకులలములు, చెత్త వేసి దానికి మంట పెట్టి దాని మూతిని ఎలుక బొరయకు బోర్లించి కుండకు వెనక నున్న సన్నని రంధ్రంద్వార నోటితో గాలిని ఊదుతారు. అప్పుడు కుండలోనుండి దట్టమైన పొగ వచ్చి ఎలుక బొరియలంతా వ్వాపిస్తుంది. ఎక్కడైనా పొగ బయటకు వస్తే దాన్ని మూసేస్తారు. అలా కొంత సేపు పొగ పెట్టగా లోపల వున్న ఎలుకలు పొగతో ఉక్కిరి బిక్కిరి అయి ఎక్కడైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అలా వచ్చిన ఎలుకలన్నింటిని వెంటనే పట్టేస్తారు.

ఆ తర్వాత నిదానంగా బొరియలను త్రవ్వి లోపలవున్న వరి కంకులను తీసు కుంటారు, ఇర్ల వాళ్లు ఎప్పుడూ ఆడవారు గాని మగ వారు గాని ఒంటరిగా తిరుగరు. సతీ సమేతంగానే తిరుగుతారు. అది వారి ఆచారం. అవకాశం లేనప్పుడు బార్య తమ్ముడిని గాని అన్నను గాని వెంట వేటకు తీసు కెళతారు గాని, తన తమ్మున్ని లేక అన్నను ఎట్టి పరిస్థితుల్లోను వెంట తీసుకెళ్లరు.) ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకు తుంది. ఇప్పటికి వీ ఎలుకలను మెట్ట పైర్లలో , ఇతరత్రా పడుతున్నారు. ఈ ఇర్ల వాళ్లు ఒక జాతి ప్రజలు. వారి వృత్తి కేవళం తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం.

వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు. వరికంకులు గింజ కట్టి ముదిరి పైరు ఎర్ర బారితే ఇక ఆ పొలానికి నీరు కట్టడం మానేస్తాడు రైతు. ఇక పదిరోజుల్లో కోతకు సిద్దం అవుతుంది. కూలీలలు పిలిచి, తన కుటుంబ సబ్యులతో కలిసి కొడవళ్లు తీసుకొని వరికోతకు ఉపక్రమిస్తాడు రైతు. పొలం అంతా కోసి వాదులు (కుప్పలు) వేసి నాలుగు రోజులు ఎండనిచ్చి వాటిని మోపులు కట్టి ఐదారు మోపులను పొలంలోనె వదిలి మిగతా అన్నీంటిని కళ్ళం లోనికి చేర్చి కూలీలను పెట్టి తనూ ఒక చెయ్యీ వేసి వాది కొట్టి (నూర్చి) గింజలను వేరు చేస్తారు.

పొలంలో వదిలిన ఈ ఐదారు మోపుల వృత్తి పరి వారికి మేర కొరకు వదిలేస్తారు. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, నీరుగట్టోడు, మొదలగు వారు తలా ఒక మోపు వాలిళ్లకు తీసుకెళ్ళి దాచుకొని, అలా అందరి దగ్గరనుండి మోపులు తెచ్చి ఒక రోజున వాటిని నూర్చి వడ్లను వేరు చేసుకుని ఉపయోగించు కుంటారు. రైతు తన కల్లంలొ వున్న ఆ గింజలనుండి తాలు, తప్పలను వేరు చేయడానికి తూర్పార పట్టు తారు. ఆ వడ్లను బస్తాలకు నింపి తన ఎడ్ల బండి మీద ఇల్లు చేరుస్తారు.

140 COMMENTS

 1. Hello, i read your blog occasionally and i own a similar one and i was just curious if
  you get a lot of spam feedback? If so how do you reduce it,
  any plugin or anything you can advise? I get so much
  lately it’s driving me insane so any help is very much appreciated.

 2. Excellent post. I used to be checking constantly
  this blog and I’m impressed! Very helpful information particularly the ultimate part 🙂 I take
  care of such info a lot. I was seeking this particular info for a long time.
  Thanks and best of luck.

 3. Everything is very open with a clear clarification of the issues.
  It was definitely informative. Your site is
  very useful. Many thanks for sharing!

 4. It’s perfect time to make some plans for the future
  and it is time to be happy. I’ve read this post and if I could I desire to suggest
  you few interesting things or advice. Perhaps you can write next articles referring to this article.
  I desire to read even more things about it!

 5. I’ve been browsing on-line more than 3 hours as
  of late, yet I never discovered any interesting article like yours.
  It’s lovely price sufficient for me. In my
  opinion, if all site owners and bloggers
  made just right content as you did, the web shall be much more useful than ever before.

 6. Pretty nice post. I just stumbled upon your weblog and wished to say that I’ve really enjoyed browsing your blog posts.
  In any case I’ll be subscribing for your rss feed and I hope you
  write once more very soon!

 7. Excellent blog! Do you have any tips and hints for aspiring writers?
  I’m hoping to start my own website soon but I’m a little lost on everything.

  Would you propose starting with a free platform like WordPress
  or go for a paid option? There are so many options
  out there that I’m totally confused .. Any recommendations?

  Thanks a lot!

 8. I would like to thank you for the efforts you’ve put in penning this website.
  I am hoping to view the same high-grade content by you later on as well.
  In truth, your creative writing abilities has encouraged me to get
  my very own website now 😉

 9. Wow that was odd. I just wrote an really long comment but after I
  clicked submit my comment didn’t show up. Grrrr…

  well I’m not writing all that over again. Anyways, just wanted to say wonderful blog!

 10. I was wondering if you ever thought of changing the layout of
  your website? Its very well written; I love what youve got to say.
  But maybe you could a little more in the way of content so people could connect with it better.

  Youve got an awful lot of text for only having one or two images.
  Maybe you could space it out better?

 11. Simply want to say your article is as amazing.
  The clarity in your post is just cool and i could
  assume you’re an expert on this subject.
  Fine with your permission let me to grab your RSS feed to keep up to date with forthcoming post.
  Thanks a million and please continue the rewarding work.

 12. I think other website proprietors should take this website as an model, very clean and excellent user friendly style and design, let alone the content. You are an expert in this topic!

 13. Wonderful article! That is the kind of information that are supposed to be shared
  across the net. Disgrace on Google for not positioning this submit upper!
  Come on over and discuss with my site . Thank you =)

 14. hello!,I really like your writing very much! percentage we communicate extra about your
  post on AOL? I require an expert in this area to resolve my problem.
  May be that is you! Looking forward to see you.

 15. This particular blog is without a doubt awesome and besides informative. I have chosen a bunch of useful stuff out of this blog. I ad love to come back again and again. Cheers!

 16. This is a really good tip particularly to those new to the blogosphere. Brief but very accurate information Thank you for sharing this one. A must read article!

 17. You received a really useful blog I ave been right here reading for about an hour. I am a newbie as well as your good results is extremely considerably an inspiration for me.

 18. I just want to say I am just newbie to blogging and definitely loved you’re web-site. More than likely I’m want to bookmark your blog post . You actually have fabulous articles and reviews. Appreciate it for revealing your web site.

 19. My brother recommended I might like this blog. He was totally right. This post truly made my day. You can not imagine just how much time I had spent for this info! Thanks!

 20. If you are ready to watch comical videos online then I suggest you to visit this web page, it consists of really thus funny not only videos but also extra data.

 21. I think other web-site proprietors should take this website as an model, very clean and magnificent user genial style and design, as well as the content. You are an expert in this topic!

 22. What as Happening i am new to this, I stumbled upon this I have found It positively useful and it has aided me out loads. I hope to contribute & assist other users like its aided me. Good job.

 23. Undeniably believe that which you stated. Your favorite reason seemed to be on the net the easiest thing to be aware of.
  I say to you, I definitely get annoyed while people consider worries that they just do not know about.
  You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having
  side effect , people can take a signal. Will likely be back to get more.
  Thanks

 24. Simply a smiling visitor here to share the love (:, btw outstanding design. аЂа‹аЂ Audacity, more audacity and always audacity.аЂ аЂа› by Georges Jacques Danton.

 25. I truly love your blog.. Excellent colors & theme.

  Did you make this website yourself? Please reply
  back as I’m hoping to create my own personal website and want to find out where you got this from or exactly what the theme is called.

  Cheers!

 26. Wow, awesome blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your web site is great, let alone the content!

 27. Hello! Someone in my Myspace group shared this website with us so I came to
  give it a look. I’m definitely enjoying the information. I’m book-marking and will be
  tweeting this to my followers! Superb blog and superb style
  and design.

 28. Usually I don at learn post on blogs, but I wish to say that this write-up very forced me to check out and do so! Your writing style has been amazed me. Thanks, very nice post.

 29. Thanks for any other excellent article. Where else may anyone get that kind of info in such a perfect means of writing? I have a presentation subsequent week, and I am at the search for such info.

 30. This is really interesting, You are a very skilled blogger. I ave joined your rss feed and look forward to seeking more of your great post. Also, I ave shared your site in my social networks!

 31. Wow! This can be one particular of the most useful blogs We ave ever arrive across on this subject. Basically Magnificent. I am also an expert in this topic therefore I can understand your hard work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here