కాంచీపురం, ఆగస్టు 21 (న్యూస్‌టైమ్): 1979 సంవత్సరంలో కాంచీపురంలోని అత్తి వరదరాజస్వామి కోనేటి లోంచి భక్తులకు దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు మనలో చాలా మంది అప్పటికి పుట్టి ఉండము. ఒకవేళ పుట్టినా, అప్పట్లో ఈ వాట్సాప్‌లు,ఫేస్‌బుక్‌లు లేవు కనుక, ఆ స్వామి గొప్పదనం మనకి తెలియదు.

ఈ 2019లో ప్రత్యక్షంగా స్వామిని చూడలేకపోయిన, కనీసం ఇలా ఫోన్‌లో అయినా చూడగలుగుతున్నాం. ఇంక 2059 పరిస్థితి మనకి తెలియదు. ఒక్కరోజు స్వామిని చూడటమే మహద్భాగ్యం. అలాంటిది స్వామి 47 రోజులు, ప్రతీ రోజూ స్వామి వారి అలంకరణ చూడటం అనేది, మామూలుగా అసంభవం. కానీ ఆ అదృష్టం ఈ వీడియో వల్ల కలుగుతుంది. మీరూ చూసి తరించండి.